అన్వేషించండి

మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి

హెల్మెట్‌ వైజర్‌ మసకబారకుండా పిన్‌లాక్‌ ఎలా పనిచేస్తుంది? పిన్‌లాక్‌ 30, 70, 120 మధ్య తేడాలు, ఇన్‌స్టాలేషన్‌ విధానం & ఉపయోగాలను తెలుసుకోండి.

Truth About Pinlock Visors Telugu: బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్‌ వైజర్‌ మసకబారడం చాలా ఇబ్బందికరమైన సమస్య. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలం & తేమ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. వైజర్‌పై పొగమంచు ఏర్పడితే రోడ్డు స్పష్టంగా కనిపించదు. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.

ఈ సమస్యకు పరిష్కారంగా ఉపయోగపడేదే పిన్‌లాక్‌ ఇన్‌సర్ట్‌. ఇది సాధారణ వైజర్‌కు అదనంగా లోపలి భాగంలో అమర్చే పలుచని పొర. పిన్‌లాక్‌ కోసం ప్రత్యేకంగా తయారైన హెల్మెట్‌ వైజర్‌లో దీన్ని అమర్చవచ్చు. వైజర్‌ మసకబారకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం.

పిన్‌లాక్‌ ఎలా పనిచేస్తుంది?

పిన్‌లాక్‌ పనితీరు డబుల్‌ గ్లేజింగ్‌ విధానాన్ని పోలి ఉంటుంది. సాధారణంగా హెల్మెట్‌ లోపల ఉండే వెచ్చని గాలి & బయట ఉండే చల్లని గాలి మధ్య ఉష్ణోగ్రత తేడా ఉంటుంది. రైడర్‌ శ్వాస నుంచి వచ్చే తేమ వైజర్‌ లోపలి భాగాన్ని తాకినప్పుడు ఆవిరి బిందువులుగా మారుతుంది. దీంతో వైజర్‌ మసకబారుతుంది.

పిన్‌లాక్‌ ఇన్‌సర్ట్‌ వైజర్‌ లోపల మరో పొరను ఏర్పాటు చేస్తుంది. ఈ రెండు పొరల మధ్య గాలి ఖాళీ ఏర్పడుతుంది. ఇన్‌సర్ట్‌లో తేమను గ్రహించే లక్షణాలు కూడా ఉంటాయి. దీంతో వైజర్‌పై ఆవిరి పేరుకుపోవడం గణనీయంగా తగ్గుతుంది.

పిన్‌లాక్‌ రెడీ హెల్మెట్‌లో వైజర్‌కు రెండు వైపులా ప్రత్యేక పిన్‌లు ఉంటాయి. వాటికి ఇన్‌సర్ట్‌ను అమర్చుతారు. ఇన్‌సర్ట్‌ అంచున ఉండే సిలికాన్‌ పొర వైజర్‌పై గాలి ప్రసరించకుండా చేస్తుంది. దీంతో యాంటీ ఫాగ్‌ ప్రభావం మెరుగ్గా ఉంటుంది.

పిన్‌లాక్‌లో ఎన్ని రకాలు?

పిన్‌లాక్‌ ఇన్‌సర్ట్‌లు వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో పిన్‌లాక్‌ 30 అనేది ప్రాథమిక స్థాయి యాంటీ ఫాగ్‌ రక్షణను అందిస్తుంది. అప్పుడప్పుడు బైక్‌ నడిపేవారికి ఇది ఉపయోగపడుతుంది. చలి & వర్షం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో తరచుగా ప్రయాణించని వారికి ఇది సరిపోవచ్చు.

పిన్‌లాక్‌ 70 మరింత మెరుగైన యాంటీ ఫాగ్‌ సామర్థ్యాన్ని అందిస్తుంది. చలి, వర్షం & తేమ ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో తరచూ బైక్‌ నడిపేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రైడర్‌ శ్వాస వల్ల ఏర్పడే మసకను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: హోండా సిటీ CVT రియల్‌ వరల్డ్‌ మైలేజ్ ఇదే.. కంపెనీ చెప్పిన నంబర్‌తో పోలిస్తే ఎంత తేడా ఉందంటే?

పిన్‌లాక్‌ 120 అత్యున్నత స్థాయి యాంటీ ఫాగ్‌ పనితీరును అందించే ఇన్‌సర్ట్‌గా పేర్కొంటారు. ఎక్కువగా ప్రయాణించే రైడర్లు & ప్రొఫెషనల్‌ రైడర్లు దీనిని ఎంచుకుంటారు.

కొన్ని మోడళ్లలో వివిధ రంగుల ఇన్‌సర్ట్‌లు కూడా లభిస్తాయి. పిన్‌లాక్‌ 70 & 120 కోసం మ్యాక్స్‌ విజన్‌ వెర్షన్లు కూడా ఉన్నాయి. ఇవి వైజర్‌లో ఎక్కువ భాగాన్ని కవర్‌ చేస్తాయి. దీంతో అంచుల వరకు విస్తృతమైన దృశ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది.

పిన్‌లాక్‌ ఎలా అమర్చాలి?

ముందుగా హెల్మెట్‌ నుంచి వైజర్‌ను తొలగించాలి. తర్వాత వైజర్‌ను స్వల్పంగా వంచి కొద్దిగా సమతలంగా చేయాలి. ఇన్‌సర్ట్‌ను వైజర్‌పై ఉన్న రెండు పిన్‌లకు సరిగ్గా అమర్చాలి. ఇన్‌సర్ట్‌ అంచున ఉన్న సిలికాన్‌ భాగం వైజర్‌ లోపలి వైపు ఉండేలా చూసుకోవాలి.

తర్వాత ఇన్‌సర్ట్‌పై స్వల్పంగా ఒత్తిడి పెట్టి వైజర్‌కు బిగుతుగా అమర్చాలి. అవసరమైతే పిన్‌ల స్థానాన్ని సర్దుబాటు చేయాలి. చివరగా శ్వాసతో పరీక్షించి ఎక్కడైనా గాలి చొరబడుతోందా లేదా చూడాలి.

సరిగ్గా అమర్చకపోతే ఇన్‌సర్ట్‌ & వైజర్‌ మధ్య తేమ చేరవచ్చు. దీంతో మసక లేదా మరకలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇన్‌సర్ట్‌పై గీతలు పడకుండా శుభ్రం చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

పిన్‌లాక్‌ అవసరమా?

చలి, వర్షం లేదా తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తరచుగా బైక్‌ నడిపేవారికి పిన్‌లాక్‌ ఉపయోగకరమైన హెల్మెట్‌ ఉపకరణం. వైజర్‌ మసకబారడాన్ని తగ్గించడం ద్వారా రోడ్డుపై చూపును స్పష్టంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.

అయితే పిన్‌లాక్‌ అమర్చడం ఒక్కటే భద్రతకు పూర్తి పరిష్కారం కాదు. సరైన సైజ్‌ హెల్మెట్‌, మంచి నాణ్యత గల వైజర్‌ & సురక్షితమైన రైడింగ్‌ పద్ధతులు కూడా అంతే ముఖ్యం.

ఇది కూడా చదవండి: డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్‌ రద్దు అవుతుందా, లేదా? ఏది వాస్తవం?

పిన్‌లాక్‌ ఇన్‌సర్ట్‌ కాలక్రమేణా దెబ్బతినవచ్చు. గీతలు పడటం, మసకగా కనిపించడం లేదా సీలింగ్‌ సరిగ్గా లేకపోవడం మొదలైతే దాన్ని మార్చాల్సి ఉంటుంది. రాత్రివేళ వాహనాల లైట్లు లేదా వీధి దీపాల ప్రతిబింబం కొంతమందికి ఇబ్బందిగా అనిపించే అవకాశం కూడా ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renault Duster, Kiger, Triber, Kwid కార్లపై రూ.2.10 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
రెనాల్ట్‌ డస్టర్‌ మీద రూ.2.10 లక్షలు, క్విడ్‌ మీద రూ.40,000 వరకు తగ్గింపు.. ఇంకొన్ని రోజులే!
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Engine Warm Up: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?
చలికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేయొచ్చా? ఇంజిన్‌ వేడెక్కేవరకు వెయిట్‌ చేయాలా?
Electric Scooter Sales: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటారా? ప్రస్తుతం దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 కంపెనీలు ఇవే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Tragedy Story: బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Cashews For Health : జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Embed widget