అన్వేషించండి

Kerala Assembly Election Results: కేరళలో ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ కూటమి - లెఫ్ట్ ఓటమికి 5 ప్రధాన కారణాలు

Kerala: దశాబ్ద కాలంగా సాగిన ఎల్‌డీఎఫ్ పాలనకు స్వస్తి పలుకుతూ, కేరళ ఓటర్లు మళ్లీ యూడీఎఫ్ వైపు మొగ్గు చూపారు. మూడో సారి గెలుస్తుందనుకున్న ఎల్డీఎఫ్ ఓటమికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.

Kerala Assembly Election Results Congress defeat Left alliance:  కేరళ రాజకీయ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. దశాబ్ద కాలంగా సాగిన ఎల్‌డీఎఫ్  పాలనకు స్వస్తి పలుకుతూ, కేరళ ఓటర్లు మళ్లీ  యూడీఎఫ్  వైపు మొగ్గు చూపారు. "ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్పు" అనే కేరళ సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో చెరిపివేసి చరిత్ర సృష్టించిన పినరయి విజయన్, ఈసారి మాత్రం ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పలేదు.  

 పినరయి విజయన్  వ్యక్తిగత వైఖరి పై వ్యతిరేకత 

ముఖ్యమంత్రి పినరయి విజయన్ శైలి మొదటి నుంచీ నియంతృత్వ ధోరణితో సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన మాటే శాసనం కావడంపై ప్రజల్లో అసహనం పెరిగింది. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆయన కార్యాలయం చుట్టూ తిరిగిన వివాదాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి.  కెప్టెన్  అని అభిమానులు పిలుచుకునే విజయన్, ఈసారి ప్రజలకు  అందుబాటులో లేని నేత గా మారిపోవడం ఎల్‌డీఎఫ్ పతనానికి ప్రధాన కారణమైంది.

 వ్యవస్థీకృత అవినీతి , ఆర్ధిక సంక్షోభం 

కేరళ ఆర్ధిక పరిస్థితి గతేడాది కాలంగా అత్యంత దారుణంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యం, సామాజిక పెన్షన్ల నిలిపివేత సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దీనికి తోడు  కరువన్నూర్ కోపరేటివ్ బ్యాంక్  కుంభకోణం వంటి అంశాలు కమ్యూనిస్టు పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్‌ను కూడా ఆత్మరక్షణలో పడేశాయి. సామాన్యుడి సొమ్ముకు భద్రత లేదనే భావన ఓటర్లను యూడీఎఫ్ వైపు మళ్లించింది.

 యూడీఎఫ్ సమష్టి నాయకత్వం - సతీశన్ ఎఫెక్ట్ 

కాంగ్రెస్ పార్టీ గతంలోలా కాకుండా ఈసారి చాలా ఐక్యంగా పోరాడింది. ప్రతిపక్ష నేత  వీడీ సతీశన్,  కేరళ పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్ ద్వయం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా వీడీ సతీశన్ అసెంబ్లీలోనూ, బయటా ఒక గంభీరమైన ప్రత్యామ్నాయ నేతగా తనను తాను మలుచుకున్నారు. ఉమెన్ చాందీ లేని లోటును అనుభవం కలిగిన సీనియర్లు, ఉత్సాహవంతులైన యువనేతలు భర్తీ చేస్తూ సమష్టిగా వెళ్లడం యూడీఎఫ్‌కు ప్లస్ అయ్యింది.

 మైనారిటీ ఓట్ల  పోలరైజేషన్

కేరళలో గెలుపోటములను శాసించే ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు ఈసారి యూడీఎఫ్ వైపు బలంగా నిలిచింది. గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల వైపు మొగ్గు చూపిన క్రైస్తవ వర్గాలు, ఈసారి రబ్బరు ధరల పతనం ,  మతపరమైన సమీకరణాలతో మళ్లీ యూడీఎఫ్ గూటికి చేరాయి. ముస్లిం లీగ్  తన మలబార్ కోటను పటిష్టం చేసుకోవడమే కాకుండా, సెక్యులరిజం విషయంలో కాంగ్రెస్‌నే నమ్మదగిన శక్తిగా ఆయా వర్గాలు గుర్తించాయి.

 యువతలో అసహనం - నిరుద్యోగం 

కేరళలో నిరుద్యోగితా రేటు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్  నియామకాల్లో తమ అనుచరులకే ప్రాధాన్యత ఇస్తుందనే ఆరోపణలు యువతను కమ్యూనిస్టులకు దూరం చేశాయి. విద్యావంతులైన కేరళ యువత మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లాల్సి రావడంపై యూడీఎఫ్ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో పనిచేసింది.  మార్పుతోనే ఉపాధి  అనే నినాదం యువ ఓటర్లను ఆకర్షించింది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లు యూడీఎఫ్ అభ్యర్థులకు బదిలీ అయ్యాయి. ఎల్‌డీఎఫ్‌ను ఓడించాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. త్రిముఖ పోటీ జరిగిన చోట కూడా బీజేపీ ఓట్లు చీలిపోకుండా ఉండటం పరోక్షంగా కాంగ్రెస్ కూటమికి కలిసి వచ్చింది.

కేరళ ఓటర్లు ఎప్పుడూ అతిగా అధికార గర్వం ప్రదర్శించే వారిని సహించరు. పినరయి విజయన్ సర్కార్ గత విజయం ఇచ్చిన అతివిశ్వాసంతో ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆర్థిక నిర్వహణలో విఫలమవ్వడం యూడీఎఫ్‌కు మార్గం సుగమం చేశాయి. దశాబ్ద కాలం తర్వాత అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న యూడీఎఫ్ ముందు ఇప్పుడు సవాళ్లు కొండంత ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కొత్త ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget