అన్వేషించండి

Tamil Nadu Election Results 2026: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!

Tamil Nadu Election Results 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్టుగానే విజయ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభంజనం సృష్టిస్తోంది.
  • ముఖ్యమంత్రి స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి వెనుకంజలో ఉన్నారు.
  • టీవీకే 100కుపైగా, అన్నాడీఎంకే 80, డీఎంకే 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
  • ఊహించని విధంగా టీవీకే, విజయ్ రాజకీయ ప్రవేశం సంచలనం సృష్టిస్తోంది.

Tamil Nadu Election Results 2026: దశాబ్దాలుగా ద్రవిడ్‌ పార్టీల కంచుకోటగా ఉన్న తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, రాష్ట్ర రాజకీయ ముఖచిత్ర పూర్తిగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి అప్పుడే అుగుపెట్టిన దళపతి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. 

ఈ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన స్ట్రాంగ్ నియోజకవర్గమైన కొలత్తూరులో వెనుకంజలో ఉన్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు అక్కడ ముఖ్యమంత్రిపై ఆధిక్యాన్ని ప్రదర్సిస్తున్నారు. కేవలం స్టాలిన్ మాత్రమే కాకుండా ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం చెపాక్ తిరువల్లికేణి నియోజకవర్గంలో వెనుకబడి ఉన్నారు. 

ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం 100కుపైగా నియోజక వర్గాల్లో    టీవీకే ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 80 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార డీఎంకే మాత్రం 50 స్థానాలకే పరిమితం అయ్యింది. 

విజయ్ టీవీకే బ్లాక్ బస్టర్ డెబ్యూ

తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఉన్న విజయ్, తన రాజకీయ పార్టీ టీవీకే స్థాపించి మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం 234 స్థానాల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేశారు. ఆయన సినిమా ఇమేజ్‌ ఓట్లుగా మారుతుందా అన్న సందేహాలు ఈ ఫలితాలకు సమాధానం చెబుతున్నాయి. 

ఆది నుంచి టీవీకే దూకుడు

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 23న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు మునుపెన్నడూ లేనివిధంగా 84.63 శాతం భారీ పోలింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్‌ నమోదు కావడం మార్పునకు సంకేతంగా విశ్లేషకులు భావించారు. ఇవాళ ఓట్ల లెక్కింపు కాగానే టీవీకే ఆధిక్యం స్పష్టమైంది. 

ప్రముఖులు వీళ్లే 

ఈ ఎన్నికల్లో అందరి దృష్టి కీలకమైన నియోజకవర్గాలపై ఉంది. కొలత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేశారు. ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. చెపాక్‌- తిరువెల్లికేణిలో ఉదయనిధి స్టాలిన్ పోటీ చేశారు. అక్కడ వెనుకంజలో ఉన్నారు. ఎడప్పాడిలో ఏఐఏడీఎంకే అధఇనేత ఎడ్పాడి పళని స్వామి పోటీ చేసి ముందంజలో ఉన్నారు. పన్నీర్ సెల్వం పోటీ చేసిన బోడినాయకనూర్‌లో విజయం దిశగా సాగుతున్నారు. 

ఊహించని సర్వే సంస్థలు 

తమిళనాడులో గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందా లేదా, విజయ్ పట్ల యువతలో ఉన్న క్రేజ్ ఈ ఫలితాలకు కారణమా అన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా ఎగ్జిట్ పోల్స్ డీఎంకే అధికారంలోకి వస్తుందని అంచనా వేసినప్పటికీ ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా మాత్రం టీవీకే 98-120 స్థానాలు సాధిస్తుందని ముందే ఊహించింది. అదే సమయంలో 37 శాతం మంది ప్రజలు విజయ్ తదుపరి సీఎంగా చూడాలనుకుంటున్నారని ఆ సర్వే వెల్లడించింది. ఒక వేళ ఇదే ట్రెండ్ కొనసాగితే, తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే- ఏఐ డీఎంకే ద్వైపాక్షిక రాజకీయాలకు విజయ్ గండికొట్టినట్టే కనిపిస్తోంది.        

Frequently Asked Questions

2026 తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఎవరు ఆశ్చర్యపరిచారు?

దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఊహించని విధంగా ప్రభంజనం సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఏ పార్టీలు ఏయే స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి?

టీవీకే 100కు పైగా నియోజకవర్గాల్లో, అన్నాడీఎంకే 80 స్థానాల్లో, అధికార డీఎంకే 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు?

రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన స్ట్రాంగ్ నియోజకవర్గమైన కొలత్తూరులో టీవీకే అభ్యర్థిపై వెనుకంజలో ఉన్నారు.

విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేసింది?

విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే స్థాపించి, మొత్తం 234 స్థానాల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget