అన్వేషించండి

2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!

2026 టయోటా గ్లాంజాలో 4 మంచి అంశాలు, 3 లోపాలు ఏమిటి? మైలేజీ, CNG AMT, ADAS ఫీచర్లు, బాలెనోతో ధరల తేడా, ఇంజిన్ పనితీరుపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

2026 Toyota Glanza facelift: టయోటా కంపెనీ, 2026 గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసి మార్కెట్‌లో ఆసక్తిని పెంచింది. కొత్త ఇంజిన్, మెరుగైన మైలేజీ, ఆధునిక భద్రత సదుపాయాలు ఈ కారులో ప్రత్యేక ఆకర్షణలు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం నిరాశ తప్పదు. ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నాలుగు ప్లస్ పాయింట్లు, మూడు మైనస్ పాయింట్లు ఇవే.

మంచి అంశాలు.. 4 ప్లస్ పాయింట్లు

1. మెరుగైన మైలేజీ

కొత్త గ్లాంజాలో ప్రధాన ఆకర్షణ ఇంధన సామర్థ్యం. ఇందులో 1.2 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది పెట్రోల్‌తో పాటు CNGతోనూ పనిచేస్తుంది. పాత నాలుగు సిలిండర్ల ఇంజిన్‌తో పోలిస్తే కొత్త ఇంజిన్ మైలేజీ మెరుగుపడింది.

పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 23.80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పాత మోడల్‌లో ఇది 22.35 కిలోమీటర్లుగా ఉండేది. AMT వేరియంట్ మైలేజీ లీటరుకు 24.77 కిలోమీటర్లకు చేరింది. పాత మోడల్‌లో ఇది 22.94 కిలోమీటర్లు.

CNG మాన్యువల్ వేరియంట్ కిలోగ్రాముకు 33.61 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సంస్థ చెబుతోంది. పాత మోడల్‌లో ఇది 30.61 కిలోమీటర్లు. CNG AMT వేరియంట్‌లో మైలేజీ కిలోగ్రాముకు 34.47 కిలోమీటర్లుగా ప్రకటించింది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి ఈ మెరుగుదల ఉపయోగకరంగా ఉంటుంది.

2. CNGతో ఆటోమేటిక్ గేర్‌బాక్స్

గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో మరో ముఖ్యమైన మార్పు CNGతో AMT ఎంపిక. సాధారణంగా రద్దీ రోడ్లపై తరచూ గేర్లు మార్చడం ఇబ్బందిగా ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ సమస్య కొంత తగ్గుతుంది. ముఖ్యంగా నగరాల్లో రోజూ ఆఫీసులకు వెళ్లేవారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. అదే సమయంలో మంచి మైలేజీ కూడా లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!

3. కొత్త సౌకర్యాలు, భద్రతా ఫీచర్లు

వేసవి వేడి ఎక్కువగా ఉండే మన దేశంలో ముందు సీట్లకు వెంటిలేషన్ ఇవ్వడం మంచి నిర్ణయం. దీనివల్ల ప్రయాణంలో సీట్లపై వేడి ప్రభావం తగ్గుతుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో పాటు దానికి ప్రత్యేక కూలింగ్ వెంట్‌ కూడా ఇచ్చారు.

కొత్త గ్లాంజాలో లెవల్-2 ADAS భద్రత వ్యవస్థను అందించారు. ఇది డ్రైవర్‌కు కొన్ని పరిస్థితుల్లో సహాయపడే ఆధునిక సాంకేతిక వ్యవస్థ. అయితే దీని పనితీరును పూర్తిగా అంచనా వేయడానికి కొత్త మోడల్‌ను నేరుగా పరీక్షించాల్సి ఉంటుంది. మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో ఇదే తరహా వ్యవస్థను పరీక్షించిన అనుభవం ప్రకారం, ఈ ఫీచర్లు సరిగానే పనిచేసినట్లు ఎక్స్‌పర్ట్‌లు రిపోర్ట్‌ చేశారు.

4. ఫిజికల్‌ బటన్లు కొనసాగింపు

కొత్త కార్లలో చాలా స్విచ్‌లను టచ్‌స్క్రీన్‌లోనే అందిస్తున్నారు. అయితే గ్లాంజాలో ఏసీ, ఆడియో వంటి తరచూ అవసరమైన పనులకు ఫిజికల్‌ బటన్లు కొనసాగాయి. ప్రయాణ సమయంలో స్క్రీన్‌లోని మెనూలను వెతకడం కంటే బటన్లను ఉపయోగించడం సులభం. డ్రైవర్ దృష్టి రహదారిపై ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

నిరాశ కలిగించే అంశాలు.. 3 మైనస్ పాయింట్లు

1. మారుతి బలెనో కంటే ధర ఎక్కువ

గ్లాంజాకు ప్రధాన ప్రత్యర్థి మారుతి సుజుకి బలెనో. ఈ రెండు కార్ల మధ్య సాంకేతిక సంబంధం కూడా ఉంది. అయితే సమానమైన వేరియంట్ల ధరలను పోలిస్తే టయోటా గ్లాంజా ఖరీదైనదిగా కనిపిస్తోంది.

పెట్రోల్ వేరియంట్లలో ధరల తేడా సుమారు రూ.71,000 నుంచి రూ.లక్ష వరకు ఉంది. CNG వేరియంట్లలోనూ ఈ వ్యత్యాసం సుమారు రూ.76,000 నుంచి రూ.99,000 వరకు ఉంటుంది. రెండు కార్లలో మార్పులు ప్రధానంగా రూపం, ఫీచర్లకు సంబంధించినవే కావడంతో ఈ ధరల వ్యత్యాసాన్ని కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకోవాలి.

2. ఇంజిన్ శక్తి తగ్గింది

కొత్త మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 83 హెచ్‌పీ శక్తిని, 112 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. పాత ఇంజిన్‌తో పోలిస్తే శక్తి 7 హెచ్‌పీ, టార్క్ 1 ఎన్ఎం తగ్గాయి.

CNG మోడ్‌లో 70 హెచ్‌పీ శక్తి, 102 ఎన్ఎం టార్క్ లభిస్తాయి. పాత ఇంజిన్‌తో పోలిస్తే శక్తి 7 హెచ్‌పీ తగ్గినా, టార్క్ 4.5 ఎన్ఎం పెరిగింది. బలెనోలో ఇదే తరహా ఇంజిన్‌తో ఉంది. బలెనో పాత K-Series ఇంజిన్‌తో పోలిస్తే, కొత్త ఇంజిన్ వేగంగా స్పందించే విషయంలో, అధిక వేగం వద్ద పెర్ఫార్మెన్స్‌లో కొంత వెనుకబడినట్లు ఎక్స్‌పర్ట్‌ల రివ్యూలో తేలింది.

ఇది కూడా చదవండి: పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌

3. సన్‌రూఫ్, వెనుక ఆర్మ్‌రెస్ట్ లేవు

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కొన్ని అదనపు సౌకర్యాలు కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. కానీ గ్లాంజాలో వెనుక సీట్ల మధ్య ఆర్మ్‌రెస్ట్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు లేవు. టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ i20 వంటి ప్రత్యర్థి కార్లలో ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వెనుక సీట్లలో ప్రయాణించేవారికి ఆర్మ్‌రెస్ట్ సౌకర్యాన్ని పెంచుతుంది. సన్‌రూఫ్ కూడా కొందరు కొనుగోలుదారుల ఎంపికపై ప్రభావం చూపవచ్చు.

మొత్తంగా చూస్తే.. 2026 టయోటా గ్లాంజా మెరుగైన మైలేజీ, CNG AMT ఎంపిక, అదనపు భద్రత ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అయితే బలెనోతో పోలిస్తే అధిక ధర, ఇంజిన్ శక్తి తగ్గడం, కొన్ని సౌకర్యాలు లేకపోవడం గమనించాల్సిన అంశాలు. మైలేజీ, డ్రైవింగ్ సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ కారును పరిశీలించవచ్చు. అయితే కొనుగోలు చేసే ముందు, దీనికి సమానమైన బాలెనో వేరియంట్ ధర, ఫీచర్లను పోల్చి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!
Tata Nexon నుంచి Hyundai Creta వరకు.. పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న 10 కార్లు, మీ బడ్జెట్‌లోనే కొనొచ్చు!
రూ.10 లక్షలలోపే పానోరమిక్‌ సన్‌రూఫ్ కారు.. గాలిలో తేలుతూ వెళ్లే అనుభూతిని ఎంజాయ్‌ చేయండి!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Embed widget