అన్వేషించండి

కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!

కొత్త కారు కొనేవారు తెలుసుకోవాల్సిన 5 అదనపు ఖర్చులు ఇవే. బీమా, రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను, యాక్సెసరీలు, వారంటీ వివరాలతో అనవసర ఖర్చులను తగ్గించుకోండి.

Buying First Car Tips: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, షోరూమ్‌లో చెప్పే ధరే మీరు చెల్లించాల్సిన తుది మొత్తం అని అనుకోకండి. కారు కొనుగోలు సమయంలో కనిపించే ధరకు, వాహనం మీ ఇంటికి చేరే వరకు అయ్యే ఖర్చుకు చాలా తేడా ఉండొచ్చు. రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను, బీమా, అదనపు పరికరాలు.. ఇలా కొన్ని రకాల ఖర్చులు మీ బిల్లును, బీపీని పెంచుతాయి. ముఖ్యంగా తొలిసారి కారు కొనేవారు కొన్ని విషయాలను పట్టించుకోకపోతే అనవసరంగా ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు. అందుకే కారు బుక్ చేసే ముందే ఈ ఐదు ఖర్చుల గురించి తెలుసుకోవాలి.

1. కారు బీమా.. ధర మాత్రమే చూడకండి!

కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు బీమా తప్పనిసరి ఖర్చుగా కనిపిస్తుంది. అయితే తక్కువ ధరకు పాలసీ వస్తోందని వెంటనే తీసుకోవద్దు. థర్డ్ పార్టీ బీమా అనేది చట్టప్రకారం తప్పనిసరి. మీ వాహనం వల్ల ఇతరులకు జరిగే నష్టం లేదా గాయాలకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతలను ఇది కవర్ చేస్తుంది. కానీ మీ సొంత కారుకు జరిగే నష్టాన్ని కవర్ చేయదు.

అందుకే కారు విలువ, వినియోగం, ప్రయాణించే ప్రాంతాలను బట్టి సమగ్ర బీమాను పరిశీలించాలి. బీమా తీసుకునేటప్పుడు IDV, డిడక్టబుల్స్, మినహాయింపులు, క్లెయిమ్ సేవలు, నగదు చెల్లించకుండా మరమ్మతులు చేసే గ్యారేజీల వివరాలు తెలుసుకోవాలి. తక్కువ ప్రీమియం ఉన్న పాలసీనే ఉత్తమమని భావించకూడదు.

2. బీమా అదనపు కవరేజ్‌తో పెరిగే ఖర్చు!

కారు కొనుగోలు సమయంలో బీమాతో పాటు పలు అదనపు కవరేజ్‌లు/యాడ్‌-ఆన్స్‌‌ను కూడా సూచిస్తారు. జీరో డిప్రిసియేషన్, రిటర్న్ టు ఇన్వాయిస్, ఇంజిన్ ప్రొటెక్షన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు వీటిలో ఉన్నాయి. ప్రతి అదనపు కవర్ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. అలాగే, ప్రీమియం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో అన్నింటినీ తిరస్కరించడం కూడా సరైన నిర్ణయం కాదు. మీ కారు విలువ, పార్కింగ్ చేసే ప్రదేశం, ప్రయాణాల తరచుదనం, స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన కవరేజ్‌లను ఎంచుకోవాలి.

ఇది కూడా చదవండి: Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!

3. యాక్సెసరీలతో బిల్లు తడిసి మోపెడు!

కారు కొనుగోలు ధరకు అదనంగా సీటు కవర్లు, ఫ్లోర్ మ్యాట్లు, డ్యాష్ కెమెరాలు, వినోద పరికరాలు వంటి యాక్సెసరీలను కొనుగోలు చేయాల్సి రావచ్చు. షోరూమ్‌లో వీటిని ఒక ప్యాకేజీగా సూచించినప్పుడు అవసరం లేకపోయినా కొనేవారు ఉంటారు. అందుకే, ప్రతి వస్తువు ధరను విడిగా అడగాలి. నిజంగా అవసరమా, లేదా అనేది పరిశీలించాలి. బయట మార్కెట్‌లో ధరలతో పోల్చాలి. షోరూమ్‌లోనే కొనాలనే నిబంధన ఏమీ లేదు. అవసరం లేని వస్తువులకు డబ్బు ఖర్చు చేయకుండా ఉంటే మొత్తం కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.

4. వారంటీ ఉంటే అన్ని మరమ్మతులూ ఉచితమా?

కొత్త కారు కొనేవారిలో చాలామందికి వారంటీపై స్పష్టత ఉండదు. వారంటీ అంటే కారు పాడైతే ప్రతి మరమ్మతునూ ఉచితంగా చేస్తారని కాదు. తయారీ లోపాలు, నిర్దిష్ట విడిభాగాల సమస్యలకు మాత్రమే నిబంధనల ప్రకారం వారంటీ వర్తించవచ్చు.

మోటార్ బీమా మాత్రం.. ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతరులకు జరిగే నష్టాలు వంటి నిర్దిష్ట ప్రమాదాలకు రక్షణ కల్పిస్తుంది. సాధారణ నిర్వహణ, విడిభాగాల అరిగిపోవడం వంటి ఖర్చులు ప్రతి పాలసీలోనూ కవర్ కావు. కాబట్టి వారంటీ, బీమా మధ్య తేడాను ముందే తెలుసుకోవాలి.

ఇది కూడా చదవండి: 2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!

5. తక్కువ ప్రీమియం.. తర్వాత ఎక్కువ ఖర్చా?

బీమా తీసుకునేటప్పుడు ఎంత చెల్లించాలనే ప్రశ్నతో పాటు, అవసరమైన సమయంలో ఎంత రక్షణ లభిస్తుందనే విషయాన్నీ పరిశీలించాలి. తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలో కవరేజీ పరిమితులు ఉండవచ్చు. IDV తక్కువగా ఉండటం, డిడక్టబుల్స్ ఎక్కువగా ఉండటం, క్లెయిమ్ సేవల్లో పరిమితులు ఉండటం వల్ల తర్వాత మీ జేబు నుంచి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు.

కారు కొనుగోలు ధరతో పాటు దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చులనూ అంచనా వేయాలి. రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను వంటి తప్పనిసరి చెల్లింపులతో పాటు బీమా, యాక్సెసరీలు, ఇతర రుసుములను కూడా లెక్కలోకి తీసుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget