భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడుతున్న తరుణంలో తిలక్ వర్మ (43) వెనుదిరగడమే మ్యాచ్లో అసలైన టర్నింగ్ పాయింట్ అని కెప్టెన్ సంజు శాంసన్ పేర్కొన్నాడు. నితీష్ రెడ్డితో కలిసి అతడు జోరుమీదున్న సమయంలో వచ్చిన ఆ వికెట్ మ్యాచ్ను పూర్తిగా వెనక్కి నెట్టిందని, అక్కడే భారత్ విజయవకాశాలు చేజారాయని స్పష్టం చేశాడు.