అన్వేషించండి

టెక్టన్‌ కంటే పెద్ద కారు త్వరలోనే రాబోతోంది.. నిస్సాన్‌ కొత్త 7 సీటర్‌ SUV ఫొటోలు లీక్‌!

నిస్సాన్‌ కంపెనీ కొత్త 7 సీటర్‌ SUVని పరీక్షిస్తోంది. టెక్టన్‌ కంటే పొడవుగా ఉండే ఈ SUV 2027లో విడుదల కానుంది. ధర రూ.18-22 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

Upcoming Nissan 7-seater SUV: నిస్సాన్‌ నుంచి మరో కొత్త SUV రాబోతోంది. ఇప్పటికే భారత మార్కెట్‌లో కొత్త మోడళ్లతో బలోపేతం అవుతున్న నిస్సాన్‌.. ఇప్పుడు 7 సీటర్‌ SUVపై ఫోకస్‌ పెట్టింది. ఈ కొత్త SUVని కంపెనీ రహస్యంగా పరీక్షిస్తోంది. తాజాగా, ఈ కారు టెస్టింగ్‌ సమయంలో కెమెరాకు చిక్కింది. టెక్టన్‌ ఆధారంగా ఈ SUV రూపొందుతున్నప్పటికీ.. డిజైన్‌ విషయంలో చాలా మార్పులు ఉండనున్నాయి.

కొత్త 7 సీటర్‌ SUVని 2027లో భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు నిస్సాన్‌ గతంలోనే ప్రకటించింది. నిస్సాన్‌ టెక్టన్‌తో ఈ కొత్త SUVకి కొన్ని పోలికలు ఉన్నప్పటికీ.. ఇది కేవలం టెక్టన్‌కు ఎక్స్‌టెన్షన్‌ వెర్షన్‌ మాత్రం కాదని కంపెనీ స్పష్టం చేసింది. టెక్టన్‌ మాదిరిగానే CMF-B ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించినా.. కొత్త SUVని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నట్లు నిస్సాన్‌ ఇండియా తెలిపింది.

భారీగా మారనున్న సైజు

టెస్టింగ్‌లో కనిపించిన SUV పూర్తిగా క్యామోఫ్లాజ్‌తో ఉంది. అయినప్పటికీ దాని పరిమాణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 5 సీటర్‌ టెక్టన్‌తో పోలిస్తే కొత్త SUV పొడవుగా కనిపిస్తోంది. వెనుక చక్రాల తర్వాత భాగం ఎక్కువగా ఉంది. వెనుక క్వార్టర్‌ ప్యానెల్‌ పొడవుగా ఉంటుంది. వెనుక క్వార్టర్‌ గ్లాస్‌ కూడా పెద్దదిగా కనిపిస్తోంది.

ముందు భాగంలో టెక్టన్‌లో కనిపించే ఇన్‌వర్టెడ్‌ L ఆకారపు LED డేటైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్స్‌ ఉంటాయి. LED హెడ్‌ల్యాంప్స్‌ కూడా కొనసాగనున్నాయి. అయితే క్యామోఫ్లాజ్‌ కారణంగా గ్రిల్‌, బంపర్‌ వివరాలు పూర్తిగా బయటకు కనిపించలేదు. కొత్త SUVలో వీటిని కొంతవరకు మార్చే అవకాశం ఉంది.

వెనుక భాగంలో మాత్రం డిజైన్‌ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెక్టన్‌లో కనిపించే C ఆకారపు LED టెయిల్‌ ల్యాంప్స్‌కు బదులుగా కొత్త SUVలో బూమరాంగ్‌ ఆకారపు టెయిల్‌ ల్యాంప్స్‌ ఉన్నాయి. ఇవి కిందివైపు కూడా విస్తరించినట్లు కనిపిస్తున్నాయి. రెండు టెయిల్‌ ల్యాంప్స్‌ను కలిపే LED లైట్‌ బార్‌ కూడా మరింత మందంగా ఉంది. వెనుక విండ్‌షీల్డ్‌ ఫ్లాట్‌గా ఉండేలా డిజైన్‌ చేశారు.

ఇది కూడా చదవండి: కైలాక్‌ నుంచి కొడియాక్‌ వరకు బాదుడు.. స్కోడా కార్ల ధరలు రూ.20,000 వరకు పెంపు

మూడు వరుసల సీట్లు

కొత్త నిస్సాన్‌ SUVలో మూడు వరుసల సీట్లు ఉంటాయి. మొత్తం ఏడుగురు ప్రయాణించేలా 5+2 లేఅవుట్‌ ఉండే అవకాశం ఉంది. క్యాబిన్‌ పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే టెక్టన్‌తో పోలిస్తే పెద్ద SUV కావడంతో అదనపు ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంది.

పెద్ద ఇంజిన్‌తో వచ్చే అవకాశం

ఇంజిన్‌ విషయంలో కూడా నిస్సాన్‌ కీలక మార్పు చేయనుంది. టెక్టన్‌లో ఉన్న 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను 7 సీటర్‌ SUVలో అందించే అవకాశం లేదు. దానికి బదులుగా టెక్టన్‌లోని 1.3 లీటర్‌ 4 సిలిండర్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

ఈ ఇంజిన్‌తో 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ & 6 స్పీడ్‌ వెట్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ వ్యవస్థ ఉండొచ్చని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Best Bikes Under Rs 1 Lakh: తక్కువ బడ్జెట్ అయితే ఈ బైక్‌లు కొనండి.. ఇంజిన్‌లో పవర్‌ఫుల్, మైలేజ్‌లో బెస్ట్

ధర ఎంత?

భారత మార్కెట్‌లో ఈ కొత్త 7 సీటర్‌ SUV ధర రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉండొచ్చని అంచనా. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ & హ్యుందాయ్‌ అల్కాజర్‌ వంటి 3 వరుసల SUVలకు ఇది పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?
Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!
పాత పల్సర్‌కు కొత్త హంగులు.. కొత్త పల్సర్‌ N250 SSలో వచ్చిన 5 కీలక మార్పులేవో మీకు తెలుసా?
Affordable Gloves Boots: రూ.15 వేలల్లోనే పూర్తి రైడింగ్ గేర్.. CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?
రూ.15 వేలల్లోనే బైక్ పూర్తి రైడింగ్ గేర్.. జాకెట్, గ్లౌజులు, బూట్లను ఎలా ఎంచుకోవాలి?
2026 KTM 200 Duke Review: కేవలం రూ.1,500 అదనపు ధర.. కేటీఎం 200 డ్యూక్‌లో 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
2026 కేటీఎం 200 డ్యూక్ రివ్యూ: ఈ బైక్‌లో వచ్చిన 5 కొత్త అప్‌డేట్స్, ప్రత్యేకతలు ఇవిగో!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget