అన్వేషించండి

కొత్త లుక్‌తో వస్తున్న Honda Elevate Facelift.. లోపల, బయట కీలక మార్పులతో అక్టోబర్‌ 6న లాంచ్‌

హోండా ఎలివేట్‌ ఫేస్‌లిఫ్ట్‌ బుకింగ్స్‌ రూ.21 వేలతో ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 6న లాంచ్‌ కానున్న ఈ SUVలో కొత్త డిజైన్‌, లైటింగ్‌ & ఇంటీరియర్‌ మార్పులు ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు ప్రారంభం; అక్టోబర్ 6న విడుదల.
  • కొత్త గ్రిల్, LED లైట్లు; ఇంటీరియర్‌లోనూ మార్పులు, ఫీచర్లు.
  • 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్; హైబ్రిడ్ వెర్షన్ ఉండకపోవచ్చు.

Honda Elevate Facelift Details In Telugu: హోండా ఎలివేట్‌ ఫేస్‌లిఫ్ట్‌ కొనాలని కొంతకాలంగా ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌. ఈ కొత్త SUV కోసం హోండా కంపెనీ బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా హోండా డీలర్‌షిప్‌లలో బుక్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌ కోసం రూ.21,000 టోకెన్‌ అమౌంట్‌ చెల్లించాలి. కొత్త ఎలివేట్‌ ఫేస్‌లిఫ్ట్‌ను అక్టోబర్‌ 6న భారత మార్కెట్లో లాంచ్‌ చేయనున్నారు.

ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా హోండా ఇటీవలే విడుదల చేసింది. ఇందులో కారు బయట డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లో చేయబోయే కొన్ని మార్పులు కనిపించాయి. అయితే ఇంజిన్‌ విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

కొత్త లుక్‌లో ఎలివేట్‌

ఎలివేట్‌ ఫేస్‌లిఫ్ట్‌ ముందు భాగంలో కొత్త గ్రిల్‌ కనిపిస్తుంది. ఇందులో మెరుస్తున్న ఆరు కోణాల డిజైన్‌ ఉపయోగించారు. ఇప్పటివరకు గ్రిల్‌పై ఉన్న హోండా లోగోను బానెట్‌పైకి మార్చారు.

కొత్త LED డేటైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్స్‌ కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇవి హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే తరహాలో సెగ్మెంటెడ్‌ డిజైన్‌తో ఉన్నాయి. హెడ్‌లైట్లు & ఫాగ్‌ ల్యాంప్‌ హౌసింగ్‌లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించడం లేదు.

వెనుక భాగంలో కనెక్టెడ్‌ LED టెయిల్‌ ల్యాంప్స్‌ కొత్తగా వస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం కూడా టీజర్‌లో కనిపించింది. ఎడమ వైపు ORVMపై కెమెరా పాడ్‌ ఉంది. దీంతో కొత్త ఎలివేట్‌లో కూడా 360 డిగ్రీల కెమెరాకు బదులుగా లేన్‌ వాచ్‌ కెమెరా వ్యవస్థనే కొనసాగించే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌లోనూ మార్పులు

ఎలివేట్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరియర్‌ను టీజర్‌లో పూర్తిగా చూపించలేదు. అయితే డ్యాష్‌బోర్డ్‌లో కొత్త డిజైన్‌ కనిపించింది. తెలుపు రంగు లెదరెట్‌ ప్యాడింగ్‌ & స్టిచింగ్‌ను ఎక్కువగా ఉపయోగించినట్లు తెలుస్తోంది.

డ్యాష్‌బోర్డ్‌ & డోర్‌ ప్యాడ్స్‌పై అంబర్‌ యాంబియంట్‌ లైటింగ్‌ కూడా కనిపించింది. ప్రస్తుతం ఉన్న ఎలివేట్‌లో యాంబియంట్‌ లైటింగ్‌ డీలర్‌ స్థాయిలో యాక్సెసరీగా అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: 5 New Cars In October: కారు కొనాలనుకుంటున్నారా ? దసరా, దీపావళి కంటే మార్కెట్లోకి 5 కొత్త కార్లు

కొత్త ఫీచర్లు వచ్చే అవకాశం

ఫేస్‌లిఫ్ట్‌లో ఫీచర్ల జాబితాను హోండా ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే పోటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. పానోరమిక్‌ సన్‌రూఫ్‌, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, పవర్డ్‌ కో-డ్రైవర్‌ సీటు & వెనుక సన్‌బ్లైండ్స్‌ వంటి ఫీచర్లు ఇందులో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే పెట్రోల్‌ ఇంజిన్‌

ఎలివేట్‌లో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్‌ 4 సిలిండర్‌ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌నే ఎలివేట్‌ ఫేస్‌లిఫ్ట్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్‌ 121hp శక్తి & 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ లేదా 7 స్టెప్‌ CVTతో ఇది అందుబాటులో ఉంటుంది.

హోండా సిటీలో లభించే 1.5 లీటర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ను ఎలివేట్‌ ఫేస్‌లిఫ్ట్‌లో తీసుకురాకపోవచ్చని సమాచారం.

ఇది కూడా చదవండి: రూ.లక్షల్లో కొత్త కారు, రూ.వేలల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు! క్యాబ్‌లో తిరగడమే బెటర్‌ ఐడియానా?

ధర ఎంత?

ఫేస్‌లిఫ్ట్‌ రాకతో ఎలివేట్‌ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ SUV ధర రూ.11.81 లక్షల నుంచి రూ.16.36 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉంది.

హ్యుందాయ్‌ క్రెటా, మారుతి విక్టోరిస్‌, కియా సెల్టోస్‌, టాటా సియెర్రా, స్కోడా కుషాక్‌, ఫోక్స్‌వ్యాగన్‌ టైగూన్‌ & రెనాల్ట్‌ డస్టర్‌ వంటి మధ్యతరహా SUVలకు ఎలివేట్‌ పోటీ ఇస్తోంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు, ఎప్పుడు విడుదల అవుతుంది?

బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా హోండా డీలర్‌షిప్‌లలో రూ.21,000 టోకెన్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 6న భారత మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది.

కొత్త ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధాన బాహ్య మార్పులు ఏమిటి?

కొత్త గ్రిల్, బానెట్‌పైకి మార్చిన హోండా లోగో, కొత్త LED DRLలు, వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ దీనిలో ముఖ్యమైన మార్పులు.

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌కు కొత్త ఇంజిన్‌ వస్తుందా?

లేదు, ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. హైబ్రిడ్ ఇంజిన్ తీసుకురాకపోవచ్చని సమాచారం.

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్ & కొత్త ఫీచర్లు ఉంటాయా?

డాష్‌బోర్డ్‌లో కొత్త డిజైన్, లెదరెట్ ప్యాడింగ్, యాంబియంట్ లైటింగ్ ఉంటాయి. పోటీని బట్టి పానోరమిక్ సన్‌రూఫ్ వంటి కొత్త ఫీచర్లు ఆశించవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyundai Bayon ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ.10 లక్షలు.. హైదరాబాద్‌, విజయవాడలో ఆన్‌రోడ్ ధర ఎంతవుతుందంటే?
హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ధర ఎంత? విజయవాడలో ఎంత?.. పూర్తి లెక్కలివే!
Defender 110: ఇండియాలో తయారీతో రూ.34 లక్షలు తగ్గిన డిఫెండర్ 110 రేటు.. నవంబర్ 15 నుంచి డెలివరీలు
ఇండియాలో తయారీ వల్ల ఈ లగ్జరీ SUV ధర ఏకంగా రూ.34 లక్షలు తగ్గింది, మీరూ కొంటారా?
హ్యుందాయ్ లాంచ్ చేయనున్న కొత్త Electric SUV, టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ !
హ్యుందాయ్ లాంచ్ చేయనున్న కొత్త Electric SUV, టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ !
Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Embed widget