776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
సుజుకి GSX 8Rపై రూ.80 వేల నగదు డిస్కౌంట్ ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకు దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Suzuki Bikes Discounts October 2026: స్పోర్ట్స్ బైక్ కొనాలని చూస్తున్నవాళ్లకు ప్రముఖ బైక్ కంపెనీ సుజుకి నుంచి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. GSX 8R బైక్‌పై ఏకంగా రూ.80,000 నగదు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. అంటే.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!.
సుజుకి కంపెనీ.. GSX 8Rను గతేడాది భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అప్పట్లో ఈ బైక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.25 లక్షలుగా ఉండేది. GST 2.0 మార్పుల తర్వాత ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం డిస్కౌంట్‌కు ముందు దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.9.89 లక్షలుగా ఉంది.
ధర పెరగడంతో ఈ మిడిల్‌వెయిట్ బైక్‌పై కొనుగోలుదారుల ఆసక్తి కొంత తగ్గే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సుజుకి తాజా ఆఫర్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రూ.80,000 డిస్కౌంట్ తర్వాత GSX 8Rను రూ.9.09 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు సొంతం చేసుకోవచ్చు.
పవర్‌ట్రెయిన్
GSX 8Rలో 776cc ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 82.9hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 78Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్‌లో రైడ్ బై వైర్ సాంకేతికతను అందించారు. మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. నాలుగు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది.
అంతేకాదు.. బైడైరెక్షనల్ క్విక్షిఫ్టర్ను కూడా కంపెనీ స్టాండర్డ్‌గా అందిస్తోంది. పూర్తిగా LED లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. బైక్‌లో TFT డిస్ప్లే కూడా ఉంది. ఈ ఫీచర్లన్నీ కలిపి GSX 8Rను టెక్నాలజీ పరంగా ఆకర్షణీయమైన మిడిల్‌వెయిట్ బైక్‌గా నిలబెడుతున్నాయి.
ఇది కూడా చదవండి: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
ఈ బైక్ మూడు రంగుల్లో లభిస్తుంది. మెటాలిక్ ట్రిటాన్ బ్లూ, మెటాలిక్ మ్యాట్ స్వోర్డ్ సిల్వర్ & మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2 రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
Daytona 660 కంటే రూ.90,000 తక్కువ ధర
సుజుకి GSX 8Rకు మార్కెట్లో గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా Triumph Daytona 660 దీనికి గట్టి ప్రత్యర్థి. ఇటీవల అప్డేట్ అయిన డేటోనా 660 ధర రూ.9.99 లక్షలుగా ఉంది. అయితే GSX 8Rపై రూ.80,000 డిస్కౌంట్‌ను కలుపుకుంటే దీని ధర రూ.9.09 లక్షలకు తగ్గుతుంది. అంటే డేటోనా 660 కంటే GSX 8R ఏకంగా రూ.90,000 తక్కువ ధరకే లభిస్తుంది.
ఇటీవల హోండా తన 650cc బైక్‌లను భారత మార్కెట్ నుంచి ఎగ్జిట్ చేసింది. దీంతో దేశీయ మార్కెట్లో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న ప్రధాన మోడళ్లలో GSX 8R & డేటోనా 660 కీలకంగా మారాయి.
ఇది కూడా చదవండి: Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్ ఆప్షన్?
సుజుకి GSX 8R కేవలం వేగం కోసం రూపొందించిన బైక్ మాత్రమే కాదు. రోజువారీ వినియోగానికి కూడా అనుకూలంగా ఉండే ఆల్‌రౌండర్‌గా ఇది గుర్తింపు పొందింది. స్పోర్టీ డిజైన్‌తో పాటు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందించేలా దీనిని రూపొందించారు.
ప్రస్తుత రూ.80,000 డిస్కౌంట్ శాశ్వత ఆఫర్ కాదు. సుజుకి అధికారిక వెబ్సైట్ ప్రకారం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















