2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 స్కోడా స్లావియా ధర రూ.10 లక్షల నుంచి రూ.18.84 లక్షల వరకు ఉంది. ఆరు ట్రిమ్‌లలో 12 వేరియంట్లతో వచ్చిన ఈ సెడాన్‌లో ఏ వేరియంట్ కొనాలో తెలుసుకోండి.

2026 Skoda Slavia variants and features: 2026 స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చింది. ఈసారి స్కోడా ఈ సెడాన్‌లో డిజైన్‌తో పాటు ఫీచర్లు, ఇంటీరియర్, గేర్‌బాక్స్ విషయంలోనూ కీలక మార్పులు చేసింది. కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం స్లావియా 6 ట్రిమ్‌లలో మొత్తం 12 వేరియంట్లలో లభిస్తోంది. Classic, Classic+, Signature, Sportline, Prestige, Monte Carlo అనే ఆరు ట్రిమ్‌లు ఉన్నాయి. ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ.18.84 లక్షల వరకు ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే.. 1.0 లీటర్ TSI, 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 1.0 లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్ 115 హెచ్‌పీ పవర్, 178 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ లేదా 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు.
టాప్ వేరియంట్లలో లభించే 1.5 లీటర్ 4 సిలిండర్ల టీఎస్ఐ ఇంజిన్ 150 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. దీనికి 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ ఇంజిన్‌లో సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ కూడా ఉంది. అవసరం తక్కువగా ఉన్నప్పుడు రెండు సిలిండర్లతో పనిచేసి ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది.
1.0 లీటర్ మాన్యువల్ వెర్షన్ 19.76 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఆటోమేటిక్ వెర్షన్ 19.50 కిలోమీటర్లు, 1.5 లీటర్ వెర్షన్ 18.79 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
క్లాసిక్
ఇది బేస్ వేరియంట్, దీని ధర రూ.10 లక్షలు. ఇందులో 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్డ్ యాపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌సీ, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
క్లాసిక్+
క్లాసిక్+ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.12.49 లక్షల వరకు ఉంటుంది. క్లాసిక్‌లో ఉన్న ఫీచర్లతో పాటు ఇందులో సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్లు వస్తాయి.
ఇది కూడా చదవండి: 776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
సిగ్నేచర్
సిగ్నేచర్ ధర రూ.13.94 లక్షల నుంచి రూ.14.94 లక్షల వరకు ఉంది. ఇది అత్యంత ఆకర్షణీయమైన వేరియంట్. క్లాసిక్, క్లాసిక్+ వేరియంట్లలో ఉన్న ఫీచర్లకు అదనంగా 8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ ఏఐ అసిస్టెంట్, 8 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు వంటి ఫీచర్లు ఉన్నాయి. రియర్ ఏసీ వెంట్స్, రియర్ కెమెరా, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, పవర్ ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.
స్పోర్ట్‌లైన్
స్పోర్ట్‌లైన్ ధర రూ.14.34 లక్షల నుంచి రూ.15.34 లక్షల వరకు ఉంటుంది. పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు ఇందులో 360 డిగ్రీ కెమెరా, 16 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, గ్లోస్ బ్లాక్ ఎలిమెంట్స్, బూట్ లిప్ స్పాయిలర్, అల్యూమినియం పెడల్స్ వంటి స్పోర్టీ ఫీచర్లు యాడ్ అవుతాయి.
ప్రెస్టీజ్
ప్రెస్టీజ్ ధర రూ.15.89 లక్షల నుంచి రూ.18.59 లక్షల వరకు ఉంటుంది. ఇందులో అదనంగా 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, లెదరెట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ కూడా ఈ ట్రిమ్‌లో లభిస్తుంది.
ఇది కూడా చదవండి: టాటాకు భారీ షాక్.. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన మహీంద్రా.. సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల లెక్కలు
మోంటే కార్లో
ఇది టాప్ వేరియంట్, దీని ధర రూ.17.29 లక్షల నుంచి రూ.18.84 లక్షల వరకు ఉంది. పైన ఉన్న అన్ని వేరియంట్ల ఫీచర్లకు అదనంగా బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ యాంబియంట్ లైటింగ్, రెడ్ గ్రిల్ యాక్సెంట్లు, రెడ్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ స్టిచింగ్‌తో బ్లాక్ లెదరెట్ సీట్లు ఇందులో ఉన్నాయి.
ఏ వేరియంట్ కొనాలి?
చాలా మందికి సిగ్నేచర్ వేరియంట్ బెస్ట్ ఛాయిస్. ధరకు తగ్గ ఫీచర్లతో ఇది మంచి ప్యాకేజీగా నిలుస్తుంది. ముఖ్యంగా రూ.15 లక్షల లోపు ఆటోమేటిక్ సెడాన్ కావాలనుకునే వారికి సిగ్నేచర్ మంచి ఎంపిక.
పెర్ఫార్మెన్స్‌తో పాటు అన్ని ప్రీమియం ఫీచర్లు కావాలనుకునేవారు ప్రెస్టీజ్ వైపు వెళ్లొచ్చు. ఇందులో పవర్‌ఫుల్ 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ కూడా ఉంటుంది. అయితే ధరను దృష్టిలో పెట్టుకుంటే, సిగ్నేచర్ వేరియంట్‌లోనే ఫీచర్లు, ధర మధ్య మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















