అన్వేషించండి

Kerala Assembly Election Results 2026: కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభంజనం! వెనుకంజలో అధికార ఎల్‌డీఎఫ్‌!

Kerala Assembly Election Results 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అద్భుతమైన విజయం దిశగా దూసుకుపోతోంది. 140 స్థానాలకు గాను 80  సీట్లలో ముందంజలో ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ ఆధిక్యం, ఎల్డీఎఫ్‌కు ఎదురుదెబ్బ.
  • ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‌ హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.
  • ఆర్థిక సవాళ్లు, నిరుద్యోగం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి.
  • కొత్త ప్రభుత్వం ఆర్థిక లోటు, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి.

Kerala Assembly Election Results 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా తొలి ట్రెండ్స్ నుంచే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్‌(UDF) స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి యూడీఎఫ్‌ 83  ఎల్‌డీఎఫ్‌ 42 ఇతరులకు 13 స్థానాలు వచ్చాయి. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కూటమికి ఈ ఫలితాలు ఊరట ఇచ్చాయి. మరోవైపు వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశించిన పినరయి విజయ్‌ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి విజయన్‌ స్వయంగా ధర్మడమ్‌ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం ఎల్‌డీఎఫ్‌ పతనాన్ని స్పష్టం చేస్తోంది. 

ఈ ఎన్నికల ఫలితాలకు ప్రధానంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఒక కారణంగా కాగా, కాంగ్రెస్ కూటమి ఇచ్చిన వాగ్దానాలను ప్రజలను ఆకర్షించాయి. 2021 ఎన్నికల్లో కరోనా మహమ్మారి సమయంలో అందించిన సంక్షేమ పథకాల వల్ల ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి గెలిచింది. అయితే 2026 నాటికి ఆర్థిక సవాళ్లు, నిరుద్యోగిత, ఇతర పాలనాపరమైన అంశాలు ప్రజల్లో అసంతృప్తి పెంచాయి. ముఖ్యంగా విద్యావంతులైన యువతలో ఉపాధి అవకాశాల కొరత పెద్ద చర్చనీయాంశమైంది. 

Also Read: కాలేజీ డ్రాపౌట్ నుంచి పొలిటికల్ కింగ్‌గా దళపతి విజయ్ ప్రస్థానం ఇదే.. ఇంతకీ ఏం చదివారంటే

కేరళలో ఏప్రిల్ 9న 140 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో దాదాపు 80 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఐదేళ్లుగా ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం నవ రేళ మిషన్ పేరిట లైఫ్‌ మిషన్, ఆర్ధ్రం మిషన్, హరిత కేరళ మిషన్ వంటి పథకాలను అమలు చేసింది. ఈ పథకాల ద్వారా వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ప్రభుత్వం పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చారు. కానీ, ఎన్నికల సమయానికి ఇవేవీ ఎల్‌డీఎఫ్‌ను గట్టెకించలేకపోయాయి. 

కేరళ అభివృద్ధి నివేదిక ప్రకారం, రాష్ట్రం విద్య, ఆరోగ్య రంగాల్లో దేశంలోన అగ్రస్థానంలో ఉంది. కేరళలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి మందికి కేవలం ఐదుగురు. ఇది అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉంది. 2026-27 బడ్దెట్‌లో ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ వృద్ధాప్య బడ్జెటింగ్‌ అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. కేరళలో వృద్ధుల జనాభా పెరుగుతున్న వేళ వారి సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం ఈ బడ్జెట్‌ ప్రత్యేకత. 

Also Read: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!

కేరళ ప్రభుత్వ ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధులలలో తగ్గుదల, రాష్ట్ర అప్పుల భారం కలవరపెడుతున్నాయి. అయినప్పటికీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డు, వంతెనలు, ప్రాజెక్టులను నిర్మించారు. నాలెడ్జె్‌ ఎకానమీ దిశగా కేరళ అడుగులు వేస్తూ, ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. 

కేరళ పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వెన్నెముక వంటిది. ముఖ్యంగా అలప్పుజలోని హౌస్‌బోట్ ప్రయాణాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. రుతుపవనాల సమయంలో కేరళ అందాలు చూడముచ్చగా ఉంటాయి. బాధ్యతాయుతమైన పర్యాటకం ద్వారా స్ఆనిక ప్రజలను ఉపాధి కల్పించడంలో కేరళ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆయమనం గ్రామం మొదటి మోడల్ ఆర్టీ విలేజ్‌గా గుర్తింపు పొందింది. 

కేరళ ఎన్నికల ఫలితాలు 2026 రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా భావించి వచ్చు. యూడీఎఫ్‌ విజయం దాదాపు ఖాయం కావడంతో కొత్త ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన పెద్ద బాధ్యత ఉంది.ఆర్థిక లోటును అధిగమించడం, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ కొత్త ప్రభుత్వానికి ప్రధాన వాళ్లుగా నిలవనున్నాయి. 

Frequently Asked Questions

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ట్రెండ్స్ ఏం చూపించాయి?

తొలి ట్రెండ్స్ నుంచే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

ఎల్‌డీఎఫ్‌ పతనానికి ప్రధాన కారణాలు ఏమిటి?

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగం, ఆర్థిక సవాళ్లు, మరియు యువతలో ఉపాధి అవకాశాల కొరత ప్రధాన కారణాలు.

గత ఐదేళ్లలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన పథకాలు ఏమిటి?

నవ కేరళ మిషన్ కింద లైఫ్ మిషన్, ఆర్ధ్రం మిషన్, హరిత కేరళ మిషన్ వంటి పథకాలను అమలు చేసింది. వీటి ద్వారా వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు నిర్మించారు.

కేరళ విద్య, ఆరోగ్య రంగాల్లో దేశంలో ఎలా ఉంది?

కేరళ విద్య, ఆరోగ్య రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది.

కేరళ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ఎంత ముఖ్యం?

కేరళ పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. బాధ్యతాయుతమైన పర్యాటకం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Embed widget