పిల్లలకు డబ్బుల(Money) విషయంలో నేర్పించాల్సిన విషయాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

డబ్బు సులభంగా రాదని, దాని కోసం కష్టపడాల్సి ఉంటుందని చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పాలి.

ఏది నిజంగా అవసరమో, ఏది కేవలం కోరికో గుర్తించే అలవాటు పిల్లలకు నేర్పించడం ముఖ్యం.

చిన్న మొత్తమైనా దాచుకునేలా వారిని ప్రోత్సాహించాలి. దీనివల్ల భవిష్యత్తులో మంచి ఆర్థిక అలవాట్లు ఏర్పడతాయి.

డబ్బును ఎలా ప్లాన్ చేసుకుని ఖర్చు చేయాలో పిల్లలకు మంచి, సులభంగా అర్థమయ్యే ఉదాహరణలతో వివరించాలి.

ఏదైనా వస్తువు కొనేముందు అది నిజంగా అవసరమా అని ఆలోచించే అలవాటు పెంచాలి.

తమకు నచ్చిన బొమ్మ లేదా వస్తువు కొనుగోలు కోసం కొంతకాలం డబ్బు పొదుపు చేయడం నేర్పించాలి.

అవసరం లేకుండా అప్పులు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులను పిల్లలకు అర్థమయ్యేలా చెప్తూ ఉండాలి.

ఆన్‌లైన్ పేమెంట్లు, UPI, కార్డులు ఉపయోగించినా డబ్బు ఖర్చవుతుందనే విషయాన్ని పిల్లలు తెలుసుకోవాలి.

తమ వద్ద ఉన్న డబ్బులో కొంత భాగాన్ని అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించడం గొప్ప అలవాటు.

వెంటనే కొనిపెట్టమని అడిగిన ప్రతిదీ ఇవ్వకుండా, వేచి ఉండడం, సరైన నిర్ణయం తీసుకోవడం నేర్పాలి.