RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బాగా పెర్ఫర్మ్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో వారి సొంత గడ్డపైనే వాళ్ళను చిత్తు చేసింది. పాట్ కమిన్స్ సేన మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.
ఇలాంటి జోరులో ఉన్న టైంలో SRH మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుందట. గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైన శివం మావి స్థానంలో, అండర్-19 ప్రపంచకప్ హీరో ఆర్‌ఎస్ అంబరీష్‌ను టీమ్ లోకి తీసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసున్న ఈ తమిళనాడు కుర్రాడు, 2026 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో లీడింగ్ వికెట్ టేకర్. అంబరీష్ ఎంట్రీతో SRH బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది.
ఈ సీజన్‌లో ఇప్పటికే ప్రఫుల్ హింగ్, సాకిబ్ హుస్సేన్ వంటి యంగ్ పేసర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పుడు అంబరీష్ కూడా తోడవడంతో SRH డ్రెస్సింగ్ రూమ్ సరికొత్త ఉత్సాహం నెలకొంది. రైట్ ఆర్మ్ మీడియం పేసర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో, అంబరీష్ ఒక పక్కా ఆల్‌రౌండర్ ఆప్షన్‌గా మారనున్నాడు.
ట్రెండింగ్ వార్తలు




















