బట్టలు వాషింగ్ మిషన్​లో ఉతికేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాషింగ్​ మిషన్​లో బట్టలు ఉతుకుతున్నారా? అయితే మీరు వీటి గురించి తెలుసుకోవాలి.

ఈ టిప్స్ ఫాలో అయితే బట్టలు రంగు మారడం నుంచి.. మన్నిక వరకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

మిషన్​లో ఉతికినప్పుడు కొన్ని రోజులకు కొన్ని డ్రెస్​లు రంగు వదిలిపోతాయి.

అలా రంగు పోకుండా ఉండాలంటే.. ఉతికేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

వాషింగ్​ మిషన్​లో బట్టలు ఉతికేప్పుడు అందరూ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే అన్ని కలిపి మిషన్​లో వేసేయడం.

ఇది అస్సలు మంచిది కాదట. రంగుల ప్రకారం దుస్తులను డివైడ్ చేసి.. అప్పుడు మిషన్​లో వేయాలి.

అలాగే ఏదైనా మరకలు అంటుకుంటే లేట్ చేయకుండా ముందుగానే వాష్ చేస్తే మొండి మరకలు సులువుగా వదిలిపోతాయి.

బట్టలు ఉతికేప్పుడు డ్రెస్ లేబుల్స్​పై ఇచ్చిన సూచనలు ఫాలో అవ్వాలి. లేదంటే మన్నిక తగ్గిపోతుంది.

వాటిని బట్టి నీటి ఉష్ణోగ్రత, డిటార్జెంట్ మోతాదును వేసి వాష్ చేసుకోవాలి.

ప్రింట్ ఉండే దుస్తులు ఉతికేప్పుడు గోరువెచ్చని నీటితో వాష్ చేస్తే మంచిది.