అన్వేషించండి

First-Time Car Insurance: మీ కార్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయా? పాలసీ తీసుకునే ముందు ఈ చెక్‌లిస్ట్ చూడండి

మొదటిసారి కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? వ్యక్తిగత ప్రమాద రక్షణ, ఆస్తి నష్టం, పాలసీ కవరేజ్ & బ్రోకర్ ఎంపికపై ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

Car Insurance Tips Telugu: కొత్త కారు కొనడం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుభూతి. అయితే కారు కొనడంతో బాధ్యతలు కూడా పెరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, కారు దెబ్బతినడం వంటి ఘటనలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించేందుకు కార్ ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది.

భారత్‌లో మోటార్ వెహికల్ చట్టం ప్రకారం వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. అయితే కేవలం చట్టపరమైన అవసరం కోసమే కాకుండా, మన కారు & మన ఆర్థిక భద్రత కోసం కూడా సరైన బీమా పాలసీని ఎంచుకోవడం ముఖ్యం.

ప్రమాదాల్లో వ్యక్తిగత రక్షణ

కార్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పాలసీలో వ్యక్తిగత ప్రమాద రక్షణ ఉందో లేదో తెలుసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌కు గాయాలు అయితే వైద్య ఖర్చులు లేదా ఇతర ఆర్థిక నష్టాల విషయంలో ఈ కవరేజ్ ఉపయోగపడుతుంది.

అన్‌ఇన్సూర్డ్ వాహనాల నుంచి రక్షణ

రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనానికి సరైన బీమా ఉండకపోవచ్చు. ప్రమాదానికి కారణమైన మరో వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే సమస్య మరింత పెరుగుతుంది. అందుకే అన్‌ఇన్సూర్డ్ లేదా అండర్‌ఇన్సూర్డ్ వాహనాలకు సంబంధించిన కవరేజ్ మీ పాలసీలో ఉందో లేదో ముందుగానే తెలుసుకోవాలి.

ఆస్తి నష్టానికి కవరేజ్

ప్రమాదం కారణంగా ఇతరుల ఆస్తికి నష్టం జరిగితే ఆర్థిక భారం మీపై పడే అవకాశం ఉంది. ఉదాహరణకు మరో వాహనం, గోడ లేదా ఇతర ఆస్తికి నష్టం కలిగితే దాని పరిహారం చెల్లించాల్సి రావచ్చు. సరైన పాలసీలో ప్రాపర్టీ డ్యామేజ్ కవరేజ్ ఉంటే ఇలాంటి ఖర్చుల విషయంలో రక్షణ లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో న్యాయపరమైన ఖర్చులకు కూడా కవరేజ్ ఉండొచ్చు.

ఇది కూడా చదవండి: తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో

సరైన ఇన్సూరెన్స్ బ్రోకర్‌ను ఎలా ఎంచుకోవాలి?

మొదటిసారి ఇన్సూరెన్స్ తీసుకునేవారికి సరైన పాలసీ ఎంపిక కొంత గందరగోళంగా అనిపించవచ్చు. అందుకే అర్హత ఉన్న ఇన్సూరెన్స్ బ్రోకర్ లేదా నిపుణుల సలహా తీసుకోవడం ఉపయోగకరం. ముందుగా.. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇటీవల కారు కొనుగోలు చేసిన వారి అనుభవాలను తెలుసుకోవచ్చు. వారు ఉపయోగించిన ఇన్సూరెన్స్ సేవలపై వివరాలు అడగండి. ఆన్‌లైన్‌లో ఉన్న సమీక్షలను కూడా పరిశీలించండి.

బ్రోకర్‌ను ఎంచుకునే ముందు గత కస్టమర్ల రిఫరెన్స్‌లు, అభిప్రాయాలు అడగడం మంచిది. అయితే కేవలం ఇతరుల అనుభవాల ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా, పాలసీలోని నిబంధనలు & కవరేజీలను స్వయంగా పరిశీలించాలి.

మీ అవసరాలకు తగ్గ పాలసీ ఎంచుకోండి

ప్రతి కారు యజమాని అవసరాలు ఒకేలా ఉండవు. అందుకే ముందుగా మీకు అవసరమైన కవరేజీల జాబితా తయారు చేసుకోవాలి. వ్యక్తిగత ప్రమాద రక్షణ, వాహన నష్టం, థర్డ్ పార్టీ నష్టం వంటి అంశాలను పరిశీలించాలి.

పాలసీ తీసుకునే ముందు కవరేజ్ పరిమితులు, మినహాయింపులు, ప్రీమియం, క్లెయిమ్‌కు సంబంధించిన నిబంధనలు తెలుసుకోవాలి. పాలసీ పత్రాన్ని పూర్తిగా చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.

నిపుణుల సలహా తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. మీ అవసరాలు & బడ్జెట్‌కు సరిపోయే పాలసీని గుర్తించడంలో అర్హత ఉన్న నిపుణులు సహాయం చేయగలరు.

ఇది కూడా చదవండి: ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే వాహన సేవలకు బ్రేక్, లైసెన్స్‌పై వేటు, కరెంటు కట్‌!

కొత్త కారు కొనడం ఆనందమే. కానీ ప్రమాదాలు ముందస్తు సమాచారం ఇవ్వవు. అందుకే చట్టపరమైన అవసరాలను పాటించడంతో పాటు, మీ కారు & మీ ఆర్థిక భద్రతకు సరైన ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
మహీంద్రా కార్లపై దసరా బంపర్‌ ఆఫర్లు.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కొత్త కారు కొనేవాళ్లు పండగ చేసుకోండి.. మహీంద్రా కార్లపై రూ.లక్షన్నర వరకు డిస్కౌంట్లు
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget