EV మార్కెట్లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!
సెప్టెంబర్ 2026లో భారత్‌లో EV సేల్స్ రికార్డు స్థాయికి చేరాయి. Tata Motors టాప్‌లో నిలవగా, Kia ఐదో స్థానాన్ని దక్కించుకుని Maruti Suzukiని వెనక్కి నెట్టింది.

September 2026 EV sales: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 2026లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఆ నెలలో మొత్తం 35,995 EVలు అమ్ముడయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన 18,520 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 94 శాతం పెరిగాయి. వరుసగా నాలుగో నెలలోనూ EV అమ్మకాలు 30,000 యూనిట్లను దాటాయి.
టాటా మోటార్స్ ఆధిపత్యం
ఈ మార్కెట్‌లో Tata Motors మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సెప్టెంబర్‌లో 14,769 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 7,353 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది కాలంలో అమ్మకాలు 101 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 41.03 శాతానికి చేరింది. ఈ లెక్కన, దేశంలో అమ్ముడైన ప్రతి 100 ఎలక్ట్రిక్ కార్లలో 41 కార్లు Tata బ్రాండ్‌వే అన్నమాట.
Tata Motorsకు Nexon EV ప్రధాన అమ్మకాల బలంగా ఉంది. అప్‌డేట్ చేసిన Tiago EV & Punch EV కూడా విక్రయాలకు మద్దతు ఇచ్చాయి. కంపెనీ తన Battery-as-a-Service విధానాన్ని Nexon EV, Curvv EV, Sierra EV & Harrier EVలకు కూడా విస్తరించింది.
రెండో స్థానంలో Mahindra నిలిచింది. సెప్టెంబర్‌లో 7,779 EVలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 96 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, టాటాతో పోలిస్తే దాదాపు సగం యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. మహీంద్రా మార్కెట్ వాటా 21.61 శాతంగా ఉంది. BE 6 & XEV 9e ప్రధాన మోడళ్లుగా ఉన్నాయి. XEV 9Sతో మూడు వరుసల సీట్లున్న EVను కూడా Mahindra అందిస్తోంది.
JSW MG Motor 5,242 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే కంపెనీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 9 శాతం మాత్రమే పెరిగాయి. మార్కెట్ వాటా 14.56 శాతంగా ఉంది. Windsor EV ఇప్పటికీ కంపెనీకి అత్యధిక అమ్మకాలు తెచ్చే మోడల్‌గా ఉంది.
ఇది కూడా చదవండి: కొత్త గేర్‌బాక్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ సీట్ మసాజ్.. Skoda Slavia Faceliftలో ఇంకా ఏం మారిందంటే?
Vinfast మాత్రం భారత మార్కెట్లో వేగంగా ఎదుగుతోంది. సెప్టెంబర్‌లో 2,963 EVలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కేవలం 6 యూనిట్లు మాత్రమే అమ్మింది. దీంతో వార్షిక వృద్ధి 49,283 శాతంగా నమోదైంది. మార్కెట్ వాటా 8.23 శాతానికి చేరింది.
ఆసక్తికరమైన మార్పు
సెప్టెంబర్ నెలలో ఆసక్తికరమైన మార్పు ఐదో స్థానంలో కనిపించింది. Maruti Suzukiని వెనక్కి నెట్టిన Kia ఐదో స్థానాన్ని దక్కించుకుంది. Kia సెప్టెంబర్‌లో 1,263 EVలను విక్రయించింది. గత ఏడాది 598 యూనిట్లతో పోలిస్తే 111 శాతం వృద్ధి సాధించింది. Syros EV రాకతో Kia అమ్మకాలు పెరిగాయి. Carens Clavis EV, EV6 & EV9 కూడా కంపెనీ EV పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.
Maruti Suzuki ఆరో స్థానానికి పడిపోయింది. సెప్టెంబర్‌లో 1,103 e Vitara యూనిట్లను విక్రయించింది. ఆగస్టులో 1,472 యూనిట్లు అమ్మగా, సెప్టెంబర్‌లో అమ్మకాలు 25 శాతం తగ్గాయి. దేశీయంగా e Vitara లభ్యత పరిమితంగా ఉండటం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది.
BYD కంపెనీ 836 యూనిట్లతో ఏడో స్థానంలో ఉంది. Hyundai 792 యూనిట్లను విక్రయించింది. BMW 502 యూనిట్లతో లగ్జరీ EV విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: Skoda Slavia Facelift EMI: నెలకు సుమారు రూ.14 వేలు కట్టి ఈ ప్రీమియం సెడాన్‌ను సొంతం చేసుకోండి!
Tesla కూడా వేగంగా పుంజుకుంటోంది. సెప్టెంబర్‌లో 291 EVలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 322 శాతం వృద్ధి సాధించింది. ఇదే Teslaకు భారత్‌లో ఇప్పటివరకు అత్యధిక నెలవారీ అమ్మకాలు. దీంతో Mercedes-Benzను వెనక్కి నెట్టి లగ్జరీ EV విభాగంలో రెండో స్థానానికి చేరింది.
మొత్తంగా చూస్తే సెప్టెంబర్ నెలలో కూడా Tata Motors స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగించగా, Mahindra బలమైన రెండో స్థానంలో ఉంది. Kia, Maruti Suzukiని వెనక్కి నెట్టడం ఆ నెలలో ప్రత్యేక విషయం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















