అన్వేషించండి

5 States Assembly Results: 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇవే - 3 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 హంగ్

election results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా చూపించింది. బెంగాల్ , అస్సాం, పుదుచ్చేరిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. తమిళనాడులో హంగ్ ఏర్పడింది.

5 state election results:  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో కొత్త మార్పులు తెస్తున్నాయి.  పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ తన జైత్రయాత్రను కొనసాగించగా, కేరళలో దశాబ్ద కాలం తర్వాత  కాంగ్రెస్ మళ్ళీ పీఠాన్ని దక్కించుకుంది. అయితే, అందరినీ విస్మయానికి గురిచేస్తూ తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే  ప్రభంజనం సృష్టించి, రాష్ట్రాన్ని హంగ్  దిశగా నడిపించింది.

 బెంగాల్‌లో కాషాయ రేఖ - అస్సాంలో హిమంత హ్యాట్రిక్ 

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ 15 ఏళ్ల   పాలనకు బీజేపీ చరమగీతం పాడింది. సువేందు అధికారి నాయకత్వంలో  200 కంటే ఎక్కువ స్థానాల్లో  విజయకేతనం ఎగురవేసి, బీజేపీ అక్కడ మొదటిసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అటు అస్సాంలో ముఖ్యమంత్రి  హిమంత బిశ్వ శర్మ  తన అభివృద్ధి మంత్రంతో వరుసగా మూడోసారి బీజేపీని విజయతీరాలకు చేర్చి  హ్యాట్రిక్  నమోదు చేశారు. పుదుచ్చేరిలో కూడా ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంది.

 కేరళలో మళ్ళీ చేయి - ఎల్‌డీఎఫ్ పతనం 

కేరళలో పినరయి విజయన్ వరుసగా మూడోసారి గెలిచి రికార్డు సృష్టిస్తారన్న అంచనాలను ఓటర్లు తలకిందులు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్  100 కంటే ఎక్కువ స్థానాల్లో  ఆధిక్యం సాధించి తిరుగులేని విజయాన్ని అందుకుంది. పదేళ్ల కమ్యూనిస్టు పాలనపై ఉన్న అసంతృప్తి, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం, అవినీతి ఆరోపణలు కాంగ్రెస్‌కు పట్టం కట్టేలా చేశాయి. సతీశన్,  చెన్నితల నాయకత్వంలో యూడీఎఫ్ మళ్ళీ కేరళ కోటను హస్తగతం చేసుకుంది.

 తమిళనాడులో విజయ్ విప్లవం -  హంగ్ ముంగిట రాష్ట్రం                           

తమిళనాడు ఫలితాలు ఈ ఎన్నికల్లోనే అత్యంత సంచలనంగా మారాయి. ఎవరూ ఊహించని విధంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం 109 స్థానాల్లో ముందంజలో ఉండి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యమంత్రి  స్టాలిన్  తన కంచుకోట కొలత్తూరులో ఓడిపోవడం డీఎంకే పతనానికి నిదర్శనంగా నిలిచింది. అన్నాడీఎంకే 55 స్థానాలతో, డీఎంకే 52 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏ పార్టీకీ 118 మార్కు అందకపోవడంతో, విజయ్  ఇప్పుడు ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 

 ముగిసిన ద్రవిడ యుగం - కొత్త శకానికి నాంది                          

ఈ ఐదు రాష్ట్రాల తీర్పు భారత రాజకీయాల్లో స్పష్టమైన మార్పును సూచిస్తోంది. వారసత్వ రాజకీయాలను, సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారిని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. బెంగాల్‌లో మమత, కేరళలో విజయన్, తమిళనాడులో స్టాలిన్ వంటి దిగ్గజాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. అభివృద్ధిని, కొత్త ముఖాలను ఆదరిస్తూనే.. జాతీయ స్థాయిలో బీజేపీ పట్టును, ప్రాంతీయ స్థాయిలో విజయ్ వంటి కొత్త శక్తుల ఎదుగుదలను ఈ ఎన్నికలు ధృవీకరించాయి. రాబోయే కొద్ది రోజుల్లో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై జరిగే రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించనున్నాయి.        

 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget