వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన నాల్గో టీ20 మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కరేబియన్ జట్టు 2-2తో సమం చేసింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అజేయ సెంచరీతో చెలరేగగా, భారత జట్టు లక్ష్య ఛేదనలో తలవంచాల్సి వచ్చింది.