అన్వేషించండి

Car Maintenance: కారులో AC వాడుతూ ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ ఖర్చులు మరింత పెరుగుతాయి జాగ్రత్త

Car AC Maintenance | మీరు కారు ఏసీని సరిగ్గా ఉపయోగిస్తే ఖర్చు తగ్గుతుంది. లేకపోతే మీ కారు ఎక్కువ పెట్రోల్ తాగుతుంది. మరోవైపు ఇంజిన్, కంప్రెషర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

Summer Car Care | వేసవి కాలంలో కారులో కూర్చోగానే ఏసీ ఆన్ చేయడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. కానీ చాలా మంది సరైన పద్ధతిలో AC ఉపయోగించరు. దీనివల్ల కారుకు పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుంది. కారు పనితీరుపై కూడా ఇది ప్రభావం పడుతుంది. మీరు కొన్ని సాధారణ విషయాలను గుర్తుంచుకుంటే, మీ కారు త్వరగా చల్లగా అవడంతో పాటు మీ పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది.

కారును ముందుగా చల్లబరచాలి ?

ఒకవేళ మీ కారు ఎండలో పార్క్ చేసి ఉంటే, లోపల విపరీతమైన వేడి ఉంటుంది. అలాంటప్పుడు కారు స్టార్ట్ చేయగానే ఏసీని వేగంగా (high speed ) పెట్టి నడపడం సరైన పద్ధతి కాదు. ముందుగా మీరు కారు కిటికీలను తెరిచి, బ్లోవర్‌ను కొంత సమయం పాటు వేగంగా నడపాలి. దీనివల్ల లోపల ఉన్న వేడి గాలి త్వరగా బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీరు ఏసీ ఆన్ చేస్తే కూలింగ్ త్వరగా అవుతుంది. ఈ పద్ధతి ద్వారా ఏసీపై ఎక్కువ ప్రెజర్ పడదు. దాంతో మీ ఇంధనం పెట్రోల్ కూడా ఆదా అవుతుంది.

సరైన ఏసీ సెట్టింగ్ ద్వారా పెట్రోల్ ఆదా

ఏసీ ఉష్ణోగ్రతను (AC Temperature) ఎంత తక్కువగా ఉంచితే, అంత త్వరగా కారులో కూల్ అవుతుంది. మీ ఖర్చు తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు.. అయితే అందులో నిజం లేదు. మీరు చాలా తక్కువ ఉష్ణోగ్రతను సెట్ చేస్తే, ఏసీ కంప్రెసర్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీనివల్ల పెట్రోల్ సాధారణం కంటే ఎక్కువగా ఖర్చవుతుంది. సరైన పద్ధతి ఏంటంటే, ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచితే కారు త్వరగా కూల్ అవుతుంది. దాంతో కార్ ఇంజన్‌పై ఎక్కువ ఒత్తిడి కూడా పడదు.

రీ-సర్క్యులేషన్ మోడ్ ఎలా వాడాలి.. 

రీ-సర్క్యులేషన్ మోడ్ కారులో వచ్చే వాటిలో చాలా ఉపయోగకరమైన ఫీచర్. కానీ డ్రైవర్లు, వాహనదారులు దీనిని నిర్లక్ష్యం చేస్తారు. మీరు ఈ మోడ్‌ను ఆన్ చేసినప్పుడు, కారు లోపల ఉన్న చల్లటి గాలి మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటుంది. బయట ఉన్న వేడి గాలి కారు లోపలికి రాదు. దీనివల్ల ఏసీ తక్కువ ప్రెజర్, శ్రమతో పనిచేస్తుంది. కారు త్వరగా కూల్ అవుతుంది. ఈ పద్ధతి కారు మైలేజీని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

మీ ఖర్చును పెంచే చిన్న చిన్న తప్పులు

చాలా సార్లు ప్రజలు ఏసీ ఆన్ చేసిన తరువాత కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచడం లేదా డోర్స్ సరిగ్గా వేయకపోవడం చేస్తుంటారు. దీనివల్ల చల్లటి గాలి వెంటనే బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. ఏసీ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది.  ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే కూడా కూలింగ్ తగ్గిపోతుంది. మీరు ఏసీని ఎక్కువసేపు రన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీ పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడూ మీరు ఎయిర్ ఫిల్టర్‌ను చెక్ చేసి శుభ్రం చేయడం చాలా అవసరం. లేకపోతే కూలింగ్ కావడం ఏసీ టెంపరేచర్ తగ్గించడంతో పాటు ఎక్కువ సేపు రన్ చేస్తారు. ఇది ఎక్కువ పెట్రోల్ వినియోగానికి కారణం అవుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!
Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget