అన్వేషించండి

Toxic In Laws : టాక్సిక్ అత్తమామలతో ఇబ్బందిపడుతున్నారా? మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఈ రిలేషన్‌షిప్ టిప్స్ ఫాలో అవ్వండి

Relationship Tips : అత్తమామలే మీ మ్యారేజ్​ లైఫ్​లో టాక్సిక్ అనుకుంటున్నారా? అయితే మీరు, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే.. ​ఈ రిలేషన్​షిప్ టిప్స్ ఫాలో అయిపోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అత్తమామల టాక్సిక్ ప్రవర్తనకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యం.
  • భాగస్వామి మద్దతుతో కలిసి సమస్య పరిష్కరించుకోవాలి.
  • అనవసర వాదనలకు పోకుండా 'గ్రే రాక్' పద్ధతి వాడండి.
  • మానసిక ప్రశాంతత కోసం అవసరమైతే దూరం పాటించండి.

Tips to Deal With Toxic In Laws : మ్యారేజ్ లైఫ్​లో భాగస్వామితో పాటు.. అత్తమామలు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వైవాహిక జీవితం హ్యాపీగా ఉండాలన్నా.. గొడవలతో నిండాలన్నా.. అది వీరి వల్లనే జరుగుతుంది. అర్థం చేసుకునే అత్తారిల్లు ఉంటే.. పుట్టినిల్లు కూడా గుర్తురాకుండా ఉంటుంది. కానీ మీ అత్తమామలే మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు.. టాక్సిక్​గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుందా? అయితే వారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిపే అంశాలు ఇక్కడ ఉన్నాయి. చదివేండి. 

కొన్నిసార్లు తెలిసో.. తెలియకో అత్తమామలు ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. మీ అత్తమామలు నిజంగా టాక్సిక్​గా ఉన్నప్పుడు.. మీరు, మీ భాగస్వామి మీ సొంత పరిమితులు నిర్దేశించుకుని.. వాటికి కట్టుబడి ఉండాలి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే ప్రధాన అజెండాగా ఉండాలి. అలా ఉండేందుకు ఫాలో అవ్వాల్సిన సులభమైన, ప్రభావవంతమైన మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సమస్య తెలుసుకోండి..

ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు.. దానికి గల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే టాక్సిక్​ ప్రవర్తన అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు. ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఈ బిహేవియర్ వస్తుంది. 

కొన్నిసార్లు అత్తమామలు మీ పెంపకం నియమాలను అగౌరవపరుస్తారు. మిమ్మల్ని స్వార్థపరులుగా పిలిచి.. మీ వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు. లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి మిమ్మల్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే మీరు చేయాల్సిన మొదటి పని.

పార్టనర్​ సపోర్ట్ ఉండాలి..

అత్తమామలు టాక్సిక్​గా ఉన్నప్పుడు మీరు, మీ భాగస్వామి ఒకే అభిప్రాయంతో లేకపోతే.. మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యను మీరిద్దరూ కలిసి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి సందర్భాల్లో ఎవరు చెప్తే..  తల్లిదండ్రులు మాట వింటారో వారే నేరుగా మాట్లాడాలి. అలా కాకుండా ఇతరులు మాట్లాడితే మరిన్ని అపార్థాలు పెరగవచ్చు. కాబట్టి మీరిద్దరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.

వ్యర్థ వాదనలు ఎందులకు..

కొన్నిసార్లు వాదించడం లేదా వివరించడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు గ్రే రాక్ పద్ధతి ఉపయోగించాలి. దీని అర్థం సంభాషణలో ఎక్కువ ప్రతిస్పందనలు ఇవ్వకుండా.. అవును, సరే, నాకు అర్థమైంది వంటి చిన్న చిన్న రెస్పాన్స్ ఇస్తే సరిపోద్ది. కాబట్టి ఎప్పుడూ వివరంగా వివరించడానికి ప్రయత్నించకండి. స్పష్టంగా, మర్యాదగా రెస్పాండ్ అయితే చాలు. మీరు వారిని నియంత్రించలేరు కాబట్టి.. వారు కోపంగా ఉన్నా.. అతిగా స్పందిస్తున్నా.. లేదా మౌనంగా ఉన్నా.. అదే వారి మనస్తత్వం అని భావించండి. అంతేకానీ మిమ్మల్ని మీరు తప్పుపట్టకండి. 

కొన్నిసార్లు తప్పుమే కాదు..

మీ అత్తమామల ప్రవర్తన మీకు బాధను ఇస్తున్నా లేదా మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నా.. కొన్నిసార్లు వారికి దూరంగా ఉండటమే బెటర్. అంటే వారితో సంబంధాన్ని లిమిటెడ్​గా ఉంచుకోండి. ఇది తప్పేమీ కాదు. మీ మనశ్శాంతిని కాపాడుకునే మార్గం మాత్రమే. మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్తే.. మీ వివాహబంధానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇది మీకు, మీ భాగస్వామికి ఇద్దరికీ రక్షణను అందిస్తుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget