అన్వేషించండి

350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!

ట్రయంఫ్ బొన్నెవిల్ T40 భారత మార్కెట్లో రూ.2.80 లక్షల ధరతో లాంచ్‌ అయింది. 350cc ఇంజిన్, 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Triumph Bonneville T40 Price And Features Telugu: ట్రయంఫ్ నుంచి మరో 350cc సిరీస్‌ బైక్‌ మార్కెట్లోకి వచ్చింది. బజాజ్‌తో కలిసి డెవలప్‌ చేసిన బొన్నెవిల్ T40ని లాంచ్‌ చేసింది. ఈ మోటార్‌సైకిల్‌ ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.80 లక్షలు. క్లాసిక్ డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లను ఈ బైక్‌లో అందించారు.

బొన్నెవిల్ T40తో పాటు తక్కువ ధరలో బొన్నెవిల్ T4ను కూడా ట్రయంఫ్ పరిచయం చేసింది. T4లో కొన్ని ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉండవు. అయితే ఇంజిన్ & ప్రధాన మెకానికల్ అంశాలు T40తో సమానంగా ఉంటాయి.

350cc ఇంజిన్.. భిన్నమైన ట్యూనింగ్

బొన్నెవిల్ T40లో ఇతర బజాజ్-ట్రయంఫ్ బైక్‌ల్లో కనిపించే 350cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌నే ఉపయోగించారు. అయితే దీని ట్యూనింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ ఇంజిన్ 7,000rpm వద్ద 29hp శక్తిని, 5,500rpm వద్ద 31.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ & మధ్యస్థ వేగాల్లో మంచి టార్క్ అందించడమే లక్ష్యంగా ఇంజిన్‌ను ట్యూన్ చేసినట్లు ట్రయంఫ్ తెలిపింది.

ఇందులో కొత్త సిలిండర్ హెడ్, ప్రత్యేక క్యామ్‌షాఫ్ట్‌లు, చిన్న వ్యాసం కలిగిన థ్రాటిల్ బాడీలు, కొత్త ఇంజిన్ ట్యూనింగ్ ఉన్నాయి. కొత్త పీషూటర్ ఎగ్జాస్ట్‌ను కూడా అందించారు. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. అయితే ఇతర మోడళ్లతో పోలిస్తే T40లో గేరింగ్ కొంత పొడవుగా ఉంటుంది.

కొత్త ఫ్రేమ్‌తో క్లాసిక్ లుక్

బొన్నెవిల్ T40 ఫ్రేమ్‌లో కూడా గణనీయమైన మార్పులు చేశారు. ముందు భాగం ఇతర బజాజ్-ట్రయంఫ్ మోడళ్లకు దగ్గరగా ఉన్నప్పటికీ వెనుక భాగం పూర్తిగా కొత్తగా ఉంటుంది. ట్విన్ షాక్ అబ్జార్బర్లు & కొత్త ట్యూబ్యులర్ స్టీల్ స్వింగ్‌ఆర్మ్ కోసం ఈ కొత్త ఫ్రేమ్‌ను రూపొందించారు. క్లాసిక్ బొన్నెవిల్ రూపాన్ని తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని సబ్‌ఫ్రేమ్‌ను మెయిన్ ఫ్రేమ్‌కు బోల్ట్ చేయకుండా వెల్డ్ చేశారు.

సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో 43mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండింటిలోనూ 130mm ట్రావెల్ ఉంటుంది.

బ్రేకింగ్ కోసం ముందు 310mm డిస్క్, వెనుక 255mm డిస్క్ ఇచ్చారు. ముందు భాగంలో ట్విన్ పిస్టన్ కాలిపర్, వెనుక సింగిల్ పిస్టన్ కాలిపర్ ఉంటుంది. లీన్ సెన్సిటివ్ ABS కూడా అందించారు.

ఇది కూడా చదవండి: నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?

195kg బరువు.. 790mm సీట్ హైట్

బొన్నెవిల్ T40 బరువు 195kg. బజాజ్ తయారు చేసే ట్రయంఫ్ సింగిల్ సిలిండర్ బైక్‌లలో ఇదే అత్యంత బరువైన మోడల్. అయితే 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో పెద్ద సామర్థ్యాన్ని అందిస్తోంది.

సీట్ హైట్ 790mm. కావాలంటే ట్రయంఫ్ యాక్సెసరీ లో సీట్‌తో దీన్ని 770mmకు తగ్గించుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 165mm ఉండటంతో రోడ్లపై గుంతలు & స్పీడ్ బ్రేకర్ల నుంచి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.

వైర్ స్పోక్ వీల్స్‌తో క్లాసిక్ లుక్

బొన్నెవిల్ T40లో వైర్ స్పోక్ వీల్స్ ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన MRF ట్యూబ్ టైర్లను అమర్చారు. ముందు 100/90-18, వెనుక 150/70-R18 టైర్లు ఉన్నాయి.

ట్యూబ్డ్‌ టైర్ల వల్ల, పంక్చర్ అయినప్పుడు రిపేర్‌కు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ బైక్‌లో సెంటర్ స్టాండ్‌ను స్టాండర్డ్‌గా అందించారు. దీంతో నిర్వహణ కొంత సులభంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి

4 అంగుళాల TFT డిస్‌ప్లే

ట్రయంఫ్ బొన్నెవిల్ T40లో కొత్త 4 అంగుళాల రౌండ్ కలర్ TFT డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 5 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. రోడ్, రైన్, ఎకోతో పాటు రెండు కస్టమైజ్ చేసుకునే మోడ్‌లు అందించారు.

ABS, ట్రాక్షన్ కంట్రోల్ & క్రూయిజ్ కంట్రోల్ కూడా స్టాండర్డ్‌గా ఉన్నాయి. డిస్‌ప్లేలో హెరిటేజ్ మోడ్ కూడా ఉంది. దీన్ని ఎంచుకుంటే స్క్రీన్ లేఅవుట్ పాతకాలపు శైలిలోకి మారుతుంది.

ట్రయంఫ్ నావిగేషన్ యాప్ ద్వారా ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేస్తే నావిగేషన్ సమాచారాన్ని కూడా డిస్‌ప్లేలో చూడొచ్చు.

ధర ఎక్కువే.. T4 తక్కువ ధరలో

బొన్నెవిల్ T40 ధర రూ.2.80 లక్షలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా CB350C & జావా 350 కంటే ఇది ఖరీదైనది. ఇటీవల విడుదలైన హోండా CB500 బేస్ వేరియంట్ కంటే కూడా T40 ధర ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ ధర ఎక్కువ అనుకునేవాళ్ల కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T4ను కూడా కంపెనీ అందిస్తోంది. దీని ధర రూ.2.55 లక్షలు. ఇందులో 140 సెక్షన్ వెనుక టైర్, కలర్ LCD డిస్‌ప్లే, టర్న్ బై టర్న్ నావిగేషన్, రైడింగ్ మోడ్‌లు & డ్యూయల్ ఛానల్ ABS ఉన్నాయి. అయితే క్రూయిజ్ కంట్రోల్ & IMU ఉండవు.

T4 మూడు సాలిడ్ రంగుల్లో లభిస్తుంది. గ్రీన్, బ్లాక్ & రెడ్ రంగులు ఉన్నాయి. రెండు మోడళ్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. T40 డెలివరీలు వచ్చే నెల (నవంబర్‌) నుంచి ప్రారంభమవుతాయి. T4 డెలివరీలు 2027 జనవరి రెండో వారం నుంచి మొదలవుతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget