అన్వేషించండి

West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!

West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో చారిత్రక మలుపు చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో పీఠంవైపు దూసుకెళ్తోంది. మమత కంచుకోటకు బీటలు వారాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం, టీఎంసీకి భారీ షాక్.
  • మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికే దిశగా ట్రెండ్స్.
  • సువేందు, అగ్నిమిత్ర, రూపా పేర్లు సీఎం రేసులో ఉన్నాయి.
  • అభివృద్ధి, ఉద్యోగాలపై బీజేపీ ప్రచారం సక్సెస్ అయింది.

West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పెను మార్పునకు రంగం సిద్ధమైంది. దశాబ్ద కాలానికిపైగా రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీని ప్రజలు ఇంటికి పంపించారు. భారతీయ జనతాపార్టీ తొలిసారిగా బెంగాల్ గడ్డపై తన జెండాను ఎగురవేయడానికి సిద్ధమైంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బెంగాల్‌ ఓటర్లు మార్పు కోరుకుంటూ కాషాయ దళానికి బ్రహ్మరథం పట్టారు. 

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 293 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. లేటెస్ట్ లెక్కల ప్రకారం బీజేపీ దాదాపు రెండు వందల సీట్లు గెలుచుకోవడానికి పరుగులు పెడుతుంటే, టీఎంసీ వంద సీట్లు కూడా రాబట్టుకోలేకపోతోంది. 

ఈ లెక్కలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభాన్ని సూచిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారానికి దూరం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ప్రాబల్యాన్ని చాటి చెప్పడమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీకి మరింత శక్తిని ఇవ్వబోతోంది. 

ముఖ్యమంత్రి రేసులో సువేందుకు పోటీగా పాల్ 

బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బెంగాల్ తదుపరి సీఎం ఎవరు అనే అంశంపైకి మళ్లింది. ముఖ్యంగా ఇద్దరు మహిళా నేతల పేర్లు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అగ్నిమిత్ర పాల్‌ అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిరసనల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన నేతగా ఆమె ముందు ఉంటున్నారు. అందుకే అదిష్టానం ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. 

Also Read: మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు

మాజీ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నటి రూపా గంగూలీ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సోనార్‌పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ఓటర్లలో ఆమెకు విపరీతమైన ఆదరణ ఉంది. దశాబ్ద కాలంగా బీజేపీలో ఉంటూ, పార్టీ మహిళా విభాగంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు పాలనాపరమైన అనుభవం కూడా తోడవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

సువేందు అధికారి కూడా సీఎం రేసులో ఉన్నారు. మమతకు కుడి భుజంగా ఉంటూ వచ్చిన ఆయన గత ఎన్నికల ముందు టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి మమతి నిజమైన ప్రత్యర్థిగా మారారు. ఆమె వైఖరిని ఎండగడుతూ బీజేపీని రూట్ లెవల్‌కు తీసుకెళ్లడంతో విజయవంతం అయ్యారు. నేటి విజయంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకే ఆయన పేరును కూడా సీఎం సీటు కోసం బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. 

Also Read: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!

ఏప్రిల్‌ నెలలో రెండు దశల్లో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన లెక్కింపు ఇప్పుడు జరుగుతోంది. ఇందులో బీజేపీ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి బీజేపీకి వరంగా మారింది. కేంద్ర నాయకత్వ నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు బీజేపీ పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహించడం కలిసి వచ్చింది. బెంగాల్ ప్రజలు ఒక కొతత్ మార్పును, సుస్థిర పాలనను ఆశించడం ఈ తీర్పునకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 

బెంగాల్‌లో బీజేపీ మతపరమైన సమీకరణాలతోపాటు అభివృద్ధి మంత్రాన్ని కూడా బలంగా తీసుకెళ్తింది. ఉద్యోగ అవకాశాలు, శాంతి భద్రతల అంశాలపై ప్రజలను ఆకర్షించడంలో ఆ పార్టీ సఫలమైంది. టీఎంసీ అంతర్గత కుమ్ములాటలు కూడా ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశాయి. 

Also Read: బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే

పశ్చిమ బెంగాల్‌ దశాబ్దాల తరబడి వామపక్షాల కోటగా ఉండేది. 2011లో మమతా బెనర్జీ  కోటను బద్దలు కొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి టీఎంసీ బలంగా ఎదిగింది. అయితే 2019లో లోక్‌ సభ ఎన్నికల నుంచి బీజేపీ రాష్ట్రంలో క్రమంగా పుంజుకోవడం ప్రారంభించింది. 2021లో విఫలమైనప్పటికీ, 2026లో మాత్రం బీజేపీ గురి తప్పలేదు. 

Frequently Asked Questions

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?

తాజా ట్రెండ్స్ ప్రకారం, భారతీయ జనతాపార్టీ (బీజేపీ) పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. బీజేపీ దాదాపు 200 సీట్లు గెలుచుకునే దిశగా పయనిస్తోంది.

పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండవచ్చు?

బీజేపీ అధికారంలోకి వస్తే, అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ, మరియు సువేందు అధికారి ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసే అవకాశం ఉంది.

బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి ఓటమికి కారణాలు ఏమిటి?

దశాబ్దకాలానికిపైగా అధికారంలో ఉండటం, ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి, టీఎంసీ అంతర్గత కుమ్ములాటలు, మరియు బీజేపీ యొక్క పక్కా ప్రణాళికతో కూడిన ప్రచారం టీఎంసీ ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యమైనవి?

ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. దశాబ్దకాలంగా ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మమతా బెనర్జీని ప్రజలు ఇంటికి పంపించి, బీజేపీకి అధికారం కట్టబెట్టడం రాష్ట్ర చరిత్రలో ఒక పెను మార్పు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget