అన్వేషించండి

Voter ID Cleanup : SIR వచ్చేసింది - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లూ.. ఇక జాగ్రత్త పడండి !

Election Commission SIR: భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన SIR మూడో దశకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ , తెలంగాణలోనూ ఈ సారి జరుగుతుంది.

Election Commission Orders Sir Phase 3:  భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఇప్పుడు మూడో దశకు చేరుకుంది. గురువారం నాడు ఈసీ వెలువరించిన తాజా ఆదేశాల ప్రకారం.. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, హర్యానాతో పాటు తెలుగు రాష్ట్రాలు  సహా మొత్తం 16 రాష్ట్రాలు , 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది బీహార్‌లో ప్రారంభమైన ఈ స్పెషల్ రివిజన్, ఇప్పుడు దేశంలోని మెజారిటీ రాష్ట్రాలకు విస్తరించింది.

 36.73 కోట్ల మంది ఓటర్ల కవరేజ్ 

ఈ మూడో దశలో దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల డేటాను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇందుకోసం సుమారు  3.94 లక్షల మంది బూత్ లెవల్ ఆఫీసర్లు  ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామాలు మారిన వారి వివరాలను సరిచేయడం, కొత్త ఓటర్లను చేర్చడం, డూప్లికేట్ ఎంట్రీలను ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్న వాటిని  తొలగించడం ఈ డ్రైవ్  ప్రధాన ఉద్దేశ్యం. రాజకీయ పార్టీలు కూడా తమ తరపున 3.42 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లను  నియమించి ఈ ప్రక్రియను పర్యవేక్షించవచ్చు.

 జనగణనతో అనుసంధానం 

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సెన్సస్  హౌస్ లిస్టింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని, ఈ  SIR  షెడ్యూల్‌ను ఈసీ ఖరారు చేసింది. రెండింటికీ ఒకే రకమైన యంత్రాంగం అందుబాటులో ఉండటం వల్ల పనులు వేగంగా పూర్తవుతాయని కమిషన్ భావిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ,  లడఖ్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, సెన్సస్ ఫేజ్-2 పనుల దృష్ట్యా, అక్కడ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఈసీ స్పష్టం చేసింది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ మే నెలాఖరు నాటికి ముమ్మరం కానుంది.     

 తొలి రెండు దశల ప్రస్థానం 

ఇప్పటికే మొదటి రెండు దశల్లో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రత్యేక ప్రక్షాళన పూర్తయింది. అక్కడ సుమారు 59 కోట్ల మంది ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. తాజా మూడో దశతో కలిపి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ లింకింగ్ వంటి అంశాలపై కూడా ఈ సమయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

 పారదర్శకతే లక్ష్యం 

ఓటర్ల జాబితాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ ప్రాధాన్యతని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొని, బూత్ స్థాయిలో సహకరించాలని ఈసీ కోరింది. 2027లో జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే లోప రహిత ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలనే పట్టుదలతో కమిషన్ ఈ భారీ కసరత్తును నిర్వహిస్తోంది.     

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget