అన్వేషించండి

Kidney Health : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి? నిపుణుల సూచనలు ఇవే

Kidney Health in Summer : వేసవిలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిడ్నీలు హెల్తీగా ఉండేందుకు రోజుకు ఎంత నీరు తాగితే మంచిదో.. నిపుణుల సలహాలు ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కిడ్నీలు వ్యర్థాలను తొలగించి, ఖనిజ సమతుల్యతను కాపాడతాయి.
  • తక్కువ నీరు తాగితే కిడ్నీలపై భారం పెరిగి, టాక్సిన్స్ పేరుకుపోతాయి.
  • మహిళలు 2.7 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు తాగాలని సూచన.
  • మూత్రం రంగు, విసర్జన ద్వారా శరీర నీటి అవసరాన్ని తెలుసుకోవచ్చు.

Water Intake for Kidney Health : శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటిగా చెప్తారు. ఎందుకంటే ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను, టాక్సిన్స్‌ను మూత్ర రూపంలో బయటకు పంపించడమే కాకుండా.. సోడియం, పొటాషియం వంటి ఖనిజాల సమతుల్యతను కూడా కాపాడుతాయి. అయితే కిడ్నీలు సరిగ్గా పనిచేయాలంటే ఎంత నీరు తాగాలి? అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీని గురించిన పూర్తి వివరాలు, వైద్యుల సూచనలు తెలుసుకుందాం. 

కిడ్నీలకు నీరు ఎందుకు అవసరం?

మీరు నీరు తక్కువగా తాగితే కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతతో పాటు టాక్సిన్స్ నిల్వ పెరుగుతుంది. డీహైడ్రేషన్ సమస్య పెరిగి.. తలనొప్పి, అలసట, బలహీనత వంటివి జరుగుతాయి. అలాగే చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

రోజుకు ఎంత నీరు తాగాలి?

నిపుణుల సూచనల ప్రకారం కిడ్నీలతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు.. మహిళలు రోజుకు సుమారు 2.7 లీటర్లు అంటే 11 గ్లాసులు.. మగవారు రోజుకు సుమారు 3.7 లీటర్లు అంటే దగ్గరగా 15 గ్లాసుల నీరు తాగాలని సూచిస్తున్నారు. ఈ మొత్తం నీటితో పాటు పండ్లు, కూరగాయలు, జ్యూస్‌ల ద్వారా వచ్చే హైడ్రేషన్ కూడా శరీరానికి అందించాలని చెప్తున్నారు. 

ఈ కొలత ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. మీ శరీరం నీటి అవసరం, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణంలో మార్పులు, శారీరక శ్రమ, వయస్సు, గర్భధారణ లేదా పాలిచ్చే తల్లులు, ఇతర ఆరోగ్య పరిస్థితులు, కిడ్నీ, గుండె సమస్యలు ఉంటే అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగం ఉంటుంది. 

నీరు సరిపోతుందో లేదో ఎలా తెలుసుకోవాలి?

మీరు సరిగ్గా వాటర్ తీసుకోకుంటే మీ శరీరం కొన్ని సూచనలు ఇస్తుంది. మూత్రం లైట్ యెల్లో కలర్‌లో ఉంటే.. మీరు హైడ్రేటెడ్గా ఉంటారని అర్థం. డార్క్ యెల్లో ఉంటే నీరు తక్కువ తాగుతున్నారని సూచన. రోజుకు 4 నుంచి 6 సార్లు మూత్ర విసర్జన చేస్తే నార్మల్. ఇలాంటి సూచనలు మీ శరీరానికి ఎంత నీరు అవసరమో చెప్తాయి. 

కిడ్నీ ఆరోగ్యానికి అదనపు టిప్స్

ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీరు తాగండి. దాహం వేసే వరకు ఆగకుండా మధ్యలో తాగుతూ ఉండండి. అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తగ్గించండి. షుగర్ డ్రింక్స్, సోడాలకు దూరంగా ఉండాలి. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీరు ఎక్కువగా ఉన్న పండ్లు తినండి. మితమైన వ్యాయామం చేయాలి. ఆల్కహాల్, కాఫీ అధికంగా తీసుకోవద్దు

నిపుణుల సూచనలు 

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజంతా ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగడం కాకుండా కొద్దికొద్దిగా తాగడం మంచిది. డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి సమ్మర్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు నీటి పరిమాణం తీసుకోవాలి. హైడ్రేషన్ కేవలం నీరు మాత్రమే కాదు.. హెల్తీ లిక్విడ్స్, ఫుడ్స్ ద్వారా కూడా పొందవచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget