అన్వేషించండి

Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!

మహీంద్రా XUV 3XO CNG వెర్షన్‌ అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ SUVని ఇకపై తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం నడిపించవచ్చు.

Mahindra XUV 3XO CNG: సీఎన్‌జీ వెర్షన్‌ SUV కొనాలనుకునేవాళ్లకు గుడ్‌న్యూస్‌. మహీంద్రా XUV 3XOలో త్వరలో CNG వెర్షన్ రాబోతోంది. మహీంద్రా ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 15న XUV 3XO CNGని అధికారికంగా పరిచయం చేయనుంది. ఈ కొత్త వెర్షన్ మార్కెట్లోకి వస్తే XUV 3XOకు నాలుగో పవర్‌ట్రెయిన్ ఎంపిక అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం XUV 3XO పెట్రోల్, డీజిల్ & ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తోంది. ఇప్పుడు CNG కూడా చేరనుంది. టాటా నెక్సాన్ తరహాలో విభిన్న పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉన్న SUVగా XUV 3XO నిలవనుంది.

ఏ ఇంజిన్‌తో CNG?

మహీంద్రా ప్రస్తుతం XUV 3XOలో రెండు పెట్రోల్ ఇంజిన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి 1.2 లీటర్ MPFI టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 111 హెచ్‌పీ పవర్ అందిస్తుంది. మరో 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 131 హెచ్‌పీ పవర్ ఇస్తుంది.

CNG వెర్షన్‌లో 111 హెచ్‌పీ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌ను అమర్చే అవకాశం ఉంది. అయితే ఇంజిన్ పవర్, టార్క్, మైలేజ్ వంటి పూర్తి వివరాలను మహీంద్రా ఇంకా వెల్లడించలేదు.

బూట్ స్పేస్‌ ఎలా మేనేజ్‌ చేస్తారు?

XUV 3XOలో CNG ట్యాంక్ ఏర్పాటు చేయడం మహీంద్రాకు పెద్ద సవాలుగా మారవచ్చు. ప్రస్తుతం ఈ SUVలో సెగ్మెంట్‌లోనే చిన్న బూట్ స్పేస్ ఉంది. CNG ట్యాంక్‌ను అమర్చితే బూట్ స్థలం మరింత తగ్గే అవకాశం ఉంది. టాటా కార్ల తరహాలో రెండు చిన్న CNG సిలిండర్లను ఉపయోగిస్తుందా? లేక బూట్ కింద ట్యాంక్‌ను అమరుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏ విధానం ఎంచుకున్నా కారులో కొంత మార్పులు చేయాల్సి రావచ్చు.

ఇది కూడా చదవండి: 2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!

CNG SUVలకు పెరుగుతున్న డిమాండ్

భారత మార్కెట్లో CNG కార్లకు ఆదరణ పెరుగుతోంది. తక్కువ ఇంధన ఖర్చు & మెరుగైన మైలేజ్ కారణంగా చాలామంది కొనుగోలుదారులు CNG వైపు చూస్తున్నారు. ఈ ట్రెండ్‌ను మహీంద్రా కూడా ఉపయోగించుకోవాలని చూస్తోంది.

XUV 3XO CNG వస్తే కంపెనీకి అదనపు అమ్మకాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, 2027 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న కఠినమైన CAFE III నిబంధనలను అందుకోవడంలో కూడా CNG సహాయపడుతుంది.

ప్రస్తుతం పోటీలో ఉన్న మోడళ్లు ఏవి?

కాంపాక్ట్ SUV విభాగంలో CNG ఆప్షన్లు ఇప్పటివరకు చాలా తక్కువగా ఉన్నాయి. మారుతి సుజుకి బ్రెజ్జా & టాటా నెక్సాన్ మాత్రమే CNG పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉన్నాయి. XUV 3XO CNG రాకతో ఈ విభాగంలో పోటీ మరింత పెరుగుతుంది.

మహీంద్రాకు CNG కొత్త కాదు. గతంలో కంపెనీ తన కమర్షియల్‌ పికప్ వెహికల్స్‌లో CNGని అందించింది. లాగాన్ & వెరిటో వంటి మోడళ్లకు CNG మార్పిడి కిట్లను కూడా అందించింది. అయితే ప్రస్తుత ప్రయాణికుల వాహనాల శ్రేణిలో XUV 3XO CNGనే తొలి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: 2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!

ధర ఎంత ఉండొచ్చు?

XUV 3XO CNG ధరలను మహీంద్రా అక్టోబర్ 15న వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ వేరియంట్‌ రేటు రూ.7.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). దీంతో పోలిస్తే CNG వెర్షన్ ధర సుమారు రూ.1 లక్ష వరకు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఎక్కువ మైలేజ్ & తక్కువ ఇంధన వ్యయం కోరుకునేవారికి ఇది ఆసక్తికరమైన ఎంపికగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget