అన్వేషించండి

Iran nuclear facility: ఇరాన్‌కు అణుముప్పు - న్యూక్లియర్ కేంద్రం ధ్వంసం - పెరుగుతున్న రేడియేషన్ ముప్పు

Iran War: ఇరాన్ అణ్వాయుధాలు పరీక్షిస్తున్నకేంద్రాలపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు జరిపాయి. అత్యంత కీలకమైన నతాంజ్ అణు కేంద్రం నుంచి లీక్ ప్రారంభం కావడం కలకలం రేపుతంది.

Attack on Iran nuclear facility: ఇరాన్‌లోని అత్యంత కీలకమైన నతాంజ్ (Natanz) అణు కేంద్రంపై అమెరికా , ఇజ్రాయెల్ దళాలు మెరుపు దాడులు నిర్వహించాయి. కొన్నాళ్లుగా అంతర్జాతీయ ఒప్పందాలను పక్కనపెట్టి ఇరాన్ వేగంగా న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేస్తోందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.  ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో జరిగిన ఈ దాడుల్లో నతాంజ్‌లోని యురేనియం శుద్ధి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడి వల్ల అణు కేంద్రంలోని రియాక్టర్లలో సాంకేతిక లోపాలు తలెత్తి, భారీ స్థాయిలో రేడియేషన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక నివేదికలు అందుతున్నాయి.                   

ఇరాన్ లో ప్రధాన నగరాలకు పొంచి ఉన్న రేడియేషన్ ముప్పు                       

అణు కేంద్రం నుండి వెలువడుతున్న రేడియేషన్ చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇదే పరిస్థితి మరికొన్ని గంటల పాటు కొనసాగితే ఇరాన్‌లోని పలు ప్రధాన నగరాలను ఖాళీ చేయించక తప్పదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ  హెచ్చరించింది. అణు ధూళి గాలిలో కలిసి పౌరుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే అవకాశం ఉందని, గాలి దిశను బట్టి రేడియేషన్ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నతాంజ్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.        

పెద్ద ఎత్తున అణు ప్రయోగాలు చేస్తున్న ఇరాన్ -అమెరికా కోపం అందుకే !                          

గత కొంతకాలంగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను రహస్యంగా ముమ్మరం చేసింది. ముఖ్యంగా 60 శాతం పైగా స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేస్తూ అణుబాంబు తయారీకి సిద్ధమవుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఐఏఈఏ నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ సొరంగాల్లో సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసి ఆయుధ తయారీలో బిజీగా ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం ద్వారా మధ్య ప్రాచ్యంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని ఇజ్రాయెల్ ఈ దాడుల్లో క్రియాశీలకంగా పాల్గొంది.                                  

IAEA దృష్టికి తీసుకెళ్లిన ఇరాన్                      

ఈ పరిణామాలతో పశ్చిమ ఆసియాలో బాంబుల మోతలు మోగిపోతున్నాయి. తమ అణు కేంద్రంపై జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం తమ దేశంపైనే కాకుండా మానవాళిపై జరిగిన దాడి అని, దీనికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి,  ఇతర దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ, రేడియేషన్ లీకేజీ సమస్య ప్రపంచవ్యాప్తంగా పెను ఆందోళనకు దారితీస్తోంది.   


 

టాప్ హెడ్ లైన్స్

Japan Earthquake:జపాన్‌ను వణికించిన 7.1 భూకంపం: సునామీ హెచ్చరికతో హైఅలర్ట్!
జపాన్‌ను వణికించిన భూకంపం, 7.1 తీవ్రతతో కంపించిన భూమి, సునామీ హెచ్చరిక జారీ  
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget