అన్వేషించండి

హోండా సిటీ CVT రియల్‌ వరల్డ్‌ మైలేజ్ ఇదే.. కంపెనీ చెప్పిన నంబర్‌తో పోలిస్తే ఎంత తేడా ఉందంటే?

హోండా సిటీ పెట్రోల్ CVT నిజ జీవిత మైలేజ్ పరీక్షను ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించగా, నగరంలో నడిపినప్పుడు ఆశ్చర్యకమైన ఫలితాలు వచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Honda City petrol CVT Price, Mileage And Features Telugu: హోండా సిటీ అంటే దేశీయ కార్ మార్కెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో పాటు మంచి డ్రైవింగ్ అనుభూతి కోసం ఈ సెడాన్‌ను చాలామంది ఎంచుకుంటారు. అయితే కారు కొనుగోలు చేసేటప్పుడు మైలేజ్ కూడా కీలక అంశమే. ముఖ్యంగా ఆటోమేటిక్ కారు తీసుకోవాలనుకునేవారికి నిజ జీవితంలో ఎంత మైలేజ్ వస్తుందన్నది ఆసక్తికరం.

తాజాగా, హోండా సిటీ పెట్రోల్ CVT వేరియంట్‌కు ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన వాస్తవ మైలేజ్ పరీక్షలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. నగర రోడ్లపై ఈ కారు 10.1 KPL మైలేజ్ ఇచ్చింది. హైవేపై 16.49 KPL నమోదు చేసింది. రెండు పరిస్థితుల్లో కలిపి సగటున 13.3 KPL ఇంధన సామర్థ్యం సాధించింది.

2026లో హోండా సిటీకి ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. ముందు భాగంలో డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. కొన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించారు. అయితే పెట్రోల్ ఇంజిన్ & గేర్‌బాక్స్ ఎంపికల్లో పెద్ద మార్పులు చేయలేదు.

సిటీ పెట్రోల్ CVTలో 1.5 లీటర్ నాలుగు సిలిండర్ల సహజ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 121 HP శక్తిని, 145 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 7 స్టెప్ CVT గేర్‌బాక్స్‌ను జత చేశారు. 

మైలేజ్‌ టెస్ట్‌

ఎక్స్‌పర్ట్‌లు ఈ పరీక్ష మొత్తం కారును ECON మోడ్‌లోనే నడిపారు. ఈ వేరియంట్‌లో కంపెనీ ప్రకటించిన ఇంధన సామర్థ్యం 17.97 KPL. అయితే వాస్తవ రోడ్లపై పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ట్రాఫిక్, డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులు, ఎయిర్ కండిషనింగ్ వినియోగం వంటి అంశాలు మైలేజ్‌పై ప్రభావం చూపుతాయి.

పరీక్షలో నగరంలో 10.1 KPL మాత్రమే వచ్చింది. దీనికి ప్రధాన కారణాల్లో ట్రాఫిక్‌లో తరచూ వేగం పెంచడం, తగ్గించడం ఒకటి. సిటీ CVTలో ఆటోమేటిక్ స్టాప్ స్టార్ట్ ఫీచర్ లేకపోవడం కూడా నగర మైలేజ్‌పై ప్రభావం చూపే అంశంగా చెప్పవచ్చు.

హైవేపై మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్కడ 16.49 KPL మైలేజ్ నమోదైంది. ఇది కంపెనీ ప్రకటించిన 17.97 KPLకు దగ్గరగా ఉంది. రెండు రకాల డ్రైవింగ్‌ను కలిపితే సగటు మైలేజ్ 13.3 KPLగా నమోదైంది.

ఇది కూడా చదవండి: అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి

530 కిలోమీటర్ల జర్నీ

ఈ మైలేజ్‌తో 40 లీటర్ల ఇంధన ట్యాంక్‌పై సుమారు 530 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవ ప్రయాణ పరిధి డ్రైవింగ్ పరిస్థితులను బట్టి మారుతుంది.

CVT పనితీరుపై పరీక్షలో మరో అంశం కూడా గమనించారు. యాక్సిలరేటర్‌ను స్వల్పంగా నొక్కినా ఇంజిన్ RPM వేగంగా పెరిగినట్లు గుర్తించారు. దీంతో కారు స్పందన వేగంగా అనిపిస్తుంది. ఇలాంటి డ్రైవింగ్ విధానం ఇంధన సామర్థ్యాన్ని కొంత తగ్గించవచ్చు.

మైలేజ్ పరీక్షను సాధారణ వినియోగ పరిస్థితులకు దగ్గరగా నిర్వహించారు. పరీక్షకు ముందు ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపారు. కంపెనీ సూచించిన స్థాయిలో టైర్ ప్రెజర్‌ను ఉంచారు. నగరం & హైవే కోసం నిర్దేశించిన మార్గాల్లో కారును నడిపారు.

పరీక్ష సమయంలో ఒక వ్యక్తి మాత్రమే కారులో ఉన్నారు. ఎయిర్ కండిషనింగ్‌ను 22 డిగ్రీల వద్ద పూర్తి ఆటో మోడ్‌లో ఉపయోగించారు. ఆడియో సిస్టమ్, సీట్ల వెంటిలేషన్, వైపర్లు, ఇండికేటర్లు వంటి ఇతర విద్యుత్ పరికరాలను అవసరమైనప్పుడు సాధారణ వినియోగదారుల మాదిరిగానే ఉపయోగించారు.

ఇది కూడా చదవండి: పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు

ఈ పరీక్ష ఫలితాలను బట్టి చూస్తే హోండా సిటీ పెట్రోల్ CVTకి హైవేపై మైలేజ్ మెరుగ్గా ఉండగా, నగర ట్రాఫిక్‌లో మాత్రం తగ్గుతోంది. కాబట్టి కారు కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ ప్రకటించిన మైలేజ్‌తో పాటు వాస్తవ వినియోగంలో వచ్చే మైలేజ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget