అన్వేషించండి

September 2026 Car Sales: టాటాకు భారీ షాక్.. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన మహీంద్రా.. సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల లెక్కలు

సెప్టెంబర్ 2026లో భారత కార్ల మార్కెట్ 32.1 శాతం వృద్ధి సాధించింది. టాటాను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉంది.

September 2026 car retail sales: భారత కార్ల మార్కెట్‌లో మహీంద్రా దూకుడు కొనసాగుతోంది. సెప్టెంబర్ 2026లో టాటాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. కేవలం 89 కార్ల తేడాతో ఈ స్థానాన్ని దక్కించుకుంది. మారుతి సుజుకి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్ 32.1 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 4,27,213 కార్లు అమ్ముడయ్యాయి. GST 2.0 ప్రకారం ధరలు తగ్గుతాయనే అంచనాలతో గతేడాది సెప్టెంబర్‌లో కొనుగోళ్ల డిమాండ్ కొంత మందగించింది. అందువల్ల ఈ ఏడాది వృద్ధికి బేస్ ఎఫెక్ట్ కూడా కారణమైంది.

అమ్మకాల పరంగా..

ఎప్పటిలాగే, సెప్టెంబర్‌లో కూడా కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉంది, 1,69,132 యూనిట్లను విక్రయించింది. వార్షికంగా 30.05 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్కెట్ వాటా 39.59 శాతంగా ఉంది. ఆగస్టుతో పోలిస్తే అమ్మకాలు 2.38 శాతం పెరిగాయి. మొత్తం అమ్మకాల పరంగా చూస్తే, మారుతి సుజుకి తన తర్వాతి మూడు కంపెనీలు కలిపి అమ్మిన కార్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించడం విశేషం. 

రెండో స్థానంలో మహీంద్రా నిలిచింది. కంపెనీ 57,343 కార్లను విక్రయించింది. వార్షిక వృద్ధి 38.93 శాతంగా ఉంది. నెలవారీగా అమ్మకాలు 14.13 శాతం పెరిగాయి. టాప్ 10 కంపెనీల్లో ఇదే అత్యధిక నెలవారీ వృద్ధి. మార్కెట్ వాటా కూడా 12.76 శాతం నుంచి 13.42 శాతానికి పెరిగింది. ఆగస్టుతో పోలిస్తే మహీంద్రా ఒక స్థానం పైకి ఎగబాకింది. 

ఇది కూడా చదవండి: 2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు

టాటా మోటార్స్ 57,254 కార్లతో మూడో స్థానానికి పడిపోయింది. మహీంద్రా కంటే కేవలం 89 కార్లు మాత్రమే తక్కువగా విక్రయించింది. టాటా అమ్మకాలు వార్షికంగా 28.66 శాతం పెరిగాయి. అయితే నెలవారీగా 1.02 శాతం తగ్గాయి. టాప్ 10 కంపెనీల్లో సెప్టెంబర్‌లో నెలవారీ అమ్మకాల క్షీణత నమోదైన ఏకైక కంపెనీ టాటానే. మార్కెట్ వాటా 13.76 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. 

హ్యుందాయ్ 50,201 కార్ల విక్రయాలతో నాలుగో స్థానంలో ఉంది. వార్షిక వృద్ధి 31.46 శాతం. నెలవారీగా 6.84 శాతం వృద్ధి సాధించింది. మార్కెట్ వాటా 11.75 శాతంగా ఉంది. 

టయోటా 28,050 కార్లతో ఐదో స్థానంలో నిలిచింది. వార్షిక వృద్ధి 21.56 శాతం కాగా, నెలవారీ వృద్ధి 12.85 శాతంగా ఉంది. 

కియా 26,663 కార్లతో ఆరో స్థానంలో ఉంది. టాప్ 10 కంపెనీల్లో అత్యధిక వార్షిక వృద్ధి కియాదే. కంపెనీ అమ్మకాలు ఏకంగా 45.91 శాతం పెరిగాయి. మార్కెట్ వాటా కూడా 5.65 శాతం నుంచి 6.24 శాతానికి పెరిగింది. 

స్కోడా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ 8,479 కార్లతో ఏడో స్థానంలో ఉంది. MG 6,475 కార్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. హోండా 5,283 కార్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా, రెనాల్ట్ 3,410 కార్లతో టాప్ 10లో చివరి స్థానాన్ని దక్కించుకుంది. రెనాల్ట్ వార్షిక అమ్మకాల్లో 33.10 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

ఇది కూడా చదవండి: Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు

ఇంధనాల పరంగా.. 

సెప్టెంబర్‌లో పెట్రోల్ కార్లు స్వల్ప ఆధిక్యాన్ని తిరిగి సాధించాయి. పెట్రోల్ & ఇథనాల్ కార్ల వాటా 41.27 శాతంగా ఉంది. CNG & LPG కార్ల వాటా 23.11 శాతం. హైబ్రిడ్ కార్ల వాటా 9.44 శాతం కాగా, ఎలక్ట్రిక్ కార్ల వాటా 8.45 శాతంగా ఉంది. డీజిల్ కార్ల వాటా 17.74 శాతంగా నమోదైంది. 

అక్టోబర్ నెల భారత కార్ల మార్కెట్‌కు కీలక పరీక్షగా మారనుంది. 2025 అక్టోబర్‌లో GST 2.0 ప్రభావం & పండుగ సీజన్ కారణంగా 4,66,800కు పైగా కార్లు అమ్ముడయ్యాయి. దీంతో అది అత్యుత్తమ అక్టోబర్‌గా నిలిచింది. ఇప్పుడు 2026 అక్టోబర్ గణాంకాలు మార్కెట్ అసలు బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. 

డీలర్ల అంచనాలు మాత్రం కొంత ఆశాజనకంగా ఉన్నాయి. అక్టోబర్‌లో అమ్మకాలు పెరుగుతాయని 75.57 శాతం డీలర్లు భావిస్తున్నారు. అమ్మకాలు స్థిరంగా ఉంటాయని 19.46 శాతం డీలర్లు అంచనా వేస్తున్నారు. మరో 4.98 శాతం మంది అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గమనిక: తెలంగాణ RTO గణాంకాలు FADA విడుదల చేసిన ఈ అమ్మకాల డేటాలో చేర్చలేదు. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget