అన్వేషించండి

Bandi Sanjay on Election Results: విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్

Assembly Election Results 2026 | ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి, స్టాలిన్‌లకు తాజా వచ్చిన ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

కరీంనగర్: విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌లకు తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ  (ఉత్తరాది, దక్షిణాది అని వ్యత్యాసం లేకుండా) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. 

బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ ఘన విజయం..
నేడు 4 రాష్ట్రాలు కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం ఫలితాలపై బండి సంజయ్ స్పందించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి లభిస్తున్న ఆదరణే ఎన్నికల ఫలితాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి భయాలు ఉండవన్నారు.  పశ్చిమ బెంగాల్ లో తొలిసారి బీజేపీ విజయం సాధిస్తుండగా.. పుదుచ్చేరిలో అధికారం సొంతం చేసుకుంది. అస్సాంలో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకుని సత్తా చాటింది.  తమిళనాడులో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

ఇలాంటి విషయాలపై రాజకీయాలు చేస్తారా.. బండి సంజయ్ ఆగ్రహం..

కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ దుకాణంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన కొందరు నేతలు, ఈ ఘటనను కూడా రాజకీయ కోణంలో చూడటం సిగ్గుచేటన్నారు. కాల్పుల ఘటన జరిగాక తాము ఇప్పటికే జ్యువెలరీ దుకాణ యాజమాన్యంతో మాట్లాడామని, బాధిత కుటుంబాలకు పూర్తి అండగా నిలవాలని కోరినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు.

Also Read: Assam Assembly Election Results: అస్సాంలో హిమంత మ్యాజిక్ - కాంగ్రెస్ భస్మాసుర నిర్ణయాలు - బీజేపీ గెలుపునకు 5 కారణాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget