అన్వేషించండి

England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక

England VS Pakistan: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పాకిస్తాన్ పై అద్భుత హాఫ్ సెంచరీతో సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును సమం చేసి, చ‌రిత్ర‌కెక్కాడు.

ENG VS PAK 1st Test, Joe Root Shatters Long Standing Red Ball Record : ఇంగ్లాండ్ లోని హెడింగ్లే వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ జో రూట్ అరుదైన ఘ‌న‌త న‌మోదు చేశాడు. క్రీజులో పాతుకుపోయి ఆడిన రూట్ 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 రన్స్ చేసి పెవిలియ‌న్ కు చేరాడు. ఈ ఇన్నింగ్స్‌తో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఇండియన్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 68 ఫిఫ్టీల రికార్డును రూట్ స‌మంగా చేసి, చ‌రిత్ర‌కెక్కాడు. వెస్టిండీస్ గ్రేట్ శివనారాయణ్ చంద్రపాల్ 66 ఫిఫ్టీలతో రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్, ఇండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ 63 ఫిఫ్టీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కెప్టెన్‌గా 42వ సారి యాభై ప్లస్ స్కోరు సాధించిన రూట్ ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ 61 స్కోర్లతో టాప్ స్థానం ద‌క్కించుకున్నాడు.

తేలిపోయిన పాక్.. ఇంగ్లాండ్ ప‌ట్టు..

గురువారం రెండో రోజు ఆట ప్రారంభంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు పక్కా ప్లాన్‌తో బ్యాటింగ్ కు దిగారు. ఓవర్ నైట్ స్కోరు 112/2తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు పాక్ స్కోరుకు 59 రన్స్ వెనుకంజ‌లో ఉంది. ఈ దశలో జో రూట్, జోర్డాన్ కాక్స్ మూడో వికెట్‌కు సెంచరీ పార్ట్‌నర్‌షిప్ అందించారు. కాక్స్ 73 రన్స్ చేసి అలీ ఉస్మాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ వెంటనే రూట్ కూడా వెనుదిరిగాడు. వీరిద్దరి నిలకడైన భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవ‌రాల్ గా గురువారం రెండో రోజు ఆట‌ముగిసే స‌రికి ఇంగ్లాండ్..82 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 366 ప‌రుగులు చేసింది. హేరీ బ్రూక్ (91) టాప్ స్కోరర్ గా నిలిచి, త్రుటిలో సెంచ‌రీ కోల్పోయాడు. ఆలీ ఉస్మాన్ కు ఐదు వికెట్లు ద‌క్కాయి. ఓవ‌రాల్ గా 195 ప‌రుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్ నిలిచింది. 

చెరో ఐదు వికెట్ల‌తో పాక్ ను కుప్ప‌కూల్చిన రాబిన్సన్, టంగ్..

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజే పాకిస్తాన్‌ను ఓ ఆట ఆడుకుంది. ఇంగ్లాండ్ పేసర్లు ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ బ్యాటింగ్ లైనప్‌ను క‌కావిక‌లం చేశారు. రాబిన్సన్ 51 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీయగా టంగ్ 46 రన్స్ ఇచ్చి 5 వికెట్లు ద‌క్కించుకున్నాడు. వీరిద్దరి ధాటికి పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే కుప్ప‌కూలింది. పాక్ బ్యాటర్లలో అబ్దుల్లా షఫీక్  61 రన్స్ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత మళ్లీ కెప్టెన్సీ చేపట్టిన రూట్ తన జట్టును భారీ లీడ్ దిశగా ముందుకు తీసుకెళుతున్నాడు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Advertisement

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget