అన్వేషించండి

రూ.లక్షల్లో కొత్త కారు, రూ.వేలల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు! క్యాబ్‌లో తిరగడమే బెటర్‌ ఐడియానా?

నగరాల్లో కారు కొనడం కంటే క్యాబ్‌లో ప్రయాణించడం ఆర్థికంగా మంచిదేనా? EMI, ఇంధనం, బీమా, పార్కింగ్‌, నిర్వహణ ఖర్చులను లెక్కిస్తే అసలు విషయం ఇదే.

Purchasing a car or book a cab: సొంత కారు కొనడం ప్రతి కుటుంబం కల. సొంత కారు ఉంటేనే జీవితంలో ఒక పైమెట్టుకు చేరుకున్నామని అనుకుంటాం. కానీ, ప్రస్తుతం నగర జీవితం మారుతోంది. ఇబ్బందులతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఆఫీస్‌ లేదా వ్యాపార పనులపై నగరంలో రోజూ తిరగడానికి కారు కొనాలా? అవసరమైనప్పుడు క్యాబ్‌ బుక్‌ చేసుకోవాలా? అనే ప్రశ్న ఇప్పుడు చాలామందిలో మొదలైంది. దీనికి కారణం కారు ధర మాత్రమే కాదు. కారు కొన్న తర్వాత వచ్చే ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. మరోవైపు యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలు అందుబాటులోకి రావడంతో సొంత కారు లేకుండానే రోజువారీ ప్రయాణాలు చేయడం సులభమైంది.

ఉదాహరణకు..

రూ.20 లక్షల కారు కొన్నారని అనుకుందాం. ముందుగా రూ.4 లక్షలు డౌన్‌ పేమెంట్‌ చెల్లించి.. మిగిలిన రూ.16 లక్షలను ఐదేళ్ల రుణంగా తీసుకుంటే నెలవారీ EMI సుమారు రూ.30,000 నుంచి రూ.32,000 వరకు ఉండొచ్చు. వడ్డీ రేటు, రుణ కాలవ్యవధి వంటి అంశాలను బట్టి ఈ మొత్తం మారుతుంది.

ఇంతటితో కారు ఖర్చు పూర్తికాదు. రోజూ 50 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంధనానికే నెలకు సుమారు రూ.20,000 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. వారాంతపు ప్రయాణాలు, విమానాశ్రయ ప్రయాణాలు, నగరంలో ఇతర అవసరాలు కూడా ఉంటే ఈ మొత్తం ఇంకా పెరగొచ్చు.

దీనికి బీమా, సర్వీసింగ్‌, నిర్వహణ, టైర్ల వంటి వినియోగ వస్తువుల ఖర్చులను కలిపితే నెలకు మరో రూ.5,000 నుంచి రూ.8,000 వరకు ఖర్చు కావచ్చు.

ఇక నగరాల్లో మరో పెద్ద సమస్య పార్కింగ్‌. అపార్ట్‌మెంట్‌లో ప్రత్యేక పార్కింగ్‌ కోసం చెల్లించే మొత్తం, కార్యాలయం వద్ద పార్కింగ్‌ ఛార్జీలు, మాల్స్‌ & వాణిజ్య ప్రాంతాల్లో గంటల వారీ ఫీజులు.. ఇవన్నీ అదనపు భారమే. పార్కింగ్‌ స్థలం కోసం రోడ్లపై తిరుగుతూ సమయం కోల్పోవడం కూడా మరో సమస్య.

ఇవన్నీ కలిపితే కారు యాజమాన్యానికి నెలకు రూ.60,000కు పైగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇందులో కారు విలువ తరుగుదలను (డిప్రిసియేషన్‌) కూడా కలిపితే వాస్తవ భారం మరింత పెరుగుతుంది. కొత్త కారు షోరూమ్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే దాని మార్కెట్‌ విలువ తగ్గడం ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి: టెక్టన్‌ కంటే పెద్ద కారు త్వరలోనే రాబోతోంది.. నిస్సాన్‌ కొత్త 7 సీటర్‌ SUV ఫొటోలు లీక్‌!

సొంత కారు కొనకుండా క్యాబ్‌లపైనే ఆధారపడితే పరిస్థితి ఎలా ఉంటుంది?

ఆఫీసుకు రోజువారీ ప్రయాణాలు, విమానాశ్రయ ప్రయాణాలు, క్లయింట్‌ మీటింగ్‌లు, వారాంతపు విహారాలు & అప్పుడప్పుడు నగరం బయట ప్రయాణాలకు ప్రీమియం క్యాబ్‌ సేవలను ఉపయోగించే వ్యక్తికి నెలకు సుమారు రూ.40,000 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తిగా ప్రయాణ దూరం, క్యాబ్‌ రకం & ప్రయాణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

ఇక్కడే కారు యాజమాన్యంలోని కొన్ని కనిపించని ఖర్చులు బయటపడతాయి. ట్రెవ్‌ మొబిలిటీ వ్యవస్థాపకుడు నవీన్‌ గుప్తా చెప్పిన ప్రకారం.. క్యాబ్‌లు లేదా షేర్డ్‌ మొబిలిటీని ఉపయోగించే వారికి EMI, సర్వీసింగ్‌, బీమా పునరుద్ధరణ, అనూహ్య మరమ్మతులు, టైర్ల మార్పు, డిప్రిసియేషన్‌, రీసేల్‌ విలువ & పార్కింగ్‌ వంటి ఖర్చులు ఉండవు. అవసరమైనప్పుడు ప్రయాణానికి మాత్రమే డబ్బు చెల్లిస్తారు.

యువ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ ఉద్యోగులు & తరచుగా ప్రయాణించే వారికి ఈ విధానం ఆకర్షణీయంగా మారుతోందని గుప్తా చెబుతున్నారు. అంటే సొంత వాహనం కలిగి ఉండటం కంటే అవసరమైనప్పుడు రవాణా సేవను పొందడానికే కొందరు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: కైలాక్‌ నుంచి కొడియాక్‌ వరకు బాదుడు.. స్కోడా కార్ల ధరలు రూ.20,000 వరకు పెంపు

అందరికీ క్యాబ్‌ ప్రయాణమే ఆర్థికంగా అనుకూలం కాదు

పిల్లలు లేదా వృద్ధులు ఉన్న కుటుంబాలకు రోజూ క్యాబ్‌లు బుక్‌ చేయడం ఖర్చుతో కూడుకున్నదే. స్కూల్‌కు, ఆసుపత్రికి వెళ్లడం, వారాంతపు కార్యక్రమాలు & సెలవుల సమయంలో తరచుగా ప్రయాణించాల్సి వస్తే సొంత కారు ఉపయోగకరంగా ఉంటుంది.

రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కూడా కారు కొనడం సమంజసం కావచ్చు. ఉదాహరణకు ఉద్యోగం కోసం నగరాల మధ్య తరచుగా ప్రయాణించే వ్యక్తికి ప్రతిరోజూ క్యాబ్‌ బుక్‌ చేయడం కంటే సొంత వాహనం మరింత సౌకర్యవంతంగా ఉండొచ్చు.

అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ప్రయాణాలు చేయాల్సి వచ్చేవారు, పని కోసం పరికరాలు తీసుకెళ్లేవారు & ప్రజా రవాణా లేదా క్యాబ్‌ సేవలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారికి కూడా సొంత కారు ఉపయోగపడుతుంది.

అందుకే కారు కొనాలా? క్యాబ్‌లోనే తిరగాలా? అనే నిర్ణయం ప్రతి ఒక్కరి ప్రయాణ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కారు ఎక్కువ సమయం పార్కింగ్‌లోనే ఉండి.. EMI, బీమా, నిర్వహణ & పార్కింగ్‌ ఖర్చులు మాత్రం కొనసాగితే సొంత వాహనం ఆర్థికంగా భారంగా మారొచ్చు. అదే కారును కుటుంబం మొత్తం తరచుగా ఉపయోగిస్తే లేదా రోజూ ఎక్కువ దూరం ప్రయాణిస్తే దాని ప్రయోజనం పెరుగుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget