అన్వేషించండి

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?

రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి స్కూటర్, బైక్ లేదా ఎలక్ట్రిక్ టూ వీలర్‌లో మీరు ఏది కొనడం సరైనది. మీ అవసరాలు, ప్రయాణ మార్గాన్ని బట్టి సరైన వాహనాన్ని తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆఫీస్‌కు టూవీలర్ ఎంపికకు దూరం, ట్రాఫిక్ ముఖ్యం.
  • సిటీ ట్రాఫిక్‌కు స్కూటర్, దూర ప్రయాణాలకు బైక్ అనుకూలం.
  • ఛార్జింగ్ అందుబాటులో ఉంటే ఈవీలు సిటీకి తక్కువ ఖర్చు.

రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి సరైన టూవీలర్‌ను ఎంచుకోవడం ముఖ్యం. కారులో వెళ్లడం కష్టమైన పని. అయితే రోజూ ఎంత దూరం ప్రయాణించాలి, ఎంత ట్రాఫిక్ ఉంటుంది, పార్కింగ్ సౌకర్యం, లాంటి విషయాలు గమనించాలి. ప్రతి నెలా ట్రావెలింగ్ కోసం ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు అనే దానిపై క్లారిటీ ఉండాలి. పెట్రోల్ స్కూటర్, పెట్రోల్ బైక్, ఎలక్ట్రిక్ వాహనం (EV) మూడింటికీ వాటి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి.

ప్రభుత్వ నేషనల్ హౌస్‌హోల్డ్ ట్రావెల్ సర్వే ప్రకారం, 42.6 శాతం మంది ఉద్యోగులు రోజూ ఆఫీస్‌లకు చేరుకోవడానికి టూవీలర్‌ ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో సరైన టూ-వీలర్‌ను ఎంచుకోవడం ముఖ్యం. అది మీ రోజువారీ సమయం, ఖర్చు రెండింటిపై ప్రభావం చూపుతుంది. మీ పని ఎక్కువగా సిటీలో ఉంటే స్కూటీ బెస్ట్ ఛాయిస్ కావచ్చు. ఒకవేళ దూరం ఎక్కువైనా లేదా  రోడ్లు ఖాళీగా ఉన్నా బైక్ బెస్ట్ అనిపించవచ్చు. మీకు ఛార్జింగ్ సౌకర్యం ఉంటే ఎలక్ట్రిక్ టూ-వీలర్ మీ నెలవారీ రవాణా ఖర్చు చాలా వరకు తగ్గిస్తుంది.

సిటీ ట్రాఫిక్‌లో స్కూటర్ ఎందుకు బెస్ట్

మీ ఆఫీస్ ఇంటి నుంచి దాదాపు 5 నుంచి 20 కిలోమీటర్ల దూరం అయి, భారీ ట్రాఫిక్ ఉంటే, పెట్రోల్ స్కూటర్ సరైన ఎంపిక కావచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండటం వల్ల పదే పదే క్లచ్, గేర్లు మార్చాల్సిన పని ఉండదు. అండర్ సీట్ స్టోరేజ్‌లో ఆఫీస్ బ్యాగ్ లేదా చిన్న చిన్న వస్తువులను పెట్టుకోవచ్చు. హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ 125 వంటి స్కూటర్లు రోజువారీ వాడకానికి కస్టమర్లకు సరైన ఎంపికలు. స్కూటర్ వల్ల మరో ప్రయోజనం ఏంటంటే, దీనిని ఈజీగా నడపడం, పార్కింగ్ సైతం చాలా సులభం. మీ రోజువారీ మార్గంలో గుంతల రోడ్లు లేదా పొడవైన హైవేలు ఉంటే, బైక్ బెస్ట్ అని చెప్పవచ్చు.

ఎక్కువ దూరం జర్నీకి బైకా లేదా ఈవీనా?

మీరు ఎక్కువ దూరం వెళ్లాల్సి రావడం, దారిలో ఖాళీ రోడ్లు లేదా హైవే లాంటివి వస్తే, 125-160cc కమ్యూటర్ బైక్ సరిపోతుంది. హోండా షైన్ 125, టీవీఎస్ రైడర్, హీరో సూపర్ స్ప్లెండర్  వంటి మోడల్స్ రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించారు. మరోవైపు, ఎలక్ట్రిక్ టూ వీలర్ సిటీ లోపల ప్రయాణానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో గేర్, క్లచ్ ఉండవు కనుక.. ఇల్లు లేదా ఆఫీస్‌లో ఛార్జింగ్ సదుపాయం ఉంటే ఈవీ తీసుకోవాలి. ఈవీ (EV) రన్నింగ్ కాస్ట్ పెట్రోల్ స్కూటర్, బైక్ కంటే చాలా తక్కువ. అయితే విద్యుత్ ఛార్జీలు, ఛార్జింగ్ సౌకర్యం, మీ రోజువారీ ప్రయాణ దూరంపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలు చేయడానికి ముందు ఛార్జింగ్ సదుపాయాన్ని చూసుకోవడం ముఖ్యం.

ఎవరికి ఏ టూ-వీలర్ సెట్ అవుతుంది

మీ ఆఫీస్ దగ్గరగా ఉండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్లయితే పెట్రోల్ స్కూటీ బెస్ట్. ఒకవేళ రోజూ 30-50 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం వెళ్లడం, దారిలో హైవే లేదా ఖాళీ రోడ్డు కూడా వస్తే పెట్రోల్ బైక్ మంచి ఎంపిక కావచ్చు. మీ వాడకం ఎక్కువగా సిటీలోనే ఉండి, ఇల్లు లేదా ఆఫీస్‌లో ఛార్జింగ్ సౌకర్యం ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి. కానీ ఈవీ కొనేముందు ఛార్జింగ్ సమయం, సర్వీస్ నెట్‌వర్క్, బ్యాటరీ వివరాలు చెక్ చేసుకోవాలి. 

Frequently Asked Questions

ఆఫీసుకు వెళ్లడానికి టూవీలర్ ఎంచుకునేటప్పుడు ఏమి పరిగణించాలి?

ప్రయాణ దూరం, ట్రాఫిక్, పార్కింగ్ సౌకర్యం, మరియు నెలవారీ ప్రయాణ ఖర్చులు వంటివి పరిగణించాలి. పెట్రోల్ స్కూటర్, బైక్ లేదా EV ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి.

సిటీ ట్రాఫిక్‌లో స్కూటర్ ఎందుకు ఉత్తమ ఎంపిక?

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వల్ల గేర్లు మార్చాల్సిన పని ఉండదు. అండర్ సీట్ స్టోరేజ్, సులభమైన పార్కింగ్ దీని ప్రయోజనాలు. 5-20 కి.మీ దూరానికి ఇది సరైన ఎంపిక.

ఎక్కువ దూరం ప్రయాణాలకు బైక్ లేదా ఎలక్ట్రిక్ వాహనం (EV)లో ఏది మంచిది?

ఖాళీ రోడ్లు లేదా హైవేలపై 125-160cc కమ్యూటర్ బైక్ మంచిది. సిటీలో ఛార్జింగ్ సౌకర్యం ఉంటే ఈవీ తక్కువ రన్నింగ్ ఖర్చుతో కూడుకున్నది.

మీ ప్రయాణ అవసరాలను బట్టి ఏ టూవీలర్ అనుకూలం?

ఆఫీస్ దగ్గర, ఎక్కువ ట్రాఫిక్‌కు పెట్రోల్ స్కూటీ. 30-50 కి.మీ దూరం, ఖాళీ రోడ్లకు పెట్రోల్ బైక్. సిటీలో ఛార్జింగ్ సౌకర్యం ఉంటే EV సరైనది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diwali Best Deals: ఎలక్ట్రిక్‌ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రూ.3.35 లక్షల వరకు తగ్గింపు! ఏ కారు కొంటే ఎక్కువ లాభమో తెలుసా?
ఈ దీపావళికి ఎలక్ట్రిక్ కారు కొనాలా? టాటా నుంచి కియా వరకు.. ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్లు!
Royal Enfield Himalayan 750 వచ్చేస్తోంది.. క్రూజ్‌ కంట్రోల్‌, TPMS సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల్లో హైయెస్ట్‌ పవర్‌ ఉన్న బండి.. హిమాలయన్ 750 ఫీచర్లు రివీల్!
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Automatic Second Hand Cars: ట్రాఫిక్‌లో క్లచ్ బాధ వద్దు.. రూ.6 లక్షల్లో వచ్చే ఈ 6 సెకండ్ హ్యాండ్ ఆటోమేటిక్ కార్లను పరిశీలించండి
సెకండ్‌ హ్యాండ్‌ ఆటోమేటిక్‌ కార్లు.. రూ.6 లక్షల బడ్జెట్‌లో 6 బెస్ట్‌ ఆప్షన్లు!
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah In Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Royal Enfield Himalayan 750 వచ్చేస్తోంది.. క్రూజ్‌ కంట్రోల్‌, TPMS సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల్లో హైయెస్ట్‌ పవర్‌ ఉన్న బండి.. హిమాలయన్ 750 ఫీచర్లు రివీల్!
Ranabaali OTT : రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Embed widget