డెంగ్యూ సీజన్ ఇదే.. లక్షణాలు గుర్తిస్తే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

అధిక జ్వరం వస్తుంది. డెంగ్యూ వచ్చినప్పుడు ఒక్కసారిగా 102–104°F వరకు అధిక జ్వరం రావచ్చు.

తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. ముఖ్యంగా నుదిటి భాగంలో, కళ్ల వెనుక భాగంలో నొప్పి ఎక్కువగా అనిపించవచ్చు.

కీళ్లు, కండరాల నొప్పులు వేధిస్తాయి. శరీరం మొత్తం నొప్పిగా ఉండటం డెంగ్యూకు సాధారణ లక్షణం.

అధిక అలసట కనిపిస్తుంది. చిన్న పని చేసినా నీరసంగా, బలహీనంగా అనిపించవచ్చు.

వికారం, వాంతులు రావచ్చు. కొంతమందిలో ఆకలి తగ్గడంతో పాటు వికారం, వాంతుల సమస్య కనిపిస్తుంది.

చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావచ్చు. జ్వరం వచ్చిన కొన్ని రోజుల తర్వాత చర్మంపై చిన్న ఎర్రటి మచ్చలు కనిపించవచ్చు.

కళ్ల నొప్పి లేదా అసౌకర్యం ఉంటుంది. కళ్లను కదిలించినప్పుడు నొప్పి లేదా ఒత్తిడి అనిపించవచ్చు.

ప్లేట్‌లెట్స్ తగ్గే ప్రమాదం ఉంటుంది. డెంగ్యూ తీవ్రత పెరిగితే రక్తంలోని ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గవచ్చు.

ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం కావచ్చు. తీవ్రమైన డెంగ్యూ కేసుల్లో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.

జ్వరం, తీవ్రమైన నొప్పులు, నీరసం వంటి లక్షణాలు ఉంటే స్వయంగా మందులు వాడకుండా వైద్య సలహా తీసుకోవాలి.

లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.