అన్వేషించండి

Warning Signs of Liver : ముఖంలో ఈ మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు.. అవే లివర్ డ్యామేజ్ సంకేతాలు కావచ్చు

Liver Problems : మీ ముఖంలో కనిపించే కొన్ని మార్పులు మీ లివర్ హెల్త్ అప్​డేట్ ఇచ్చేస్తాయి. కాబట్టి ఆ లక్షణాలు లైట్ తీసుకోవద్దని చెప్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాలేయానికి హాని జరిగితే చర్మం, కళ్ల రంగు మారవచ్చు.
  • అరచేతుల్లో ఎరుపుదనం, చర్మంపై సాలీడు గూడు మచ్చలు.
  • ముఖం, కళ్ల కింద వాపు, చర్మ సమస్యలు పెరగవచ్చు.
  • ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Facial Signs of Liver Damage : కాలేయం ఆరోగ్యం మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా కీలకం. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద సమస్యలకు సంకేతాలు కావచ్చు. కాబట్టి ముఖం, చర్మం, కళ్లలో మార్పులు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్త పడాలి. అవేదో నార్మల్​గా వచ్చే మార్పులు అనుకుంటే మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు నిపుణులు. 

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. లివర్​ అనేది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడం నుంచి.. జీర్ణక్రియకు సహాయం చేయడం వరకు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి కీలక పనులు చేస్తుంది. అయితే కాలేయం సరిగా పనిచేయకపోతే.. కొన్ని హెచ్చరిక సంకేతాలు ముందుగానే ముఖంపై, చర్మంపై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం, కళ్ల రంగులో మార్పులు

కాలేయం దెబ్బతిన్నప్పుడు రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని సాధారణంగా జాండీస్ (Jaundice) అంటారు. చాలామంది దీనిని అలసటగా భావించి వదిలేస్తారు. కానీ ఇది కాలేయ సమస్యకు మొదటి హెచ్చరిక కావచ్చు. చర్మం ముదురు రంగులోకి మారడం లేదా లేతగా కనిపించడం, సులభంగా గాయాలు అవ్వడం వంటి సమస్యలు కూడా కాలేయానికి సంబంధించినవే. ఈ మార్పులు నెమ్మదిగా కనిపిస్తాయి కాబట్టి చాలామంది గమనించరట.

అరచేతుల్లో ఎరుపు 

కాలేయ వ్యాధి ఉన్నవారిలో అరచేతుల్లో ఎర్రదనం కనిపిస్తుంది. ముఖ్యంగా అరచేతి మధ్య భాగంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రక్తప్రవాహం మార్పుల వల్ల జరుగుతుంది. దీర్ఘకాలం కొనసాగితే.. కాలేయం బలహీనమవుతోందని అర్థం.

చర్మంపై మచ్చలు

చర్మంపై చిన్న చిన్న ఎర్ర మచ్చలు, సాలీడు గూడు లాంటి ఆకారంలో కనిపిస్తాయి. వీటిని “Spider Angioma” అంటారు. ఇవి ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కాలేయ సమస్య పెరిగేకొద్దీ ఇవి మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

ముఖం, కళ్ల కింద వాపు

కాలేయ పనితీరు తగ్గిపోతే శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. దీనివల్ల ముఖం.. ముఖ్యంగా కళ్ల కింద వాపు కనిపిస్తుంది. ఇవి ఉదయం సమయంలో ఎక్కువగా కనిపించి.. కొన్నిసార్లు రోజంతా అలాగే ఉండొచ్చు.

చర్మ సమస్యలు 

కాలేయం టాక్సిన్స్‌ను బయటకు పంపలేకపోతే అవి శరీరంలో పేరుకుపోతాయి. దీనివల్ల మొటిమలు, దద్దుర్లు, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు పెరుగుతాయి.

కళ్లలో పసుపు ఎక్కువగా కనిపించడం

కాలేయ సమస్యలలో కళ్లలో పసుపు రంగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు చర్మంపై కనిపించకపోయినా.. కళ్లలో మాత్రం త్వరగా గుర్తించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక సంకేతం.

ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలంటే.. 

ముఖంలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే.. డాక్టర్‌ను సంప్రదించాలి. లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి. ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభిస్తే కాలేయం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మంచి ఫుడ్, వైద్య సహాయం తీసుకుంటూ లివర్ హెల్త్ కాపాడుకోవచ్చు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget