అన్వేషించండి

మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?

2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 14న లాంచ్‌ కానుంది. కొత్త డిజైన్, ఏడీఏఎస్ ఫీచర్లు, మూడు సిలిండర్ల ఇంజిన్, మైలేజీ, అంచనా ధర వివరాల గురించి తెలుసుకోండి.

2026 Toyota Glanza Facelift Details: కొత్త కారు కొనేవాళ్లు టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ కోసం ఎదురుచూడొచ్చు. టయోటా కంపెనీ, తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాను కొత్త రూపంలో తీసుకొస్తోంది. 2026 అక్టోబర్ 14న ఈ కొత్త మోడల్‌ను లాంచ్‌ చేయనుంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేసిన టీజర్‌తో కారు ముందు భాగంలో చేసిన మార్పులు ప్రపంచానికి తెలిశాయి. కొత్త డిజైన్‌తో పాటు.. అదనపు ఫీచర్లు, కొత్త ఇంజిన్‌తో ఈ కారు మార్కెట్లోకి రానుంది. మరి కొత్త గ్లాంజాలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయి? ధర ఎంత పెరిగే అవకాశం ఉంది?.

కొత్త డిజైన్‌తో ఆకట్టుకునేలా..

2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధాన మార్పులు కారు ముందు భాగంలోనే కనిపించనున్నాయి. ఇటీవల అప్‌డేట్‌ చేసిన మారుతి సుజుకి బలెనో మాదిరిగానే ఇందులోనూ కొన్ని మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం గ్రిల్‌పై ఉన్న టయోటా లోగోను బానెట్ ముందు అంచుకు మార్చే అవకాశం ఉంది. ముందు భాగంలో మెరిసే అలంకరణ పట్టీని కూడా కొత్తగా రూపొందించారు.

ప్రస్తుత మోడల్‌లో ఉన్న గుండ్రటి ఫాగ్ ల్యాంపుల స్థానంలో దీర్ఘచతురస్రాకార లైట్లను అందించే అవకాశం ఉంది. గాలి లోపలికి వెళ్లే భాగంలో ఆరు కోణాల ఆకృతితో కూడిన కొత్త డిజైన్ కనిపించనుంది. ముందు భాగంలో అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థలకు సంబంధించిన సెన్సార్లను కూడా అందించే అవకాశం ఉంది. కొత్త రంగులు రావొచ్చని అంచనా. అయితే కారు పొడవు, వెడల్పు వంటి కొలతల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

క్యాబిన్‌లోనూ కొత్త ఫీచర్లు?

కొత్త గ్లాంజా లోపలి రూపకల్పనలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత మోడల్‌లోని డ్యాష్‌బోర్డు అమరిక, ఫిజికల్‌ బటన్లు, డ్యాష్‌బోర్డుపై ఏర్పాటు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్‌ కొనసాగవచ్చు. అయితే, కొత్త సేఫ్టీ ఫీచర్లను నియంత్రించేందుకు స్టీరింగ్‌పై అదనపు బటన్లు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?

హైయ్యర్‌ వేరియంట్లలో ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం, కూలింగ్‌ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం, మెరుగైన ఆడియో వ్యవస్థను అందించవచ్చని అంచనా. ప్రస్తుతం ఉన్న 9 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ ఏసీ, అనుసంధానిత కారు సాంకేతికత వంటి ఫీచర్లు కొనసాగవచ్చు.

భద్రతకు పెద్దపీట.. ఏడీఏఎస్ రానుందా?

కొత్త గ్లాంజాలో లెవెల్‌ 2 ADAS భద్రత వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవస్థలో భాగంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్‌లోనే కారు ఉండేలా సహాయపడే సదుపాయాలు ఉండవచ్చు.

టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షించే వ్యవస్థను (TPMS) కూడా అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 360 డిగ్రీల కెమెరా, హెడ్‌అప్ డిస్‌ప్లే, కొండపై కారు వెనక్కి జారకుండా చూసే సదుపాయం, స్థిరత్వ నియంత్రణ వ్యవస్థ, ఆరు ఎయిర్‌బ్యాగులు కొనసాగవచ్చని అంచనా. అయితే ఈ ఫీచర్లపై టయోటా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కొత్త 3-సిలిండర్‌ ఇంజిన్‌తో రానుందా?

2026 గ్లాంజాలో కీలకమైన మార్పు ఇంజిన్ విషయంలో ఉండనుంది. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ స్థానంలో కొత్త 1.2 లీటర్ 3-సిలిండర్‌ Z సిరీస్ ఇంజిన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!

అప్‌డేటెట్‌ బలెనోలో ఇదే ఇంజిన్ 83 హెచ్‌పీ శక్తిని, 112 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుత నాలుగు సిలిండర్ల ఇంజిన్ 90 హెచ్‌పీ శక్తిని, 113 ఎన్ఎం టార్క్‌ను అందిస్తోంది. అంటే కొత్త ఇంజిన్‌లో గరిష్ఠ శక్తి కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుందా, లేదా? అన్నది అధికారిక గణాంకాలు వెల్లడైన తర్వాతే స్పష్టమవుతుంది.

గేర్‌బాక్స్ ఎంపికల్లో మార్పులు ఉండకపోవచ్చు. ఐదు గేర్ల మాన్యువల్, ఐదు గేర్ల AMT గేర్‌బాక్స్ ఎంపికలు కొనసాగే అవకాశం ఉంది. CNG వేరియంట్లు కూడా అందుబాటులోకి రావొచ్చు. CNG మోడల్‌లో 70 హెచ్‌పీ శక్తి, 102 ఎన్ఎం టార్క్ ఉండవచ్చని అంచనా.

ధర పెరుగుతుందా?

ప్రస్తుతం టయోటా గ్లాంజా ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.6.73 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంది. కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పుల కారణంగా ఫేస్‌లిఫ్ట్ ధర పెరిగే అవకాశం ఉంది. కొత్త మోడల్ ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Maruti Suzuki Baleno, Tata Altroz, Hyundai i20 కార్లకు గ్లాంజా పోటీగా నిలుస్తోంది. అక్టోబర్ 14న లాంచ్‌ సందర్భంగా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ ధర, వేరియంట్లు, పూర్తి ఫీచర్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget