అన్వేషించండి

Suzuki స్కూటర్‌ కొనాలంటే రూ.1 లక్ష బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మోడళ్లు ఇవే

భారత్‌లో రూ.1 లక్ష లోపు లభించే Suzuki ద్విచక్ర వాహనాల ధరలు, ఇంజిన్, మైలేజీ & రాబోయే మోడళ్ల వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రూ.1 లక్షలోపు, సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ప్రాథమిక ఎంపిక.
  • సుజుకి ఎవెనిస్ స్కూటర్ ₹84,290 ప్రారంభ ధరతో ప్రస్తుతం లభిస్తుంది.
  • కొత్త సుజుకి ఎవెనిస్ 2027లో; ఆన్-రోడ్ ధరను పరిగణించండి.

Suzuki two wheelers under Rs 1 lakh: మన దేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఏటికేడు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా, రోజువారీ ప్రయాణానికి తక్కువ ధరలో మంచి మోడల్ కోసం చాలామంది చూస్తుంటారు. మీరు Suzuki బండి కొనాలని భావిస్తుంటే.. రూ.1 లక్ష బడ్జెట్‌లో ఏ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి? వాటి ధరలు ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం రూ.1 లక్ష లోపు ధరతో Suzuki నుంచి ప్రధానంగా రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మరో మోడల్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Suzuki Access 125

Suzuki Access 125 ఈ జాబితాలో ముఖ్యమైన మోడల్. తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.81,580 నుంచి రూ.1 లక్ష వరకు ఉంది. ఇది మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ స్కూటర్‌లో 124 cc ఇంజిన్ ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం సుమారు 90 kmphగా ఉంటుంది. రోజువారీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా దీన్ని రూపొందించారు.

ధరను బట్టి రూ.1 లక్షలోపు బడ్జెట్‌లో Suzuki స్కూటర్ కొనాలని చూస్తున్నవారికి Access 125 ఒక ఎంపికగా ఉంటుంది. అయితే వేరియంట్‌ను బట్టి ధర మారుతుంది.

ఇది కూడా చదవండి: KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే

Suzuki Avenis

Suzuki Avenis కూడా రూ.1 లక్ష లోపు లభించే మరో మోడల్. తెలుగు నగరాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.84,290 నుంచి రూ.86,680 వరకు ఉంది. ఇది 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ స్కూటర్‌లో 124 cc ఇంజిన్ ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఉంటుంది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం సుమారు 49.6 kmpl మైలేజీని అందిస్తుంది.

రోజువారీ ప్రయాణాలతో పాటు స్పోర్టీ డిజైన్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని Avenis‌ను రూపొందించారు. రూ.1 లక్షలోపు బడ్జెట్‌లో ఉండటంతో ఈ విభాగంలో దీనికి స్థానం ఉంది.

Suzuki New Avenis

Suzuki నుంచి కొత్త Avenis కూడా రాబోతోంది. 2027 ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. దీని అంచనా ధర రూ.92,000 నుంచి రూ.95,000 మధ్య ఉండొచ్చని సమాచారం.

ఇది కూడా ఆటోమేటిక్ స్కూటర్‌గా రానుంది. విడుదలైన తర్వాతే ఈ బండి పూర్తి ఫీచర్లు, ధర & ఇతర వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్

రూ.1 లక్ష లోపు సుజుకి టూవీలర్‌ కొనాలనుకునే వారు ప్రస్తుత ధరలను పరిశీలించడంతో పాటు వేరియంట్‌ను బట్టి మారే ధరలను కూడా గమనించాలి. ఎక్స్-షోరూమ్ ధరతో పాటు రిజిస్ట్రేషన్, బీమా & ఇతర ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర మరింత పెరుగుతుంది. అందువల్ల బడ్జెట్‌ను నిర్ణయించుకునే ముందు ఎక్స్-షోరూమ్ ధర కాకుండా మొత్తం ఆన్-రోడ్ ధరను కూడా తెలుసుకోవడం మంచిది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

సుజుకిలో ప్రస్తుతం రూ.1 లక్షలోపు అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాలు ఏవి?

ప్రస్తుతం Suzuki Access 125 మరియు Suzuki Avenis మోడళ్లు రూ.1 లక్షలోపు అందుబాటులో ఉన్నాయి. త్వరలో కొత్త Suzuki Avenis కూడా మార్కెట్‌లోకి రాబోతోంది.

Suzuki Access 125 ధర మరియు ప్రధాన ఫీచర్లు ఏమిటి?

తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.81,580 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. ఇది 124 cc ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగి రోజువారీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

Suzuki Avenis స్కూటర్ ధర, మైలేజీ ఎంత?

తెలుగు నగరాల్లో Suzuki Avenis ఎక్స్-షోరూమ్ ధర రూ.84,290 నుంచి రూ.86,680 వరకు ఉంది. ఇది సుమారు 49.6 kmpl మైలేజీని అందిస్తుంది మరియు స్పోర్టీ డిజైన్‌తో వస్తుంది.

కొత్త Suzuki Avenis ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది, దాని అంచనా ధర ఎంత?

కొత్త Suzuki Avenis 2027 ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.92,000 నుంచి రూ.95,000 మధ్య ఉండొచ్చని సమాచారం.

సుజుకి ద్విచక్ర వాహనాల తుది ఆన్-రోడ్ ధరను నిర్ణయించే అంశాలు ఏమిటి?

ఎక్స్-షోరూమ్ ధరతో పాటు రిజిస్ట్రేషన్, బీమా మరియు ఇతర ఛార్జీలు కలిపి ఆన్-రోడ్ ధరను నిర్ణయిస్తాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మొత్తం ఆన్-రోడ్ ధరను తెలుసుకోవడం మంచిది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?
Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!
పాత పల్సర్‌కు కొత్త హంగులు.. కొత్త పల్సర్‌ N250 SSలో వచ్చిన 5 కీలక మార్పులేవో మీకు తెలుసా?
Affordable Gloves Boots: రూ.15 వేలల్లోనే పూర్తి రైడింగ్ గేర్.. CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?
రూ.15 వేలల్లోనే బైక్ పూర్తి రైడింగ్ గేర్.. జాకెట్, గ్లౌజులు, బూట్లను ఎలా ఎంచుకోవాలి?
2026 KTM 200 Duke Review: కేవలం రూ.1,500 అదనపు ధర.. కేటీఎం 200 డ్యూక్‌లో 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
2026 కేటీఎం 200 డ్యూక్ రివ్యూ: ఈ బైక్‌లో వచ్చిన 5 కొత్త అప్‌డేట్స్, ప్రత్యేకతలు ఇవిగో!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget