అన్వేషించండి

Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే

Iran US War Latest News | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 13 రోజుల దాడుల తర్వాత ఇరాన్‌పై యూఎస్ ఆర్మీ కొత్త దాడులను నిలిపివేశారు. ఈసారి మాత్రం పెద్ద కారణం ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ట్రంప్ ఇరాన్‌పై దాడులు నిలిపివేసి, దౌత్యానికి అవకాశమిచ్చారు.
  • క్షిపణి నిల్వల ఆందోళన, యుద్ధ తీవ్రత కారణాలని నివేదికలు.
  • అవసరమైతే సైనిక చర్యలు పునఃప్రారంభిస్తామని అమెరికా స్పష్టం.

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా సైన్యం వరుస దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టిస్తున్నాయి. వరుసగా 13 రోజుల పాటు జరిగిన అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌పై కొత్త సైనిక దాడులను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు, వాటిలో దౌత్యపరమైన ప్రయత్నాలకు అవకాశం ఇవ్వడం, అమెరికా మిస్సైల్ రక్షణ నిల్వలు తగ్గిపోవడంపై ట్రంప్ ఆందోళన, యుద్ధం  మరింత పెరిగే ప్రమాదం ఉన్నాయని అమెరికాలోని పలు మీడియా సంస్థల నివేదించాయి.

ట్రంప్ తాజా నిర్ణయం ప్రకారం, సుమారు రెండు వారాలుగా జరుగుతున్న రోజువారీ అమెరికా దాడులకు మొదటిసారిగా బ్రేక్ లభించింది. అమెరికా సైన్యానికి కొత్త అటాక్ ప్లాన్స్ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఎటువంటి కొత్త దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించినట్లు ఎక్సియోస్ నివేదిక పేర్కొంది. ట్రంప్ నిర్ణయాన్ని చర్చలు, దౌత్యపరమైన పరిష్కారం దిశగా వేసిన ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.   

సైనిక చర్యను తిరిగి ప్రారంభించవచ్చు - అమెరికా

అవసరమైతే సైనిక చర్యను తిరిగి ప్రారంభించవచ్చని అమెరికా స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై వైట్‌హౌస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెయుంగ్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎల్లప్పుడూ దౌత్యపరమైన పరిష్కారాలకు మద్దతు ఇస్తారని తెలిపారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం కార్యకలాపాలను పెంచినా లేదా అమెరికా మిత్రదేశాలపై చర్యలు తీసుకున్నా, సరికొత్త దాడులకు ప్లాన్స్ అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు.

Also Read: Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే

పెద్ద యుద్ధం చెలరేగవచ్చు - డొనాల్డ్ ట్రంప్

నివేదిక ప్రకారం,  ప్రస్తుత స్థాయి సైనిక చర్య, అని ఇలాగే దాడులు కొనసాగితే తీవ్రత మరో స్థాయికి చేరుకుంటుందని ట్రంప్ భావిస్తున్నారు. దాడులలో ముందుకు వెళితే పెద్ద యుద్ధం చెలరేగవచ్చు అని, చర్చలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ట్రంప్ కోరుకుంటున్నారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి, కానీ చర్చలు విఫలమైతే సాధ్యమైనంత త్వరగా సైనిక చర్యను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని కూడా కొనసాగించాలని ఆయన కోరుకున్నారు. ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడం మరింత సులువైన మార్గం అనిపిస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, కాలక్రమేణా ఇరాన్ కూడా చర్చల పట్ల మరింత తీవ్రంగా ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

పటిష్ట అమెరికా రక్షణ వ్యవస్థ

ఈ నిర్ణయం వెనుక అమెరికా రక్షణ వ్యవస్థలో పెరుగుతున్న ఆందోళన కూడా కారణమని చెబుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, సీనియర్ సైనిక అధికారులు అధ్యక్షుడ్ని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌ను మరింత పెంచితే అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్యాట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థలు త్వనగా ఉపయోగించాల్సి వస్తుందని నివేదిక పేర్కొంది. ఇరాన్‌తో సంఘర్షణ దీర్ఘకాలం కొనసాగితే మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా సైనికులు, సైనిక స్థావరాలు, మిత్రదేశాల భద్రత ప్రభావితం కావచ్చు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ ట్రంప్‌తో ఈ విషయంపై చర్చించారు. అమెరికా సైన్యం పెద్ద దాడులు చేసేందుకు వెనుకాడదు. కానీ ఇది క్షిపణి రక్షణ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రంప్ గుర్తించారు. ఇటీవల కాలంలో అమెరికా ఇప్పటికే 1,200 కంటే ఎక్కువ ప్యాట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. దీనివల్ల రక్షణ నిల్వలపై ఒత్తిడి పెరిగింది. ఆ కారణంతోనే దాడులకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Frequently Asked Questions

ఇరాన్‌పై కొత్త సైనిక దాడులను ట్రంప్ ఎందుకు నిలిపివేశారు?

దౌత్యపరమైన ప్రయత్నాలకు అవకాశం ఇవ్వడం, మిస్సైల్ రక్షణ నిల్వలు తగ్గిపోవడంపై ఆందోళన, యుద్ధం మరింత పెరిగే ప్రమాదం వంటి కారణాలతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దాడులను నిలిపివేయడానికి ముందు అమెరికా ఎన్ని రోజులు ఇరాన్‌పై దాడులు చేసింది?

అమెరికా వరుసగా 13 రోజుల పాటు ఇరాన్‌పై దాడులు చేసింది. ఆ తర్వాత అధ్యక్షుడు ట్రంప్ కొత్త సైనిక దాడులను నిలిపివేయాలని నిర్ణయించారు.

అమెరికా సైనిక చర్యను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందా?

అవసరమైతే సైనిక చర్యను తిరిగి ప్రారంభించవచ్చని అమెరికా స్పష్టం చేసింది. చర్చలు విఫలమైతే, సాధ్యమైనంత త్వరగా సైనిక చర్యను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని అమెరికా పరిగణనలోకి తీసుకుంటుంది.

అమెరికా రక్షణ వ్యవస్థల గురించి ఏ ఆందోళనలు వెల్లడయ్యాయి?

సీనియర్ సైనిక అధికారులు తమ క్షిపణి రక్షణ వ్యవస్థలపై (ప్యాట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు వంటివి) తీవ్ర ఒత్తిడి పడుతుందని, నిల్వలు తగ్గిపోతున్నాయని హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget