అన్వేషించండి

ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే వాహన సేవలకు బ్రేక్, లైసెన్స్‌పై వేటు, కరెంటు కట్‌!

ట్రాఫిక్ చలానాల బకాయిల వసూళ్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ బిల్లుల్లో చలానాలు జత చేయడం సహా వాహన సేవలపై ఆంక్షలు విధించాలని సూచించింది.

Traffic challans with electricity bills: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల విషయంలో సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. చలానాలు విధించిన తర్వాత వాటిని వసూలు చేయడంలో రాష్ట్రాలు మరింత కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. బకాయిలను రాబట్టేందుకు కొత్త విధానాలను అమలు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది. విద్యుత్ బిల్లుల్లో చలానాలు జత చేయడం, కట్టకపోతే కరెంటు కట్‌ చేయడం సహా వాహన సేవలపై ఆంక్షలు విధించాలని సూచించింది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇప్పటివరకు భారీగా ఇ-చలానాలు జారీ అయ్యాయి. ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు దాదాపు రూ.45 వేల కోట్ల విలువైన చలానాలు జారీ చేసినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే ఇందులో సుమారు రూ.25 వేల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మరో రూ.20 వేల కోట్ల మేర జరిమానాలు ఇంకా బకాయిగా ఉన్నాయని వెల్లడైంది.

కరెంటు బిల్లుతో కలిపి వసూలు

ఈ బకాయిల వసూళ్లపై సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించిన జరిమానాలను నెలవారీ విద్యుత్ బిల్లులతో కలిపి వసూలు చేసే అంశాన్ని కోర్టు సూచించింది. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నందున, చలానాల వసూళ్లలోనూ ఈ విధానం ప్రభావవంతంగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

సేవలు నిలిపివేత

చలానా బకాయిలు చెల్లించని వాహనదారులపై ఇతర చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. అలాంటి వాహనాలకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలను నిలిపివేయాలని పేర్కొంది. వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ, నకిలీ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాల జారీ, యజమాని చిరునామా మార్పు వంటి సేవలను నిలిపివేయాలని ఆదేశించింది.

అలాగే బకాయిలు ఉన్న వాహనాలకు ఫిట్‌నెస్ ధ్రువపత్రాలు జారీ చేయకుండా చూడాలని కోర్టు సూచించింది. అవసరమైన సందర్భాల్లో వాహనాలను స్వాధీనం చేసుకునే చర్యలు కూడా చేపట్టాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారికి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు లేదా పునరుద్ధరణ నిలిపివేత వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం కోసం ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా వాటిని వసూలు చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొంది.

ఈ వ్యవహారం మొత్తం 2012లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించినది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కేసులో సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తోంది.

ఇది కూడా చదవండి: ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Embed widget