అన్వేషించండి

SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!

SIR 2026: భారత్ ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మక SIR 2026 సర్వేను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. BLOలు ఇంటికి వస్తున్న వేళ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వారికి ఏ పత్రాలు చూపించాలి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఓటర్ల జాబితాను పారదర్శకం చేసేందుకు ఇంటింటి సర్వే జరుగుతోంది.
  • మరణించిన, వలస వెళ్ళిన ఓట్లను తొలగించి, కొత్తవారిని చేరుస్తున్నారు.
  • బీఎల్ఓలు ఇంటికి వచ్చి వివరాలు, పత్రాలు సేకరిస్తారు.
  • అవసరమైన ఫారాలు నింపి, డిజిటల్ పద్ధతులలోనూ సరిచేసుకోవచ్చు.

SIR 2026: భారత్ ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా మార్చడానికి ప్రత్యేక సమగ్ర సవరణ SIR-2026 కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇంతటి భారీ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను వెరిఫై చేస్తున్నారు. 

ఓటర్ల జాబితాలో పేరు ఉండి, మరణించిన వారు, లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, డూప్లికేట్‌ ఓట్లను ఏరివేయడం ద్వారా ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. అంతేకాకుండా 18ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను గుర్తించి వారిని జాబితాలో చేర్చడం కూడా ఇందులో భాగమే. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మీ నియోజకవర్గాల్లో బూత్‌ స్థాయి అధికారులు మీ ఇంటికి వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో 25 నుంచి ప్రారంభంకానుంది. ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా అధికారులు కనీసం రెండు మూడు సార్లు మీ ఇంటిని సందర్శించే అవకాశం ఉంది. సమయం వృథా కాకుండా ఉండాలంటే ముందుగానే సమాచారాన్ని సిద్ధం చేసుకోవడం మంచిది. 

BLO ఇంటికి వచ్చినప్పుడు ఏం అడుగుతారు?

మీ ఇంటికి వచ్చే BLO ప్రధానంగా ఓటరు కార్డు నంబర్‌, కుటుంబ సభ్యుల సంఖ్యను అడుగుతారు. కుటుంబంలో ఎవరికైనా త్వరలో 18 ఏళ్లు నిండబోతున్నాయా అన్న వివరాలు కూడా వారు సేకరిస్తారు. వివాహం వల్ల లేదా ఉద్యోగం వల్ల ఎవరైనా ఇల్లు మారారా, లేదా మరణించారా అన్న సమాచారం అడుగుతారు. గత రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని గురించి సరి చేయడానికి వారు మీకు సహకరిస్తారు. మీ పాత వివరాలు అంటే 2002-2004 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉందా అనే అంశాన్ని కూడా వారు తనిఖీ చేయవచ్చు. 

ఏయే డాక్యుమెంట్స్ అవసరం

సర్వే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఇంటిలోని అందరు ఓటర్ల ఒరిజినల్‌కార్డులు లేదా కలర్ జిరాక్స్‌ కాపీలు సిద్ధం చేసుకోవాలి. దీని కోసం బర్త్ సర్టిఫికెట్‌ పదో తరగతి మెమో, పాస్‌పోర్ట్‌ లేదా పాన్ కార్డు సమర్పించవచ్చు. కరెంట్‌ బిల్లు, వాటర్‌ బిల్లు, గ్యాస్ రశీదు లేదా బ్యాంక్‌ పాస్‌బుక్ ఉపయోగించవచ్చు. ఆదార్‌ కార్డును కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే అంగీకరిస్తారు. దానిని DOBగా లేదా అడ్రెస్‌ ప్రూఫ్‌గా తీసుకోరు. 

ఏ పామ్‌లు నింపాలి

BLO మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఎన్యుమరేషన్ఫామ్ ఇస్తారు. అందులో అడిగిన వివరాలు తప్పుల్లేకుండా ఫిల్ చేయాలి. మీకు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే ఫామ్‌-6 నింపాలి. మీ ఓటరు కార్డులో పేరు, వయసు, లేదా ఫొటో వంటి తప్పులు సరి చేయడానికి ఫామ్‌-8 నింపాలి. ఎవరైనా చనిపోయినా, డూప్లికేట్‌ ఓటును తొలగించాలన్నా ఫామ్‌-7ను సమర్పించాలి. ఈ ఫారాలను నింపేటప్పుడు కేవలం క్యాపిటల్‌ లెటర్స్‌ మాత్రమే వాడాలి. పేరు మీ టెన్త్‌క్లాస్‌ మెమో లేదా ఆధార్‌లో ఉన్న విధంగానే కచ్చితంగా ఉండేలా చూసుకోండి. 

డిజిటల్ వెసులుబాటు 

మీరు ఆఫ్‌లైన్‌లో వెయిట్ చేయకూడదనుకుంటే, నేరుగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ voter.eci.gov.inద్వారా కూడా సర్వే పూర్తి చేయవచ్చు. లేదా ECI/Voter Helpline App ద్వారా మొబైల్‌లోనే మీ వివరాలను వెరిఫై చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. 

Frequently Asked Questions

SIR-2026 కార్యక్రమం అంటే ఏమిటి?

భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చడానికి దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమమే SIR-2026. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇంటింటికీ వెళ్లి ఓటర్లను వెరిఫై చేస్తున్నారు.

ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

మరణించిన లేదా వలస వెళ్ళిన ఓటర్ల పేర్లను తొలగించడం, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడం, నకిలీ ఓట్లను తొలగించడం దీని లక్ష్యం. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను కూడా జాబితాలో చేర్చుతారు.

BLOలు ఇంటికి వచ్చినప్పుడు ఏ వివరాలు అడుగుతారు?

BLOలు ఓటరు కార్డు నంబర్, కుటుంబ సభ్యుల సంఖ్య, 18 ఏళ్లు నిండబోతున్న వారి వివరాలు, వివాహం, ఉద్యోగం లేదా మరణం వంటి మార్పుల సమాచారాన్ని అడుగుతారు. పాత రికార్డుల్లో తప్పులు సరిచేయడానికి సహాయపడతారు.

సర్వే సమయంలో ఏ పత్రాలు అవసరం?

ఇంటిలోని అందరు ఓటర్ల ఒరిజినల్ కార్డులు లేదా కలర్ జిరాక్స్ కాపీలు సిద్ధం చేసుకోవాలి. పుట్టిన తేదీ కోసం బర్త్ సర్టిఫికెట్, పాన్ కార్డ్, చిరునామా కోసం కరెంట్ బిల్లు, గ్యాస్ రశీదు వంటివి ఉపయోగించవచ్చు.

వివిధ అవసరాల కోసం ఏ ఫారమ్‌లు నింపాలి?

కొత్త ఓటు కోసం ఫామ్-6, ఓటరు కార్డులో పేరు, వయసు, లేదా ఫోటో వంటి తప్పులు సరిచేయడానికి ఫామ్-8 నింపాలి. మరణించిన వారిని లేదా నకిలీ ఓటును తొలగించడానికి ఫామ్-7 సమర్పించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget