అన్వేషించండి

350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?

Triumph Tracker 400 మైలేజ్ పరీక్షలో సిటీలో 24.1kpl, హైవేపై 31.7kpl & సగటున 27.9kpl నమోదైంది. బైక్ రియల్ వరల్డ్ ఇంధన సామర్థ్యంపై పూర్తి వివరాలు.

Triumph Tracker 400 Price, Mileage And Features Telugu: 400cc విభాగంలో కొత్తగా వచ్చిన బైక్ Triumph Tracker 400. ఈ మోడల్‌లో 349cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 40hp శక్తి & 32Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Thruxton 400లో ఉన్న అధిక ట్యూన్ వెర్షన్‌నే Tracker 400లోనూ ఉపయోగించారు.

ఎక్స్‌పర్ట్‌లు ఈ బైక్‌తో కొంతకాలం ప్రయాణించిన తర్వాత, అసలు మైలేజ్ ఎంత వస్తుందో తెలుసుకునేందుకు సాధారణ పరీక్ష నిర్వహించారు. సిటీ ట్రాఫిక్‌లో & హైవే మీద వేర్వేరుగా నడిపి ఇంధన సామర్థ్యాన్ని లెక్కించారు.

హైవేపై మైలేజ్‌ పరీక్ష

ముందుగా, Triumph Tracker 400 ట్యాంక్‌ను ఫుల్‌ చేశారు. ఆ తర్వాత హైవేపై నడిపి పరీక్ష ప్రారంభించారు. దాదాపు 44 కిలోమీటర్లకు పైగా బైక్‌ను గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో నడిపారు. పరీక్ష పూర్తయ్యాక ట్యాంక్‌ను తిరిగి పూర్తిగా నింపేందుకు 1.4 లీటర్ల పెట్రోల్ అవసరమైంది. దీంతో Triumph Tracker 400 నిజమైన హైవే మైలేజ్ 31.7kplగా నమోదైంది.

సిటీ ట్రాఫిక్‌లో మైలేజ్‌ పరీక్ష

ఆ తర్వాత సౌత్ ముంబైలోనూ ఇదే తరహాలో సిటీ మైలేజ్ పరీక్ష నిర్వహించారు. సాధారణ నగర ట్రాఫిక్‌కు అనుగుణంగా దాదాపు 44 కిలోమీటర్లకు పైగా బైక్‌ను నడిపారు. ఈసారి ట్యాంక్‌ను పూర్తిగా నింపేందుకు 1.83 లీటర్ల పెట్రోల్ పట్టింది. దీంతో నిజమైన సిటీ మైలేజ్ 24.1kplగా నమోదైంది.

సిటీ + హైవే మేలేజ్‌లను కలిపితే, Triumph Tracker 400 సగటు ఇంధన సామర్థ్యం లీటరుకు 27.9 కిలోమీటర్లు. ఈ లెక్క ప్రకారం ఫుల్‌ ట్యాంక్‌తో దాదాపు 360 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఆ తర్వాత మళ్లీ పెట్రోల్ నింపాల్సి ఉంటుంది.

సిటీ ట్రాఫిక్‌లో ఎలా అనిపించింది?

Triumph Tracker 400ను సిటీలో నడిపేటప్పుడు మరో విషయం గమనించాలి. Speed 400తో పోలిస్తే Tracker 400 తక్కువ వేగాల్లో అంత సులభంగా నడపగలిగేలా అనిపించదు. 349ccకి ఇంజిన్ సామర్థ్యం తగ్గించడంతో వేగంగా ముందుకు వెళ్లాలంటే ఇంజిన్‌ను ఎక్కువగా రైజ్‌ చేయాల్సి వస్తుంది. దీనివల్ల సిటీ మైలేజ్‌పై కొంత ప్రభావం పడుతుంది.

అయితే తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు ఎక్కువ గేర్‌లోనూ ఇంజిన్‌ను సులభంగా నడపవచ్చు. హైవేపై గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు Tracker 400 చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంజిన్‌పై పెద్దగా ఒత్తిడి కనిపించలేదు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!

ఓవర్‌టేక్ చేయడానికి కూడా తగినంత శక్తి అందుబాటులో ఉంది. అయితే వేగంగా ముందుకు వెళ్లాలంటే ఒకటి లేదా రెండు గేర్లు తగ్గిస్తే మరింత మెరుగైన స్పందన లభిస్తుంది.

మైలేజ్‌ టెస్ట్‌ ఇలా చేశారు..

ఈ మైలేజ్ పరీక్షలో Tracker 400 సిటీ రైడింగ్‌లో 24.1kpl & హైవేపై 31.7kpl సాధించింది. సగటున 27.9kpl ఇంధన సామర్థ్యం నమోదైంది. 

మైలేజ్ పరీక్షలో ముందుగా బైక్‌ ట్యాంక్‌ను పూర్తి స్థాయిలో పెట్రోల్‌తో నింపుతారు. కంపెనీ సూచించిన గాలి ఒత్తిడి టైర్లలో ఉండేలా చూస్తారు. ఆ తర్వాత సిటీ ట్రాఫిక్‌లో & హైవే మార్గాల్లో బైక్‌ను నడుపుతారు.

సాధారణ ప్రజలు వినియోగించే విధంగానే, నిజ జీవిత పరిస్థితులకు దగ్గరగా ఉండేలా సగటు వేగాన్ని కొనసాగిస్తారు. రహదారిపై ఉన్న వేగ పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వేర్వేరు బైక్‌లు & రైడర్ల మధ్య పరీక్షలో తేడాలు రాకుండా రైడర్ బరువు & అదనపు బరువును సమానంగా ఉండేలా చూసుకుంటారు.

పరీక్ష పూర్తయ్యాక ట్యాంక్‌ను మళ్లీ పూర్తిగా నింపుతారు. ఆ సమయంలో పట్టిన ఇంధనం & ట్రిప్ మీటర్‌లో నమోదైన దూరం ఆధారంగా అసలు మైలేజ్‌ను లెక్కిస్తారు. ఇలా వచ్చేదే అసలైన మైలేజ్‌.

ఇది కూడా చదవండి: KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget