IND VS SL 2nd Test Updates: రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భారత వశం.. డబ్ల్యూటీసీ రేసులో ముందంజ!
IND VS SL: రెండో టెస్టులో టీమిండియాకు స్పిన్ ఉచ్చు బిగించకుండా గాలే తరహాలోనే సమతుల్య పిచ్ సిద్ధం చేయాలని లంక బోర్డు ఆలోచిస్తోందని తెలుస్తోంది.

IND VS SL Colombo Test, Sri Lanka Plans Balanced Track At SSC Colombo To Level Series: ఇండియన్ బ్యాటర్ల స్పిన్ బలహీనతను టార్గెట్ చేస్తూ డస్ట్‌బౌల్ పిచ్ రెడీ చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు గాలే తరహా బ్యాలెన్స్‌డ్ ట్రాక్ సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. తొలి టెస్టులో ఇండియా 165 రన్స్ తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఐదు రోజుల పాటు పిచ్ సహజ సిద్ధమైన మార్పులతో బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు ఇచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు మితిమీరిన స్పిన్ పిచ్ తయారు చేస్తే అది లంక జట్టుకే రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డు అనుమానిస్తోంది. దినేష్ చండిమల్, కుసాల్ మెండిస్, పాథుమ్ నిస్సాంక లాంటి సీనియర్ల గైర్హాజరీలో యువ బ్యాటర్లకు అవకాశం ఇవ్వడానికి గాలే తరహా సమతుల్య పిచ్ సరైనదని లంక బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.
Thank you, Galle 👋
— BCCI (@BCCI) August 20, 2026
Hello again, Colombo! 🙌#TeamIndia | #SLvIND pic.twitter.com/R5hanBlw9m
గతమెంతో ఘనం..
1999 నుంచి 2009 మధ్య కాలంలో ఈ వేదికపై శ్రీలంక ఆడిన 12 టెస్టుల్లో ఆరు విజయాలు సాధించి మిగిలినవి డ్రా చేసుకుని చక్కని ప్రతిభ కనబర్చింది.. కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే భారీ స్కోర్లు సాధించగా, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టేవాడు. సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయ్యాక ఇక్కడి పిచ్ స్వభావం పూర్తిగా మారిపోయిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. తర్వాతి దశాబ్దంలో లంక ఇక్కడ ఆడిన ఏడు టెస్టుల్లో మూడింట్లో మాత్రమే గెలిచి, నాలుగింట్లో ఘోర పరాజయం పాలైంది. రెండు సార్లు ఇండియా, పాకిస్తాన్ జట్లకు 400 కంటే ఎక్కువ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకుని, ఓటమి పాలైంది.
A memorable evening in Colombo!
— BCCI (@BCCI) August 21, 2026
H.E. Mr. Santosh Jha - High Commissioner of India to Sri Lanka - hosted #TeamIndia 🇮🇳 at the India House in Colombo ahead of the second Test against Sri Lanka. @MEAIndia | @IndiainSL | @santjha | #SLvIND pic.twitter.com/ft2oZEyUz5
భారత్ ఆధిపత్యం..
సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి జట్లపై మాత్రమే లంక ఇక్కడ విజయాలు సాధించింది. సీనియర్ల శకం ముగిసిన తర్వాత ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు ఇక్కడ సులభంగా ఆధిపత్యం కనబర్చాయి. రాబోయే రెండో టెస్టులో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు జోస్యం చెబుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు మ్యాచ్ పై పట్టు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. సిరీస్ డ్రా చేయాలనే పట్టుదలతో ఉన్న ఆతిథ్య జట్టు పిచ్ రూపకల్పనలో ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సొంతం చేసుకోవడంతోపాటు, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మరింత ముందుకు పోతుంది టీమిండియా.
Before You Go
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
ట్రెండింగ్ వార్తలు



















