అన్వేషించండి

Israel Iron Beam: ఇరాన్, హిజ్బుల్లా మిస్సైల్స్‌ను గాల్లోనే పేల్చేస్తున్న ఇజ్రాయెల్ ఐరన్ బీమ్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

Israel Iron Beam Technology: ఇజ్రాయెల్ ఇరాన్‌పై తన అత్యంత ప్రమాదకరమైన వైమానిక రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్‌ను వాడుతోంది. అది మిస్సైల్స్, రాకెట్లను ప్రయోగించదు, కానీ శత్రువులకు చుక్కలు చూపిస్తోంది.

ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభం కాగా.. ఇజ్రాయెల్ మొదటిసారిగా ఐరన్ బీమ్ (Iron Beam) అనే హై-పవర్ లేజర్ సిస్టమ్‌ను యుద్ధంలో ఉపయోగించింది. ఈ వ్యవస్థ లెబనాన్ నుండి హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను గాల్లోనే గుర్తించి, అడ్డుకుని నాశనం చేస్తోంది. అసలు ఐరన్ బీమ్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది.. ఇజ్రాయెల్ దీన్ని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించిందనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

ఐరన్ బీమ్ అంటే ఏమిటి?

ఐరన్ బీమ్ అనేది ఇజ్రాయెల్ మోడ్రన్ ఎయిర్ డిఫెస్ట్ సిస్టమ్. ఇది హై ఎనర్జీ లేజర్ వెపన్ సిస్టమ్ (HELWS) ఆధారంగా పనిచేస్తుంది. దీనిని 'రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్' సంస్థ రూపొందించింది. ఇది 100 కిలోవాట్ల క్లాస్ లేజర్ సిస్టమ్, ఇది రాకెట్లు, మోర్టార్లు, ఆర్టిలరీ షెల్స్ తో పాటు డ్రోన్ల వంటి వాటి ముప్పును గుర్తించి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే నిర్వీర్యం చేస్తుంది. ఇజ్రాయెల్ మల్టీ-లేయర్ డిఫెన్స్‌లో భాగంగా ఉన్న ఐరన్ డోమ్.. డేవిడ్ స్లింగ్, యారో సిస్టమ్స్‌తో పాటు ఇది పనిచేస్తుంది. హిబ్రూ భాషలో దీనిని ఓర్ ఈతాన్ (Or Eitan) అని పిలుస్తారు. బలమైన కాంతి అని దీని అర్థం.

ఐరన్ బీమ్ బ్యాటరీలో ఎయిర్ డిఫెన్స్ రాడార్, లేజర్ జనరేటర్, కమాండ్ వెహికల్ ఉంటాయి. ఇది ఒంటరిగా లేదా ఇతర రక్షణ వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో మందుగుండు సామగ్రి పరిమితి ఉండదు. ఎందుకంటే ఇది విద్యుత్తుతో నడుస్తుంది. దీనికి ఎటువంటి మిసైల్స్ అవసరం లేదు. కేవలం ఒక లేజర్ బీమ్ బయటకు వచ్చి శత్రువులు ప్రయోగించే మిస్సైల్స్, డ్రోన్లను గాల్లోనే నాశనం చేస్తుంది. 

ఐరన్ బీమ్ ఎలా పని చేస్తుంది?

ఐరన్ బీమ్ ఫైబర్ లేజర్ టెక్నాలజీపై పనిచేస్తుంది. సులభమైన భాషలో చెప్పాలంటే మొదట గుర్తిస్తుంది, తరువాత శత్రువులు ప్రయోగించిన వాటిపై దాడి చేసి, నిర్వీర్యం చేసేస్తుంది.

  • గుర్తించడం: రాకెట్ లేదా డ్రోన్ వంటి ముప్పు రాగానే రాడార్ వ్యవస్థ దానిని సరైన సమయంలో గుర్తిస్తుంది. ట్రాకింగ్ ఐటమ్స్ సహాయంతో దానిని వెంబడిస్తుంది.

  • దాడి: శత్రువుల టార్గెట్‌ను కొట్టడానికి లేజర్ బీమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది కాంతి వేగంతో (సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు) లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇది వందలాది చిన్న చిన్న బీమ్‌లను (కాయిన్ సైజులో) ఒకే చోట కేంద్రీకరిస్తుంది. ఇది టార్గెట్ మీద విపరీతమైన వేడిని పుట్టిస్తుంది.

  • విధ్వంసం: ఐరన్ బీమ్ ఎంత వేడిని ఉత్పత్తి చేస్తుందంటే.. టార్గెట్ వెలుపలి భాగం కరిగిపోతుంది లేదా పేలిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం కేవలం సెకన్లలో జరిగిపోతుంది. ఒకవేళ ఒక బీమ్ లక్ష్యాన్ని తాకితే, మిగిలిన బీమ్‌లు కూడా అదే చోటికి మళ్లుతాయి.

  • ప్రయోజనం: ప్రతి షాట్‌కు అయ్యే ఖర్చు కేవలం 2-10 డాలర్లు (విద్యుత్ ఖర్చు) మాత్రమే. అదే ఐరన్ డోమ్ వంటి మిసైల్స్ వాడితే ఒక్కో దానికి వేల డాలర్లు ఖర్చవుతాయి. దీనివల్ల పక్కన ఉన్న ఆస్తులకు నష్టం చాలా తక్కువ. దీని పరిధి సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉంటుందని సమాచారం.

ఈ వ్యవస్థ అడాప్టివ్ ఆప్టిక్స్, కోహెరెంట్ బీమ్ కాంబినేషన్ వంటి టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది వాతావరణం లేదా ధూళి వంటి పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది. అయితే వర్షం లేదా మేఘాలు ఏర్పడితే మాత్రం దీని పనితీరు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

'రోరింగ్ లయన్'లో మొదటిసారి వినియోగం

ఐరన్ బీమ్ ఆలోచన 2014లో వచ్చింది. 10 ఏళ్ల పరిశోధనల తర్వాత సెప్టెంబర్ 2025లో దీనిని ఆపరేషనల్ అని ప్రకటించారు. డిసెంబర్ 2025లో మొదటి కాంబాట్-రెడీ సిస్టమ్‌ను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్‌కు సమకూర్చారు. రాఫెల్, ఎల్బిట్ సిస్టమ్స్ కలిసి దీనిని తయారు చేశాయి. ఇజ్రాయెల్ దీని కోసం 500 మిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. టెస్టుల్లో ఇది రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లపై విజయవంతంగా పనిచేస్తుందని గుర్తించారు. ప్రపంచంలోనే ఇది మొదటి పూర్తి స్థాయి హై-పవర్ లేజర్ సిస్టమ్.

2026 ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఐరన్ బీమ్ మొదటిసారిగా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. మార్చి 2న హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను ఐరన్ బీమ్ గాలిలోనే నాశనం చేసిందని ఐడిఎఫ్ (IDF) వెల్లడించింది. ఇది ఆపరేషన్ రోరింగ్ లయన్ లో భాగంగా జరుగుతోంది. లేజర్ బీమ్ తగలగానే రాకెట్లు పేలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐరన్ బీమ్ వల్ల ప్రయోజనాలు, సవాళ్లు ఏమిటి?

  • ఐరన్ బీమ్ ప్రయోజనాలు: ఇది చాలా చౌక మాత్రమే కాదు. చాలా వేగంగా పనిచేస్తుంది. అపరిమితమైన షాట్‌లను ప్రయోగించగలదు. డ్రోన్ వార్‌ఫేర్‌లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. డ్రోన్లు చౌక కాగా, వాటిని మిసైల్స్‌తో అడ్డుకోవడం ఖరీదుతో కూడుకుంటుంది.

  • సవాళ్లు: ప్రస్తుతం దీని రేంజ్ 10 కిలోమీటర్లకే పరిమితం. బిగ్ టార్గెట్స్ పై తక్కువ ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు వాతావరణంపై ఆధారపడి పనిచేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ దీనిని నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget