హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలు బైక్‌లు ₹1 లక్ష బడ్జెట్లో లభిస్తాయి. ఇవి మంచి మైలేజ్ మరియు అవసరమైన ఫీచర్లను అందిస్తాయి.
Best Bikes Under Rs 1 Lakh: తక్కువ బడ్జెట్ అయితే ఈ బైక్‌లు కొనండి.. ఇంజిన్‌లో పవర్ఫుల్, మైలేజ్‌లో బెస్ట్
తక్కువ బడ్జెట్లో బైక్ కోసం చేస్తున్న వారికి మార్కెట్లో చాలా బైక్స్ అందుబాటులో ఉన్నాయి. 1 లక్ష బడ్జెట్లో మెరుగైన మైలేజ్, పవర్ఫుల్ ఇంజిన్, రోజువారీ వినియోగానికి కావాల్సిన ఫీచర్లు ఉంటాయి.

- లక్ష లోపు బైకులకు రోజూవారీ ప్రయాణాలకు అనేక ఎంపికలు.
- హీరో స్ప్లెండర్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా ముఖ్యమైనవి.
- స్ప్లెండర్ 63 కి.మీ మైలేజీ, ప్లాటినా సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తాయి.
- టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ సీటీ110ఎక్స్ అధిక ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి.
Bikes Under Rs 1 lakh | ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉండి, మీరు రోజూ ఆఫీసు లేదా మార్కెటింగ్ వర్క్ మీద జర్నీ కోసం బైక్ కొనాలనుకుంటే అనేక మంచి ఆప్షన్లు ఉన్నాయి. తక్కువ ధర కలిగిన బైక్‌లలో సైతం శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన మైలేజ్, అవసరమైన ఫీచర్లు లభిస్తున్నాయి. సెప్టెంబర్ లెక్కల ప్రకారం ₹1 లక్ష బడ్జెట్లో హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ వంటి బ్రాండ్లకు చెందిన పలు బైక్‌లు మార్కెట్లో విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి.
హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్
తక్కువ బడ్జెట్ బైక్‌ల విషయానికి వస్తే హీరో స్ప్లెండర్ ప్లస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సెప్టెంబర్ లిస్టింగ్ ప్రకారం దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 95,860 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మైలేజ్ లీటరుకు దాదాపు 63 కి.మీ. ఇందులో 97.2 cc ఇంజిన్ వస్తుంది. ఈ బైక్ రోజూ నడిపేవారికి సరిగ్గా సరిపోతుంది. దీని తక్కువ బరువు, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ బైకును రోజువారీ వినియోగించేలా చేస్తుంది. ఒకవేళ మీరు నగరంలో ఎక్కువగా వినియోగిస్తే.. మీ మొదటి ప్రాధాన్యత మైలేజ్ అనుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్ మీకు బాగా సెట్ అవుతుంది.
హోండా షైన్ 100.. బజాజ్ ప్లాటినా 100
తక్కువ బడ్జెట్లో వచ్చే కమ్యూటర్ బైక్‌ల జాబితాలో హోండా షైన్ 100 ఉంటుంది. హైదరాబాద్‌లో షైన్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.84,000 నుంచి ప్రారంభమవుతుంది. మైలేజ్ లీటరుకు దాదాపు 65 కి.మీ వెళ్తుంది. ఇందులో 98.98 cc ఇంజిన్ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్‌లో బజాజ్ ప్లాటినా 100 ధర 93,167 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ 99.59 cc ఇంజిన్‌తో రాగా, 8.2 PS మ్యాగ్జిమం పవర్, 8.3 Nm మ్యాగ్జిమం టార్క్‌ను అందిస్తుంది. మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, కంఫర్టెక్ టెక్నాలజీని కంపెనీ అందిస్తోంది. ప్లాటినా 100 లో పొడవైన సీటుతో పాటు సస్పెన్షన్ సెటప్ ఇచ్చారు. అందువల్ల రోజువారీ జర్నీలో కంఫర్ట్ ఉండేలా చేశారు. మీ బడ్జెట్ దాదాపు ₹75,000 ఆసరాలో ఉంటే ఈ బైక్‌ను పరిశీలించవచ్చు.
టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ సీటీ 110ఎక్స్
తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లలో టీవీఎస్ స్పోర్ట్ ఒకటి. టీవీఎస్ కంపెనీ వెబ్సైట్లో దీని సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.69,100 నుంచి ఉన్నాయి. ఆన్ రోడ్ ధర రూ. 92,800 ఉంది. బజాజ్ సీటీ 110ఎక్స్ (CT 110X) ఆన్ రోడ్ ధర రూ. 91,888 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 115.45 cc ఇంజిన్ వస్తుంది. 9.5 PS పవర్, 9.9 Nm మ్యాగ్జిమం టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ కెపాసిటీ ఎక్కుగా ఉండాలని కోరుకుంటే బజాజ్ సీటీ 110ఎక్స్ ఒక మంచి ఆప్షన్ కానుంది.
Frequently Asked Questions
₹1 లక్షలోపు కొనుగోలు చేయగల బైక్ బ్రాండ్లు ఏవి?
హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ధర మరియు మైలేజ్ ఎంత?
హీరో స్ప్లెండర్ ప్లస్ ఆన్-రోడ్ ధర దాదాపు ₹95,860 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ లీటరుకు సుమారు 63 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
తక్కువ ధరలో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్ ఏది?
హోండా షైన్ 100 లీటరుకు దాదాపు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది తక్కువ బడ్జెట్లో వచ్చే కమ్యూటర్ బైక్.
తక్కువ ధరలో అధిక ఇంజిన్ సామర్థ్యం గల బైక్ ఆప్షన్ ఏమిటి?
బజాజ్ సీటీ 110ఎక్స్ బైక్ 115.45 cc ఇంజిన్‌తో వస్తుంది. అధిక ఇంజిన్ సామర్థ్యం కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.
ట్రెండింగ్ వార్తలు























