అన్వేషించండి

2026 Toyota Glanza Facelift లుక్‌ అదిరిపోయింది.. కొత్త ఇంజిన్, ADAS ఫీచర్లు, CNG ఆటోమేటిక్ కూడా!

2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ అయింది. ప్రారంభ ధర రూ.6.99 లక్షలు. కొత్త 3 సిలిండర్ ఇంజిన్, పెరిగిన మైలేజీ, ADAS ఫీచర్లు, CNG ఆటోమేటిక్ ఎంపికలు ఉన్నాయి.

2026 Toyota Glanza facelift Details In Telugu: మంచి మైలేజీ, ఆధునిక ఫీచర్లు ఉన్న హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నవారికి ఒక మంచి వార్త. టయోటా, తన పాపులర్‌ గ్లాంజా కారుకు కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. ఈ మోడల్‌ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను కేవలం రూ.6.99 లక్షలుగా నిర్ణయించింది. కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ లుక్‌కు మంచి మార్కులు పడ్డాయి. కొత్త రూపం, మెరుగైన ఇంధన సామర్థ్యం, అదనపు ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా కంపెనీ ఈ కారును తీసుకొచ్చింది. 

కొత్త గ్లాంజా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.11,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. నవంబర్ మొదటి వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ధరలు ఎంతంటే?

2026 టయోటా గ్లాంజా మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది, అవి: E, S, G, V & V (O). వీటి ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.10.98 లక్షల వరకు ఉన్నాయి.

E పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.6.99 లక్షలు. S వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ.7.71 లక్షలు. ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ధర రూ.8.31 లక్షలు. ఇదే వేరియంట్ CNG మాన్యువల్ ధర రూ.8.76 లక్షలు కాగా, CNG AMT ధర రూ.9.31 లక్షలు.

G వేరియంట్ ధరలు రూ.8.73 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. V వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ.9.99 లక్షలు. టాప్ వేరియంట్ V (O) మాన్యువల్ ధర రూ.10.49 లక్షలు. దీని AMT ధర రూ.10.98 లక్షలు.

పాత మోడల్‌తో పోలిస్తే పెట్రోల్ వేరియంట్ల ధరలు గరిష్ఠంగా రూ.లక్ష వరకు పెరిగాయి. CNG మాన్యువల్ వేరియంట్ ధర కూడా గరిష్ఠంగా రూ.27,000 వరకు పెరిగింది. 

ఇది కూడా చదవండి: మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!

కొత్త ఇంజిన్.. మెరుగైన మైలేజీ

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధాన మార్పు ఇంజిన్. పాత మోడల్‌లోని నాలుగు సిలిండర్ల ఇంజిన్ స్థానంలో కొత్త 1.2 లీటర్, మూడు సిలిండర్ల Z12E పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీతోనూ పనిచేస్తుంది.

పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజిన్ 83hp శక్తిని, 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు గేర్ల మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు AMT ఎంపిక కూడా ఉంది. మాన్యువల్ వేరియంట్ లీటరుకు 23.80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సంస్థ ప్రకటించింది. AMT వేరియంట్ లీటరుకు 24.77 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.

పాత మోడల్‌తో పోలిస్తే శక్తి 7 హెచ్‌పీ తగ్గినా, ఇంధన సామర్థ్యం పెరిగింది. ఇంజిన్‌లోని ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ వ్యవస్థ కూడా ఇంధన ఆదాకు సహాయపడుతుంది.

సీఎన్‌జీ వినియోగదారులకు కూడా కొత్త ఎంపిక అందుబాటులోకి వచ్చింది. సీఎన్‌జీ మోడ్‌లో ఇంజిన్ 70hp శక్తిని, 102Nm టార్క్‌ను అందిస్తుంది. మాన్యువల్ వేరియంట్ కిలోగ్రాముకు 33.61 కిలోమీటర్లు, AMT వేరియంట్ 34.47 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని కంపెనీ వెల్లడించింది. సీఎన్‌జీతో AMT ఎంపిక అందించడం ఈ మోడల్‌లో చెప్పుకోదగిన మార్పు.

కొత్త రూపం.. అదనపు ఫీచర్లు

గ్లాంజా ముందు భాగంలో కొత్త మార్పులు చేశారు. పెద్ద గ్రిల్, కొత్త రూపంలోని ముందు ఫాగ్ ల్యాంపులు, షార్క్ ఫిన్ యాంటెన్నా ఇందులో ఉన్నాయి. ముందు టయోటా లోగో స్థానాన్ని కూడా మార్చారు. ADAS వ్యవస్థకు అవసరమైన రాడార్ మాడ్యూల్‌ను ముందుభాగంలో అమర్చారు.

డిజిటల్ టీల్ గ్రీన్ & బ్లూయిష్ బ్లాక్ అనే రెండు కొత్త రంగులను కూడా పరిచయం చేశారు. అయితే, హెడ్‌లైట్లు, వెనుక భాగం డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. 16 అంగుళాల అల్లాయ్ చక్రాలు, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, వెనుక వైపర్ వంటి అంశాలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?

లోపల కొత్త లెదరెట్ సీటు కవర్లు, ముందు సీట్లకు వెంటిలేషన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఛార్జర్ కింద ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేక కూలింగ్ వెంటు కూడా ఇచ్చారు. క్లారియన్ సంస్థకు చెందిన నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లతో కూడిన ఆడియో వ్యవస్థను అందించారు.

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), లెవల్-2 ADAS వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలు కూడా ఉన్నాయి. 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ తెర, హెడ్‌అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ AC, వెనుక AC వెంట్లు కొనసాగుతున్నాయి. 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, పిల్లల సీట్ల కోసం ISOFIX అమరికలు కూడా ఉన్నాయి.

పరిమాణాల విషయానికి వస్తే, కారు పొడవు 3,990 మి.మీ., వెడల్పు 1,745 మి.మీ., ఎత్తు 1,530 మి.మీ. వీల్‌బేస్ 2,520 మి.మీ.గా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్, పెట్రోల్ మోడల్ బూట్ స్పేస్ వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. సీఎన్‌జీ మోడల్‌లో సిలిండర్ కారణంగా సామాను పెట్టుకునే స్థలం తక్కువగా ఉంటుంది.

మార్కెట్లో ఈ కారు Maruti Suzuki Baleno (రూ.5.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు), Hyundai i20 and i20 N Line (రూ.6 లక్షల నుంచి రూ.11.64 లక్షల వరకు), Tata Altroz (రూ.6 లక్షల నుంచి రూ.10.90 లక్షల వరకు) వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

గమనిక: అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget