అన్వేషించండి

White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే

Best Rice for Diabetes : డయాబెటిస్ నియంత్రణలో కేవలం మందులు మాత్రమే కాదు, ఆహారపు అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ సమయంలో వైట్ రైస్ తింటే మంచిదా? బ్రౌన్ రైస్ మంచిదా? చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మధుమేహులు బ్రౌన్ రైస్ తీసుకోవడం చక్కెర నియంత్రణకు మేలు.
  • దీని ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర పెరగకుండా చూస్తుంది.
  • బ్రౌన్ రైస్ పోషకాలను అందిస్తూ, బరువు, ఇన్సులిన్ మెరుగుపరుస్తుంది.

White Rice or Brown Rice for Diabetes : ఎంత డైట్, బరువు తగ్గాలి, హెల్తీగా ఉండాలి అనుకున్నా.. కొందరు అన్నం లేకుండా ఉండలేరు. అలాంటివారు మధుమేహంతో ఇబ్బంది పడుతుంటే బియ్యం తినాలా? వద్దా? అనే సందేహం కలుగుతుంది. వైట్ రైస్ తింటే షుగర్ పెరిగిపోతుందా? లేక బ్రౌన్ రైస్‌కు మారాలా? అనే డైలామాలో ఉంటారు. మరి దీనిపై నిపుణుల సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకునే వారికి బ్రౌన్ రైస్ మెరుగైన ఎంపిక. కానీ బ్రౌన్ రైస్ తీసుకోవడంలో కూడా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. బ్రౌన్ రైస్ వల్ల మధుమేహం ఉన్నవారికి కలిగే లాభాలు ఏంటో.. దీనిని ఎలా తీసుకోవాలో చూసేద్దాం. 

Also Read : ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ ఫుడ్స్ మానేసి.. ఇవి తింటే మధుమేహం రాదట, ఫాలో అయిపోండి

పోషకాలకు నిలయం

బ్రౌన్ రైస్‌లో పై పొర, జెర్మ్ అలాగే ఉండటం వల్ల ఇందులో ఫైబర్, బి విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అదే వైట్ రైస్ పాలిషింగ్ సమయంలో చాలా వరకు తొలగిపోతాయి.

రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగనీయదు

బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా భోజనం తర్వాత షుగర్ ఒక్కసారిగా పెరిగే అవకాశం తగ్గుతుంది.

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ

గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక ఆహారం రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో తెలిపే సూచిక. బ్రౌన్ రైస్ GI వైట్ రైస్ కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇది మెరుగైన ఎంపికగా భావిస్తారు.

Also Read : మధుమేహం ముప్పును తగ్గించే 5 మార్పులు.. మిల్లెట్స్, నిద్ర విషంలో ఆ తప్పులు చేయకండి

క్రేవింగ్స్ కంట్రోల్

బ్రౌన్ రైస్ తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో మధ్యలో జంక్ ఫుడ్ లేదా స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.

ఇన్సులిన్ పనితీరుకై

బ్రౌన్ రైస్‌లో ఉండే మెగ్నీషియం శరీరంలో గ్లూకోజ్ జీవక్రియ సక్రమంగా జరిగేందుకు, ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

బరువు నియంత్రణ

బ్రౌన్ రైస్ ఎక్కువసేపు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దీంతో మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణకు, తద్వారా మధుమేహ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది.

Also Read : వర్షాకాలంలో మధుమేహం ఉన్నవారు ఈ ఫుడ్స్ మానేయాలి.. షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాలు ఇవే

ఎలా తీసుకుంటే మంచిది?

బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని.. ఎక్కువ పరిమాణంలో తినకూడదు. ప్లేట్‌లో సగం కూరగాయలు, పావు భాగం ప్రోటీన్, మిగిలిన పావు భాగం బ్రౌన్ రైస్ ఉండేలా చూసుకోవడం మంచిది. అప్పుడే అది సమతుల్య ఆహారంగా మారుతుంది. అలాగే బ్రౌన్ రైస్కి మారే ముందు.. వైట్ రైస్ 50%, బ్రౌన్ రైస్ 50% కలిపి తినవచ్చు. తర్వాత క్రమంగా పూర్తిగా బ్రౌన్ రైస్‌కు ఈజీగా మారగలుగుతారు.

మధుమేహం లేకున్నా..

బ్రౌన్ రైస్ కేవలం మధుమేహం ఉన్నవారికే కాదు. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బరువు నియంత్రణ కోసం కూడా ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. అయితే ఏ బియ్యం తిన్నా పోర్షన్ కంట్రోల్, సమతుల్యమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget