అన్వేషించండి

Age Gap for a Happy Marriage : మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. అబ్బాయి, అమ్మాయి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?

Age Gap in Marriage : పెళ్లి చేసుకునేవారి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత తేడా ఉంటే.. వారి మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందో తెలుసా? నిపుణుల అభిప్రాయాలు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భార్యాభర్తల మధ్య 5-7 ఏళ్ల వయసు తేడా మేలు.
  • తక్కువ గ్యాప్ ఉంటే ఈగో, పట్టుదల ఎక్కువగా ఉంటాయి.
  • ఎక్కువ గ్యాప్ ఉన్నా, సహనం, గౌరవం ముఖ్యం.
  • వయసు కంటే మెచ్యూరిటీ, అభిరుచులు బంధాన్ని బలపరుస్తాయి.

Best Age Difference Between Couples : జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాల్లో పెళ్లి అనేది అతి ముఖ్యమైన, సెన్సిటివ్ విషయం. ఈ నిర్ణయాల్లో చిన్న తప్పు చేసినా.. లైఫ్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరి జీవితాలను కలిపే ఈ బంధంలో ప్రేమ, అర్థం చేసుకోవడం, గౌరవం అనేవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మరి వీటితో పాటు.. వయసు కూడా ఈ బాండింగ్​కి ఎంతవరకు అవసరం? అసలు భార్యాభర్తల మధ్య వయస్సు ఎంత తేడా ఉంటే మంచిదో.. నిపుణుల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. 

ఇండియన్ మ్యారేజ్​ హిస్టరీలో ​భర్త భార్యకంటే కొంత పెద్దవాడిగా ఉంటారు. కానీ ఎంత వయసు తేడా ఉంటే హ్యాపీగా ఉంటారో.. పరిశోధనలు ఏమి చెబుతున్నాయో చూద్దాం.

5–7 సంవత్సరాల గ్యాప్ 

కొన్ని పరిశోధనల ప్రకారం.. భార్యాభర్తల మధ్య 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు తేడా ఉండటం మంచిదిగా భావిస్తున్నారు. ఈ గ్యాప్ వల్ల ఇద్దరి మధ్య మెచ్యూరిటీ, అర్థం చేసుకోవడం కొంత బెటర్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వయస్సు తేడా ఎక్కువగా ఉంటే.. వారి అభిప్రాయాలు, జీవనశైలి, ఆసక్తులు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. దీని వల్ల కొన్నిసార్లు విభేదాలు రావచ్చని తెలిపారు.

పరిశోధనల ప్రకారం 25 ఏళ్ల లోపు ఉన్న మగవారు బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చని.. మహిళలు సాధారణంగా 21 ఏళ్లకే కొంత ఎక్కువ పరిణతిని చూపుతారని.. కాబట్టి వయసు తేడా కంటే మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. 

తక్కువ గ్యాప్ ఉంటే ఇబ్బందులు ఉంటాయా?

మిథునం మధ్య తక్కువ గ్యాప్.. అంటే 1–2 సంవత్సరాల గ్యాప్ ఉంటే కొన్ని సవాళ్లు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇద్దరూ ఒకే లైఫ్ స్టేజ్​లో ఉంటారు. అలాగే వారి మధ్య ఈగో, పట్టుదల కూడా ఎక్కువగా ఉండొచ్చు. అలాగే చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 

ఎక్కువ గ్యాప్ ఉంటే..

భార్య, భర్తల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే.. పెద్దవారు కాస్త సహనంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నవారు గౌరవంతో వినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం సులభమవుతుంది. అలా అని ఇది ప్రతి జంటకు ఒకేలా ఉంటుందని చెప్పలేము.

మెచ్యూరిటీ ఉండాలి.. 

పెళ్లి మాత్రమే కాదు.. ఏ బంధంలో అయినా వయసు కంటే మెచ్యూరిటీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. పరిణతి అనేది చాలా కీలకమైన అంశంగా చెప్తారు. ఎందుకంటే వయసు గ్యాప్ సరిపోయినా.. ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా.. మెచ్యూరిటీ లేకుంటే ఆ బంధంలో గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంది. 

అలాగే వయస్సు ఎంతైనా సరే.. కామన్ ఇంట్రెస్ట్స్ ఉండటం చాలా ముఖ్యం. ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, మంచి కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. కలిసి సినిమాలు చూడటం, ట్రావెల్ చేయడం, ఫుడ్, హాబీస్ షేర్ చేసుకోవడం జరిగితే బాండింగ్ బాగా పెరుగుతుంది. ఇలాంటి చిన్న విషయాలే బంధాన్ని బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget