అన్వేషించండి

ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!

Triumph Tracker 400 యాక్సిలరేషన్, రోల్ ఆన్, బ్రేకింగ్ పనితీరును పరీక్షించారు. 40hp శక్తితో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని 7.55 సెకన్లలో అందుకుంది.

Triumph Tracker 400 Price, Mileage And Features Telugu: ప్రీమియం మోటార్‌సైకిళ్ల విభాగంలో ట్రయంఫ్ ట్రాకర్ 400 ప్రత్యేకంగా కనిపిస్తోంది. నియో రెట్రో డిజైన్‌తో వచ్చిన ఈ బైక్‌ను సిటీకి సరిపోయేలా రూపొందించారు. కంపెనీ లెక్కలను పక్కనబెట్టి, ఈ బండి అసలైన పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎక్స్‌పర్ట్‌లు దీనిని వాస్తవ రోడ్లపై పరీక్షించారు. యాక్సిలరేషన్, రోల్ ఆన్ యాక్సిలరేషన్ & బ్రేకింగ్‌ విషయాల్లో ట్రాకర్ 400 ఎలా పనిచేసిందో రిపోర్ట్‌ ఇచ్చారు.

ట్రయంఫ్ 400cc కుటుంబంలో Tracker & Thruxton బైక్‌లకు ఇంజిన్‌ నుంచి ఎక్కువ శక్తి వచ్చేలా ట్యూన్ చేశారు. ట్రాకర్ 400లో 349 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,750 rpm వద్ద 40hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 7,500 rpm వద్ద గరిష్టంగా 32Nm టార్క్‌ను అందిస్తుంది.

ఎక్స్‌పర్ట్‌లు Triumph Tracker 400 యాక్సిలరేషన్ టెస్ట్‌ను పొడి రోడ్డుపై నిర్వహించారు. ఈ బండి గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని 3.05 సెకన్లలో అందుకుంది. 0 నుంచి 80 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 4.86 సెకన్లు పట్టింది. ఇక 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.55 సెకన్లలో అందుకుంది.

ఇంజిన్ పవర్‌

ఇంజిన్ పనితీరులో ఆసక్తికరమైన మార్పు కనిపించింది. గతంలోని 398cc ఇంజిన్‌తో పోలిస్తే కొత్త 349cc ఇంజిన్.. శక్తిని మరింత సరళంగా అందిస్తుంది. 6,000 rpm దాటిన తర్వాత అసలైన పవర్‌ బయటపడుతుంది. అక్కడి నుంచి రెడ్‌లైన్ వరకు ఇంజిన్ చురుగ్గా లాక్కుపోతుంది.

నగరంలో తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు కూడా బైక్ సులభంగా నడుస్తుంది. పెద్ద గేర్‌లోనూ ఇంజిన్ ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా స్పందిస్తుంది. ఆరో గేర్‌లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగం వద్ద ఇంజిన్ సౌకర్యవంతమైన పరిధిలో ఉంటుంది.

రోల్ ఆన్ యాక్సిలరేషన్

రోల్ ఆన్ యాక్సిలరేషన్ పరీక్షలోనూ ట్రాకర్ 400 తన సామర్థ్యాన్ని చూపించింది. రెండో గేర్‌లో గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని 2.44 సెకన్లలో అందుకుంది. మూడో గేర్‌లో 30 నుంచి 70 కిలోమీటర్ల వేగానికి 4.15 సెకన్లు పట్టింది. నాలుగో గేర్‌లో 50 నుంచి 80 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 4.32 సెకన్లు పట్టింది.

హైవేపై ట్రాకర్ 400 గంటకు ఎక్కువ వేగంతో ప్రయాణించడంలో ఇబ్బంది పడలేదు. ఓవర్‌టేక్ చేసేందుకు అవసరమైన శక్తి కూడా అందుబాటులో ఉంటుంది. అయితే వేగంగా దూసుకెళ్లాలంటే ఒకటి లేదా రెండు గేర్లు తగ్గిస్తే మరింత వేగంగా స్పందిస్తుంది.

398cc ఇంజిన్‌తో పోలిస్తే 349cc ఇంజిన్‌ను ఎక్కువగా రైజ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మంచి పనితీరు కోసం రైడర్ కొంత ఎక్కువ శ్రమించాలి. గత మోడళ్లలో కనిపించిన సులభమైన పవర్ డెలివరీతో పోలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్‌ రద్దు అవుతుందా, లేదా? ఏది వాస్తవం?

బ్రేకింగ్

బ్రేకింగ్ విషయంలోనూ ట్రాకర్ 400 మంచి ఫలితాన్ని సాధించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగం నుంచి పూర్తిగా ఆగేందుకు 16.75 మీటర్ల దూరం పట్టింది. మంచి బ్రేకింగ్ శక్తి & స్పందన రైడర్‌కు నమ్మకాన్ని పెంచుతాయి.

ట్రాకర్ 400లో సింటర్డ్ బ్రేక్ ప్యాడ్లు ఉన్నాయి. వరుసగా బ్రేకింగ్ చేసినా ఆపే శక్తిని చక్కగా అందించడంలో ఇవి సహాయపడతాయి. 181 కిలోల తక్కువ బరువు కూడా బ్రేకింగ్ పనితీరుకు అనుకూలంగా ఉంటుంది.

ధర

ట్రయంఫ్ ట్రాకర్ 400 ఎక్స్-షోరూమ్ ధర రూ.2.42 లక్షలు. ఇది అల్యూమినియం సిల్వర్, రేసింగ్ ఎల్లో & ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

బైక్‌లో 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. సీటు ఎత్తు 805 మిల్లీమీటర్లు. ముందు 300 మిల్లీమీటర్ల డిస్క్, వెనుక 230 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేకులు ఉన్నాయి. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు.

ఇది కూడా చదవండి: 350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?

మొత్తంగా చూస్తే.. ట్రాకర్ 400 నగర ప్రయాణాల్లో సరదాగా నడిపించే బైక్‌గా నిలుస్తుంది. సాధారణ రోడ్‌స్టర్‌లతో పోలిస్తే దీని రైడింగ్ పొజిషన్ కొంత ముందుకు వంగినట్లుగా ఉంటుంది. నియో రెట్రో రూపంతో పాటు ప్రత్యేకమైన రైడింగ్ అనుభూతిని కోరుకునే వారికి ఇది ఒక ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?
యూత్‌ఫుల్‌ బైక్‌ కవాసాకి Z300 గురించి 5 కీలక విషయాలు.. కొనే ముందే మీకివి తెలియాలి!
Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ
ఈ స్కూటర్‌ ఎక్కితే, కింద పడిపోతామనే భయం ఉండదు! స్టాండ్ అవసరం లేని BMW Vision CE ఎలక్ట్రిక్‌ స్కూటర్
స్వయంగా బ్యాలెన్స్ చేసుకునే BMW ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ అవసరం లేని ప్రయాణం!
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget