అన్వేషించండి

Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?

Triumph Bonneville 400 అక్టోబర్‌ 6న పరిచయం కానుంది. కొత్త బైక్‌లో క్లాసిక్ రెట్రో డిజైన్, కొత్త ఛాసిస్, 349cc ఇంజిన్ వంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి.

Triumph Bonneville 400: బైక్ ప్రియులకు అక్టోబర్‌ 6 ప్రత్యేకంగా మారబోతోంది. ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ 4 కొత్త బైక్‌లను పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ నాలుగు బైక్‌లలో అత్యంత ఆసక్తిని రేపుతున్న మోడల్ ట్రయంఫ్ బోన్నెవిల్‌ 400.

కొత్త బోన్నెవిల్‌ 400 ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్‌లో కనిపించింది. ఇప్పుడు అధికారిక పరిచయానికి సిద్ధమైంది. ట్రయంఫ్ 400 కుటుంబంలోకి ఇది మరో కొత్త మెంబర్‌గా చేరనుంది.

ట్రయంఫ్ కంపెనీ, ఇప్పటికే 400cc విభాగంలో చాలా మోడళ్లను తీసుకొచ్చింది.  Speed 400, Scrambler 400, Thruxton 400, Tracker 400 వంటివి ఈ ఫ్యామిలీలో ఉన్నాయి. అయితే Bonneville 400 వీటన్నింటికంటే భిన్నమైన రూపంతో రానుంది.

క్లాసిక్ రూపమే ప్రధాన ఆకర్షణ

పరీక్షల్లో కనిపించిన బైక్‌ను పరిశీలిస్తే బోన్నెవిల్‌ 400లో పూర్తి క్లాసిక్ రెట్రో రూపం కనిపిస్తుంది. పెద్ద బోన్నెవిల్‌ T100, T120 మోడళ్ల నుంచి డిజైన్ ప్రేరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

బైక్‌లో టియర్‌డ్రాప్ ఆకారంలోని ఇంధన ట్యాంక్ ఉంటుంది. ముందు, వెనుక భాగాల్లో వంపులతో కూడిన ఫెండర్లు ఉంటాయి. ఫ్లాట్ బెంచ్ సీటు కూడా క్లాసిక్ లుక్‌ను మరింత పెంచుతుంది. గుండ్రటి హెడ్‌ల్యాంప్, పీషూటర్ తరహా ఎగ్జాస్ట్ కూడా ఆకట్టుకునే అంశాలుగా నిలవనున్నాయి.

ఇతర 400 మోడళ్లతో పోలిస్తే సస్పెన్షన్ విషయంలోనూ మార్పులు ఉన్నాయి. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 వంటి బైక్‌లలో కనిపించే USD ఫోర్క్, మోనోషాక్ సెటప్‌కు బదులుగా బోన్నెవిల్‌ 400లో సాధారణ టెలిస్కోపిక్ ఫోర్కులు, రెండు వెనుక షాక్ అబ్జార్బర్లు ఉండనున్నాయి.

ముందు ఫోర్కులకు రబ్బర్ గైటర్లు కూడా ఉంటాయి. బైక్ క్లాసిక్ స్వభావానికి తగ్గట్టుగా ఛాసిస్ & స్వింగ్‌ఆర్మ్‌ను కూడా కొత్తగా రూపొందించినట్లు టెస్టింగ్‌ మ్యూల్‌లో కనిపించిన వివరాలు సూచిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త BMW F 450 R.. బుల్లెట్‌లా దూసుకెళ్లే 48hp పవర్‌.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

349cc ఇంజిన్

భారత్‌లో బోన్నెవిల్‌ 400కు 349cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్‌ను బైక్ స్వభావానికి తగ్గట్టుగా సౌమ్యంగా ట్యూన్ చేసే అవకాశం ఉంది.

స్పీడ్ T4లో ఇదే ఇంజిన్ 29hp శక్తి & 31Nm టార్క్ అందిస్తుంది. బోన్నెవిల్‌ 400 మాత్రం స్పోర్టీ పనితీరు కంటే ప్రశాంతమైన రైడింగ్ అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

రెట్రో బైక్‌లకు గట్టి పోటీ

బోన్నెవిల్‌ 400 భారత్‌లో ఒక కీలక విభాగంలోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఈ విభాగంలో Honda CB350 సిరీస్‌, Royal Enfield Classic 350 & Bullet 350 వంటి బైక్‌లు ఉన్నాయి. అందువల్ల బోన్నెవిల్‌ 400కు పోటీ కూడా గట్టిగానే ఉండనుంది. ముఖ్యంగా క్లాసిక్ రూపాన్ని ఇష్టపడేవాళ్లను ట్రయంఫ్ ఈ మోడల్‌తో ఆకర్షించాలనుకుంటోంది.

ఇది కూడా చదవండి: TVS Ntorq 150: రోజువారీ ప్రయాణానికి కొనదగిన స్కూటరేనా? 4,000km రియల్‌ వరల్డ్‌ రిపోర్ట్‌

అక్టోబర్‌ 6న ట్రయంఫ్ నాలుగు కొత్త బైక్‌లను పరిచయం చేయనుంది. వీటిలో బోన్నెవిల్‌ 400పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మిగిలిన మూడు బైక్‌లలో ఒకటి స్ట్రీట్ ట్రిపుల్ కాగా, మరో రెండు టైగర్ మోడళ్లుగా కనిపిస్తున్నాయి.

అయితే ట్రయంఫ్ నుంచి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే వరకు ఇంజిన్ ట్యూనింగ్, ఇతర సాంకేతిక అంశాలపై స్పష్టత రాదు. అక్టోబర్‌ 6న బోన్నెవిల్‌ 400పై పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ventilated Seats: లాంగ్‌ ట్రిప్పుల్లోనూ చల్లగా, హాయిగా జర్నీ.. ఈ 10 కార్లలో వెంటిలేటెడ్ సీట్లు.. మీ బడ్జెట్‌లోనే!
చల్లటి ప్రయాణాన్ని అందించే వెంటిలేటెడ్ సీట్లు ఉన్న 10 చవకైన కార్లు.. ప్రారంభ ధర రూ.8.50 లక్షలే!
Best Mileage Diesel Cars: మీ డబ్బు ఆదా చేస్తూ ఎక్కువ మైలేజీ ఇచ్చే డీజిల్ SUVలు.. 16.5 నుంచి 24.08kpl వరకు!
బెస్ట్‌ మైలేజీ ఇచ్చే 7 డీజిల్ కాంపాక్ట్ SUVలు ఇవే.. టాప్ ప్లేస్‌లో టాటా నెక్సాన్
421cc ఇంజిన్‌తో వస్తున్న Hero Xpulse 450 ఆవిష్కరణ.. 46.7hp పవర్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతలు
హీరో కొత్త బైక్‌లో కార్ల తరహా ఫీచర్లు.. Android Auto, Apple CarPlayతో వస్తున్న Xpulse 450!
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget