అన్వేషించండి

Renault Triber కొనేవాళ్ల అసలు ఛాయిస్ ఇదే.. ఈ వేరియంట్‌లో ఫీచర్లు & పవర్ రెండూ పక్కా!

రెనాల్ట్‌ ట్రైబర్‌లో అథెంటిక్ నుంచి ఎమోషన్ వరకు ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? టర్బో ఇంజిన్, ధరలు & కీలక ఫీచర్లతో ఏ వేరియంట్ మీకు సరిపోతుందో తెలుసుకోండి.

Renault Triber Price, Mileage And Features Telugu: రెనాల్ట్‌ ట్రైబర్‌ కొనేవాళ్లు.. తమ అవసరానికి ఏ వేరియంట్ సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 2025లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో వచ్చిన ఈ 7 సీటర్ కారులో రెనాల్ట్‌ కీలక మార్పులు చేసింది. కొత్త డిజైన్‌తో పాటు ఫీచర్లు, భద్రత పరికరాలు, ఇంజిన్ ఎంపికలను కూడా అప్‌డేట్ చేసింది. ప్రస్తుతం ట్రైబర్ 4 ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్. ఈ నాలుగు వేరియంట్లలోనూ సహజ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు కొత్త టర్బో పెట్రోల్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

అథెంటిక్ వేరియంట్‌
ట్రైబర్ ప్రారంభ ధర రూ.5.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ లెవల్ అథెంటిక్ వేరియంట్‌లోనే 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయి. 14 అంగుళాల స్టీల్ వీల్స్, మాన్యువల్ AC, పవర్ విండోస్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక పార్కింగ్ సెన్సర్లు కూడా లభిస్తాయి.

ఎవల్యూషన్ వేరియంట్‌
రూ.6.73 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే ఎవల్యూషన్ వేరియంట్‌లో ఫీచర్ల జాబితా మరింత పెరుగుతుంది. అథెంటిక్ వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు 8 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే, 4 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ వ్యూ కెమెరా కూడా ఇందులో లభిస్తాయి. ఈ వేరియంట్‌తోనే ట్రైబర్‌లో రోజువారీ ఉపయోగానికి అవసరమైన ముఖ్యమైన సౌకర్యాలు మెరుగ్గా అందుతాయి.

టెక్నో వేరియంట్‌
రూ.7.44 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి లభించే టెక్నో వేరియంట్‌లో పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. 15 అంగుళాల స్టీల్ వీల్స్, LED టెయిల్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ & ఆటో ఫోల్డింగ్ ORVMలు, రియర్ వైపర్, వాషర్ & డీఫాగర్, డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు, ఆర్మ్‌రెస్ట్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. రెండో & మూడో వరుసలకు 12V సాకెట్ కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!

ఇక టెక్నో టర్బో ధర రూ.8.53 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ వేరియంట్‌లో కొత్త 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 100hp శక్తి & 180Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ MTతో మాత్రమే వస్తుంది. సాధారణ ఇంజిన్‌తో పోలిస్తే ఇది 28hp ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఎక్కువ మంది ప్రయాణికులతో కారును నడిపే వారికి ఈ అదనపు శక్తి ఉపయోగపడుతుంది.

ఎమోషన్ వేరియంట్
టాప్-స్పెక్ ఎమోషన్ వేరియంట్ ధర రూ.8.05 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో.. పైన మూడు వేరియంట్లలో ఉన్న ఫీచర్లతో పాటు ఆటోమేటిక్ AC, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, 7 అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు వస్తాయి. సహజ పెట్రోల్ ఇంజిన్‌తో AMT ఎంపిక కూడా ఈ వేరియంట్‌లోనే లభిస్తుంది.

రంగులు
ట్రైబర్‌లో మొత్తం తొమ్మిది రంగుల ఎంపికలు ఉన్నాయి. వీటిలో ఆరు సింగిల్ టోన్ రంగులు. మూడు డ్యూయల్ టోన్ రంగులు. డ్యూయల్ టోన్ రంగులు ఎమోషన్ వేరియంట్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!

ఫీచర్లు, ధర & పనితీరును కలిపి చూస్తే టెక్నో టర్బో వేరియంట్‌పై ప్రజల ఆసక్తి కనిపిస్తోంది. రూ.8.53 లక్షలకు 100hp టర్బో ఇంజిన్‌తో పాటు అవసరమైన కీలక ఫీచర్లు లభిస్తాయి. టాప్ ఎమోషన్‌లో అదనపు సౌకర్యాలు ఎక్కువగా ఉన్నా, వాటి కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ శక్తి కోరుకునే ట్రైబర్ కొనుగోలుదారులకు టెక్నో టర్బో ఒక ముఖ్యమైన ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
మహీంద్రా కార్లపై దసరా బంపర్‌ ఆఫర్లు.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కొత్త కారు కొనేవాళ్లు పండగ చేసుకోండి.. మహీంద్రా కార్లపై రూ.లక్షన్నర వరకు డిస్కౌంట్లు
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget