దాల్చిన చెక్క నీరు మధుమేహాన్ని(Diabetes) కంట్రోల్ చేస్తుందా?

Published by: Geddam Vijaya Madhuri

దాల్చిన చెక్కలో ఉండే కొన్ని సహజ సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.

భోజనం తర్వాత షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కణాలకు కలిగే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గుతుంది.

దీర్ఘకాలిక వాపు మధుమేహంతో సంబంధం కలిగి ఉంటుంది. దాల్చిన చెక్కలోని కొన్ని పదార్థాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్క నీరు కొందరిలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడవచ్చు.

హెల్తీ ఫుడ్, వ్యాయామంతో పాటు దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. ఇది బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది.

చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు కలపకుండా చేసిన దాల్చిన చెక్క నీరు తక్కువ కేలరీలతో ఉండే ఆరోగ్యకరమైన పానీయం అవుతుంది.

అధిక పరిమాణంలో దాల్చిన చెక్క తీసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇప్పటికే షుగర్ మందులు లేదా ఇన్సులిన్ తీసుకుంటున్నవారు దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర మరీ తగ్గిపోవచ్చు.

ఒక గ్లాస్ నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే వడకట్టి తాగవచ్చు. లేదా 5–10 నిమిషాలు మరిగించి తాగవచ్చు.

దాల్చిన చెక్క నీరు మధుమేహానికి మందు కాదు. హెల్తీ ఫుడ్, వ్యాయామం, చికిత్సతో పాటు తీసుకుంటే మాత్రమే ఉపయోగపడుతుంది.